బరువు తగ్గడానికి అడపదడపా ఉపవాసం ఒక ప్రసిద్ధమైన పద్ధతిగా మారింది. దీంతో అయితేనే ఈజీగా బరువు తగ్గుతామని చాలామంది ఈ పద్ధతి వైపుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా హార్వర్డ్ స్టాన్‌ఫోర్డ్ చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి ఈ అడదడప ఉపవాసం ది బెస్ట్ అని కితాబిచ్చారు. ఇది బరువు నిర్వహణ తోపాటు మొత్త ఆరోగ్యానికే మంచి ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కొవ్వుని కరిగించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. దీన్ని గనుక ఈ సింపుల్ టెక్నిక్‌లలో చేస్తే తక్షణమే ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అదెలాగో చేసేద్దామా..!.
డాక్టర్ సేథి బరువు తగ్గడం కోసం మూడు కీలక చిట్కాలను ఫాలోమని చెప్పారు. అవేంటంటే..నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డిటాక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తదితరాలు. ఈ మూడింటిని ఎలా చేయాలో డాక్టర్ సేథి చాలా వివరంగా చెప్పారు.
12:12 ఉపవాస షెడ్యూల్:
డాక్టర్ సేథి 12:12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్‌నే నిర్మాణాత్మక ఉపవాసమని అన్నారు. ఇది అత్యంత తేలికగా నిర్వహించదగిన ప్రక్రియని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉంటారు, మిగతా 12 గంటలు తినడం వంటివి చేస్తారు. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు.
ఈ ప్రక్రియ వల్ల నిద్రలేమి తాలుక సమస్యలు దూరం అవుతాయని అన్నారు. ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారస్తుందని చెప్పారు. అలాగే ఇంత విరామం కారణంగా జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం ఉంటుంది.
ఉపవాస సమయంలో తీసుకోవాల్సినవి..
ఈ పన్నెండు గంటల ఉపవాస సమయంలో కొవ్వుని కరిగించే జ్యూస్‌లు వంటివి తీసుకోవాలి. అంతేతప్ప కూల్‌డ్రింక్‌లు, ఫ్యాట్‌తో కూడిన జ్యూస్‌ల జోలికి వెళ్లకూడదని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, ఫెన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని చెప్పారు సేథి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దుతుని ఇస్తాయి.
మిగతా 12 గంటలు తినే భోజనం ఎలా ఉండాలంటే..
ఈ సమయంలో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టిపెట్టాలి. పనీర్, టోపు, చిక్‌పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం తోపాటు అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వుని తగ్గించడానికి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరానికి ఇంధనంగా మంచి పోషకాలను అందిస్తుంది. చివరగా బరువు తగ్గడంలో ఈ అడపాదడపా ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని క్లినికల్‌గా నిరూపితమైందని నొక్కి చెప్పారు. అయితే ఇక్కడ సరైన విధంగా చేయడంపైనే ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం
(చదవండి: కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!)
Comments
Please login to add a commentAdd a comment