న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్ తప్ప తాగి డ్రైవింగ్ చేసిన కేసులో తన పదవికి రాజీనామా చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి ఓ ప్రమాదానికి కారణం అయినందున ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తప్పని స్థితిలో అరెస్టుకు ముందే ఆమె తన మంత్రి పదవికి అలెన్ రాజీనామా చేశారు.
ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి తన కారుతో పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. అంతేకాకుండా అలెన్ అరెస్టుకు ఆమె ఏమాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అదే రాత్రి ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించి అక్కడే ఉంచారు.
ఈ ఘటనపై స్పందించిన ప్రధాని క్రిస్ హిప్రిన్స్.. మంత్రి అలెన్ మానసికంగా కృంగిపోయి ఉన్నారని తెలిపారు. పదవి బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా లేరని తెలిపారు. పైగా క్రిమినల్ కేసు అయినందున రాజీనామాను అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే.. పార్లమెంట్ సభ్యురాలిగా మాత్రం కొనసాగనున్నట్లు తెలిపారు.
లేబర్ పార్టీలో చాలా వేగంగా ఎదిగిన అలెన్.. వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నారు. జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన నాటి నుంచి ఆమె మానసికంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాది అక‍్టోబర్‌లో న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే లేబర్ పార్టీ నుంచి మంత్రి పదవి కోల్పోయినవారిలో అలెన్ నాలుగో మంత్రి కావడం గమనార్హం.
ఇదీ చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య కుదిరిన ఒప్పందం
Comments
Please login to add a commentAdd a comment