
న్యూఢిల్లీ: ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లు కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థ వాటిని పరిరక్షిస్తోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. కేసులను ఆలస్యం చేయడానికే కొందరు తరచూ
వాయిదాలు కోరుతుంటారనీ, దీంతో పేద∙కక్షిదారులపై ‘న్యాయ పన్ను’ పడుతోందన్నారు. పిల్‌లను ప్రవేశపెట్టిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, దివంగత జస్టిస్ పీఎన్ భగవతిపై వచ్చిన ‘లా, జస్టిస్ అండ్ జ్యుడీషియల్ పవర్: జస్టిస్ పీఎన్ భగవతీస్ అప్రోచ్’ అనే ఓ సంకలనాన్ని కోవింద్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment