* మెజారిటీ ఓట్లు వచ్చినవారే విజేత : ఈసీ
న్యూఢిల్లీ: అభ్యర్థులను తిరస్కరించే హక్కును కల్పించిన ఎన్నికల సంఘం అందులో చిన్న మెలిక పెట్టింది. ‘పైన పేర్కొన్న అభ్యర్థులెవరూ కాదు(నోటా)’ అనే ఆప్షన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. బరిలో ఉన్న వారిలో మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తామని సోమవారం వెల్లడించింది. సీట్ల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య సమానంగా ఉంటే.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 53(2) సెక్షన్ ప్రకారం ఆ అభ్యర్థులందరూ గెలిచినట్లేనని పేర్కొంది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థే గెలిచినట్లు నిర్ధారిస్తామని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో ‘నోటా’ ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ‘నోటా’ ఆప్షన్‌ను ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వచ్చినా..!
Published Tue, Oct 29 2013 2:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement