justice minister
-
తప్పతాగి కారు నడిపి.. నడిరోడ్డుపై మహిళా మంత్రి హల్చల్..
న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్ తప్ప తాగి డ్రైవింగ్ చేసిన కేసులో తన పదవికి రాజీనామా చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి ఓ ప్రమాదానికి కారణం అయినందున ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తప్పని స్థితిలో అరెస్టుకు ముందే ఆమె తన మంత్రి పదవికి అలెన్ రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి తన కారుతో పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. అంతేకాకుండా అలెన్ అరెస్టుకు ఆమె ఏమాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అదే రాత్రి ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించి అక్కడే ఉంచారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని క్రిస్ హిప్రిన్స్.. మంత్రి అలెన్ మానసికంగా కృంగిపోయి ఉన్నారని తెలిపారు. పదవి బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా లేరని తెలిపారు. పైగా క్రిమినల్ కేసు అయినందున రాజీనామాను అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే.. పార్లమెంట్ సభ్యురాలిగా మాత్రం కొనసాగనున్నట్లు తెలిపారు. లేబర్ పార్టీలో చాలా వేగంగా ఎదిగిన అలెన్.. వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నారు. జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన నాటి నుంచి ఆమె మానసికంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే లేబర్ పార్టీ నుంచి మంత్రి పదవి కోల్పోయినవారిలో అలెన్ నాలుగో మంత్రి కావడం గమనార్హం. ఇదీ చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య కుదిరిన ఒప్పందం -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
ఆధార్– ఓటర్ ఐడీ అనుసంధానానికి లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ నెంబర్‌తో అనుసంధానించడం సహా పలు ఎన్నికల సంస్కరణలు పొందుపరిచిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లును హడావుడిగా తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు, దీన్ని స్టాండింగ్ కమిటీ (లా అండ్ జస్టిస్) పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఎన్నికల చట్ట సవరణ బిల్లు –2021ను సోమవారం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడీ– ఆధార్‌ను లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలుగుతుందని, దేశ పౌరులు కాని వారు కూడా ఓటేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆధార్ లింకింగ్‌తో పాటు కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కటాఫ్ డేట్లను (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నిర్ణయించడం, సర్వీసు ఓటర్ నిబంధనలో మార్పును బిల్లులో పొందుపరిచారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో రూ. 3.73 లక్షల కోట్లను వ్యయం చేసుకునేందుకు వీలుకల్పించే సప్లిమెంటరీ గ్రాంట్స్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.62 వేల కోట్లను ఎయిర్ఇండియాకున్న పాత అప్పులు, ఇతరత్రా బకాయిలను చెల్లించడానికి, రూ. 58 వేల కోట్లను ఎరువుల సబ్సిడీకి, రూ. 53 వేల కోట్లను ఎగుమతుల ప్రోత్సాహక బకాయిలను చెల్లించడానికి, రూ. 22 వేల కోట్లను గ్రామీణాభివృద్ధికి వెచ్చిస్తారు. ఒమిక్రాన్‌పై పోరుకు సిద్ధం కరోనా కొత్త వేరియంట్‌పై పోరుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో చెప్పారు. రాబోయే రెండు నెలల్లో దేశ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 45 కోట్ల డోసులకు పెంచుతామని తెలిపారు. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. దేశంలో ఇంతవరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్నారు. మరోవైపు మీడియేషన్ (మధ్యవర్తిత్వ) బిల్లును స్టాండింగ్ కమిటీకి, బయోడైవర్సిటీ బిల్లును జాయింట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం రాజ్యసభ ఎన్డీపీఎస్ చట్టానికి ఆమోదం తెలిపింది. సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ఎందుకింత హడావుడి? ఎన్నికల చట్ట సవరణల బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని విపక్షాలు దుయ్యబట్టాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2.45గంటలకు లోక్‌సభ మళ్లీ సమావేశమైంది. బిల్లును తీసుకురావడంలో ప్రభుత్వం తొందరపాటు చూపిందని, తగిన నిబంధనలు పాటించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరాయి. అయితే పుట్టుస్వామి కేసులో వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే ఈ బిల్లును తెచ్చామని, దీనివల్ల ఎవరైనా ఒక్కచోట మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోగలరని, ఒక్కరే వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉంటే... అలాంటివి గుర్తించి ఏరివేయవచ్చని మంత్రి రిజిజు వివరణ ఇచ్చారు. తద్వారా పారదర్శక ఎన్నికలు జరపవచ్చని అన్నారు. సుప్రీం జడ్జిమెంట్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు అనుగుణంగానే బిల్లు రూపొందిందన్నారు. అలాగే ఆధార్‌తో అనుసంధానం స్వచ్ఛందమని స్పష్టం చేశారు. ఆధార్‌తో లింక్ చేయలేదని ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం జరగదన్నారు. లా అండ్ పర్సనల్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఇప్పటికే బిల్లులో చేర్చినందున మరలా దీన్ని స్టాడింగ్ కమిటీకి పంపాల్సిన పనిలేదన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అయితే బిల్లులో ‘‘ఆధార్ నెంబరు ఇవ్వలేకపోతున్నందువల్ల (నిర్దేశించే సముచిత కారణాన్ని చూపితే)... కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చే ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించ కూడదు, ఓటరు జాబితాలోని ఏ ఒక్క పేరునూ తొలగించడానికీ వీల్లేదు’’ అని మెలిక ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. -
తెరపైకి మళ్లీ ఏఐజేఎస్
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
న్యాయమంత్రి ప్రధానమంత్రిగా..
సియోల్: దక్షిణ కొరియాకు కొత్త ప్రధానిగా ప్రస్తుతం న్యాయమంత్రిత్వశాఖ మంత్రిగా పనిచేస్తున్న హాంగ్ కో అన్ పేరును అధ్యక్షుడు పాక్ గియన్ హై సూచించారు. లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అంతకుముందున్న ప్రధాని లీ వాన్ కూ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఆ పదవి ఖాళీగా ఉండబట్టి 25 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అధ్యక్షుడు ఈ నియామకం ఖరారు చేశారు. ఇలా న్యాయమంత్రిత్వశాఖలో పనిచేసిన ఓ మంత్రి ప్రధానిగా నియామకం కావడం ఇదే తొలిసారి.