Representation of People Act
-
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్‌లు... అయితే ఏంటి?
ఈవీఎంపై ఇద్దరు రాహుల్ గాంధీలు కనిపిస్తే? ఎవరికి ఓటేయాలి? ఇది ఎంతో కొంతమంది ఓటర్లను అయోమయానికి గురి చేసే అంశమే. కీలక అభ్యర్థుల పేర్లను పోలిన వారిని ప్రత్యర్థి పారీ్టలు బరిలో దించి ఓట్లను చీల్చడం పరిపాటే. కొన్నిసార్లు అభ్యర్థుల గెలుపోటములనే ప్రభావితం చేసే ఈ పోకడకు చెక్ పెట్టాలంటూ ‘సాబు స్టీఫెన్’ అనే వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోనే పిల్ వేశారు! అదే పేరుతో మరొకరు పోటీలో ఉండడం వల్ల వెంట్రుకవాసి తేడాతో ఓటమి పాలైన ఉదంతాలను ఉదహరించారు. ‘‘2004 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో అలప్పుజ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వీఎం సుదీరన్ కేవలం 1,009 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడ వీఎస్ సు«దీరన్ అనే ఇండిపెండెంట్‌కు ఏకంగా 8,282 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి పారీ్టలు డబ్బు, తదితరాలు ఎరగా చూపి ఇలాంటి నకిలీలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ చర్యలు ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలకు వ్యతిరేకం’’ అని వాదించారు. ‘‘ప్రముఖ అభ్యర్థుల పేరును పోలిన వారు బరిలో ఉంటే వారి నేపథ్యాన్ని కూలంకషంగా విచారించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. నకిలీలని తేలితే పోటీ నుంచి నిషేధించేలా చూడండి’’ అని కోరారు. కానీ, ఈ పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచి్చంది. ఒకే తరహా పేర్లున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘రాహుల్ గాం«దీ, లాలు ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖుల పేర్లున్న వారిని పోటీ చేయొద్దందామా? తల్లిదండ్రులు ఆ పేర్లు పెట్టిన కారణంగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచగలమా? పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలనేది తల్లిదండ్రుల హక్కు’’ అని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది! – న్యూఢిల్లీ -
Lok sabha elections 2024: ఎన్నికల్లో పోటీకి ఎంత కావాలి?
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బులు తన వద్ద లేవని, అందుకే పోటీకి దూరంగా ఉంటున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనమైంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమె గతంలోనూ లోక్‌సభకు పోటీ చేయలేదు. అందుకు బాగా ధన బలం కావాలని తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. దాంతో ఎన్నికల వ్యయం మరోసారి చర్చనీయాంశంగా మారింది... 2016లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మల 2014 నుంచి 2016 దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గత రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్లో ఆమె తన నికర ఆస్తుల విలువను రూ.2.5 కోట్లుగా ప్రకటించారు. అయినా ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బుల్లేవని స్వయంగా దేశ ఆర్థిక మంత్రే అనడంతో అసలు ఒక అభ్యరి్థకి ఎంత డబ్బుండాలన్నది ఆసక్తికరంగా మారింది. ఎంత కావాలి? ఎన్నికల ప్రచారానికి పార్టీలు ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు. వాటికి పరిమితులేమీ లేవు. కానీ అభ్యర్థులు చేసే వ్యయాలకు మాత్రం పరిమితులున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ట వ్యయ పరిమితి రూ.40 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు రూ.75 లక్షలు, అసెంబ్లీకి రూ.28 లక్షల పరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం విధించింది. పరిమితి దాటితే..? ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయితే 30 రోజుల్లోపు, లోక్‌సభ ఎన్నికలు అయితే 90 రోజుల్లోపు వ్యయాలకు సంబంధించిన అన్ని ఆధారాలను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10ఏ కింద అభ్యరి్థని మూడేళ్ల పాటు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈసీ నిర్ణయించిన పరిమితికి మించి ఎవరైనా ఖర్చు చేసినట్టయితే వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఈసీ ముందు పిటిషన్ దాఖలు చేయవచ్చు. పరిమితికి మించి ఖర్చు చేయడాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(6) కింద అవినీతి చర్యగా ఈసీ పరిగణిస్తుంది. అలాంటప్పుడు సెక్షన్ 10ఏ కింద సదరు అభ్యరి్థపై మూడేళ్లపాటు అనర్హత వేటు పడుతుంది. ఈ ఎన్నికల వ్యయం రూ.లక్ష కోట్ల పై మాటే! 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రూ.1,264 కోట్లు ఖర్చు చేసినట్టు నాడు బీజేపీ ప్రకటించగా, కాంగ్రెస్ వ్యయం రూ.820 కోట్లుగా ఉంది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పారీ్టలు, అభ్యర్థులు చేసిన ఖర్చు రూ.60,000 కోట్లు దాటి ఉంటుందని సెంటర్ ఫర్ మీడియా సరీ్వసెస్ (సీఎంఎస్) అధ్యయనం పేర్కొంది! ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇది ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా. అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సగటున రూ.221 కోట్లు! ఎందుకు పరిమితి? ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశాలు అందరికీ సమానంగా కలి్పంచాలన్నదే వ్యయ పరిమితుల్లోని ఉద్దేశ్యం. తద్వారా ధన బలం కలిగిన అభ్యర్థులది పైచేయి కాకుండా ఉంటుంది. నామినేషన్ వేసినప్పటి నుంచి, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి చేసే వ్యయాలను ఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. అభ్యర్థుల బ్యాంక్ లావాదేవీలను, ఖాతాస్టేట్‌మెంట్లను ఈసీ పరిశీలిస్తుంది. వ్యయాలపై ఎన్నికల పరిశీలకుల నిఘా కూడా ఉంటుంది. ఈసీ గైడ్‌లైన్స్ ఇవీ.. ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థి ప్రచారానికి సంబంధించినది. ఓటర్లకు చేరువయ్యేందుకు చేసే ఖర్చు ఆ పరిమితిని మించరాదు. ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, సమావేశాలు, వాహనాల వినియోగం వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ప్రచార ఖర్చు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్నికల వ్యయ పరిమితులను ఈసీ ఎప్పటికప్పుడు సవరిస్తుంటుంది. నియోజకవర్గంలో పెరిగిన ఓటర్ల సంఖ్యను కూడా పరిశీలనలోకి తీసుకుంటుంది. ఎన్నికల వ్యయ పరిమితిని చివరిసారి 2022లో సవరించింది. తొలుత తక్కువే 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి రూ.25వేల ఖర్చుకే అనుమతించారు. చిన్న రాష్ట్రాల్లోనైతే రూ.10 వేలే. తర్వాత దీన్ని సవరిస్తూ వచ్చారు. చట్టబద్ధమైన వ్యయ పరిమితితో పోలిస్తే, ఒక్కో అభ్యర్థి చేసే వాస్తవ ఖర్చు కోట్లలో ఉంటుందన్నది తెలిసిందే. వందలాది కోట్లు ఖర్చు చేసేవాళ్లూ ఉన్నారు. నగదు, ఇతర కానుకల రూపంలోనూ ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇదంతా అనధికారికంగా నడిచే వ్యవహారం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీహెచ్డీ స్కాలర్, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త ఆబా మురళీధరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్8(3) ‘ఆటోమేటిక్ అనర్హత’ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన వెంటనే అనర్హత వేటు వేయడం చట్ట విరుద్దమని పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో శిక్షలను చట్టం నుంచి మినహాయించాలని విన్నపించారు. ఆటోమెటిక్‌గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని మురళీధరన్ పిటిషన్లో కోరారు. ఈ సెక్షన్ అక్రమంగా, ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3)ను న్యాయసమ్మతం లేకుండా రూపొందించారని, అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛను హరిస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో నేతల్ని ఎన్నుకున్నారని, కానీ ఆ చట్టం వల్ల ఆ నేత తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నట్లు తన పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగబద్ధమేనా? -
363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హతకు వీలున్న క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడే అవకాశమున్న నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఈ కేసులు నిరూపణ అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టంలోని 8వ సెక్షన్ కింద వీరిపై అనర్హత వేటు పడుతుందని ఏడీఆర్ పేర్కొంది. నేరాభియోగాలు నమోదైన వారిలో 39 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. 2019 నుంచి 2021 కాలానికి 542 మంది లోక్‌సభ సభ్యులు, 1,953 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించి ఆయా వివరాలను ఏడీఆర్ బహిర్గతంచేసింది. బీజేపీకి చెందిన 83 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 47 మంది కాంగ్రెస్, 25 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 111 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మొత్తంగా 315 కేసులున్నాయి. బిహార్‌కు చెందిన 54 మంది ఎమ్మెల్యేలపై, కేరళలో 42 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. నలుగురు కేంద్ర మంత్రులు, 35 మంది రాష్ట్ర మంత్రులపై కేసులు ఉన్నాయి. -
‘మై ఓట్ నాట్ ఫర్ సేల్’
సాక్షి, మంగళగిరి : ప్రస్తుత స్వారత్రిక ఎన్నికల సందర్భంగా వాట్సప్‌లో మై ఓట్ నాట్ ఫర్ సేల్ చిత్రం హల్చల్ చేస్తుంది. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేలా ఉండటంతో ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఓటుకు నోటిచ్చినా... తీసుకున్నా... నేరమే అని ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పబ్లిక్ యాక్డ్ 1951లో సెక్షన్ 123(1) చెబుతుంది. ఈ చట్టంలోని 171(బీ) ప్రకారం ఏ వ్యక్తి అయినా ఓటర్ను ప్రలోభపరిచినా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగదు, ఇతరత్రా కానుకలు తీసుకున్నా, ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 171(సీ) ప్రకారం ఓటర్లను ప్రలోభపరిచినా, బెదిరించినా, అనుకూలంగా ఓటు వేయాలని దాడి చేసినా ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి రెండూ విధించవచ్చు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వచ్చినా..!
* మెజారిటీ ఓట్లు వచ్చినవారే విజేత : ఈసీ న్యూఢిల్లీ: అభ్యర్థులను తిరస్కరించే హక్కును కల్పించిన ఎన్నికల సంఘం అందులో చిన్న మెలిక పెట్టింది. ‘పైన పేర్కొన్న అభ్యర్థులెవరూ కాదు(నోటా)’ అనే ఆప్షన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. బరిలో ఉన్న వారిలో మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తామని సోమవారం వెల్లడించింది. సీట్ల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య సమానంగా ఉంటే.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 53(2) సెక్షన్ ప్రకారం ఆ అభ్యర్థులందరూ గెలిచినట్లేనని పేర్కొంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థే గెలిచినట్లు నిర్ధారిస్తామని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో ‘నోటా’ ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ‘నోటా’ ఆప్షన్‌ను ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.