12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కోట్యానాయక్ డిమాండ్ చేశారు.
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కోట్యానాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని మాట్లాడారు. పూర్తిస్థాయి రిజర్వేషన్లను అమలు చేయకపోవడం వల్ల 2014–15, 2015–16, 2016–17 విద్యా సంవత్సరంలో అనేక కోర్సుల్లో వేలాదిగా సీట్లు కోల్పోయామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లో ఇప్పటివరకు ప్రకటించిన వాటిల్లో ఉద్యోగాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో 25 వేల గ్రూప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారని, వెంటనే రిజర్వేషన్లకు ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుంటే త్వరలోనే గిరిజనులు పూర్తిస్థాయి పోరాటానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశానికి జాతీయ ఉపాధ్యక్షుడు కేతావత్ నాగేశ్వర్ నాయక్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి ధారావత్ వెంకన్న నాయక్, ఇస్లావత్ సైదానాయక్, వాంకుడోతు రాంజీ నాయక్, బిక్షం నాయక్, నగర రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.