ప్రస్తుతం జీవన విధానంలో బరువు తగ్గడం అనేది అదిపెద్ద సమస్య. ఎన్ని వర్కౌట్‌లు, వ్యాయామాలు చేసినా బరువు తగ్గక ఇబ్బందిపడుతుంటారు. పాపం వేలకు వేలు జిమ్ సెంటర్లు, ఫిట్‌నెస్ సెంటర్లకు డబ్బులు తగలేస్తుంటారు. కానీ కొందరూ మాత్రం ఎలాంటి కఠినమైన డైట్‌లు పాటించరు. శరీరాన్ని కష్టబెట్టేలా వర్కౌట్‌లు, వ్యాయామాలు కూడా చెయ్యరు. అయితే వాళ్లు తమ శరీరానికి సరిపడే విధంగా సొంత డైట్ ప్లాన్‌తో భలే వెయిట్ లాస్ అయ్యి అందర్నీ షాక్‌కి గురిచేస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే భారతీ సింగ్. ఏకంగా 91 కిలోలు ఉండే ఆమె అన్ని కిలోల బరువు ఎలా తగ్గిందంటే..
సెప్టంబర్ 2021 వరకు భారతి సింగ్ 91 కిలోల బరువు ఉండేది. అయితే తాను ఎలాగైనా.. బరవు తగ్గాలని చాలా గట్టిగా అనుకుంది. పలు ప్రయత్నాలు కూడా చేసింది. అలా అని వ్యాయమాలు వంటివి చేయడం ఆమె వల్ల కాదు. ఏదో రకంగా మితంగా తింటూ తగ్గాలి. అందుకోసం ఉపవాసాలు కూడా చెయ్యలేదు. అందుకని ఆమె అడపదడపా ఉపవాసాన్ని సెలక్ట్ చేసుకుంది. ఈ డైట్ విధానం ప్రకారం.. ఓ నిర్థిష్ట నియమానుసారంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. ఆమె మధ్యాహ్నం 12 గంటలు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆహారం తీసుకునేది కాదు.
ఆమెకు పరాఠాలు, వెన్న అంటే మహా ఇష్టం. ఇంట్లో వండిన భోజనమే తినేది ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ టైంలో ఫుల్‌గా తనకిష్టమైన ఆహారం తీసుకునేది. ఆ తర్వాత నుంచి రాత్రి ఏడింటి వరకు ఏమీ ముట్టుకునేది కాదు. అయితే ఆహారం తీసుకునే టైంలో మంచి హెల్తీ ఫుడ్‌ని తీసుకునేది. దీంతో ఆమె 15 నుంచి 16 గంటలు రకు ఏమి తీసుకోకుండా ఉండగలిగేది. అలా ఆమె చాలా శ్రద్ధతో ఒకేటైంలో ఆహారం తీసుకునేలా శ్రద్ధ వహించింది. అందువల్ల రాత్రి ఏడింటి తర్వాత ఆమె శరీరం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారం తీసుకునేందుకు ఇష్టపడదు. దీంతో ఆమె ఆకలిని నియంత్రించగలిగింది. తద్వారా భారతి సింగ్ సుమారు 15 కిలోల బరువు తగ్గిపోయింది. ప్రస్తుతం ఆమె బరువు 76 కిలోలు.
అడపాదడపా ఉపవాసం అంటే..
ఉపవాసానికి, తినడానికి మధ్య చాలాసేపటి వరకు విరామం ఇస్తే దీన్ని అడపాదడపా ఉపవాసం అంటారు. బరువు తగ్గేందుకు, జీవక్రియను మెరుగుపరుచుకునేలా.. ఈజీగా నచ్చిన ఆహారం తీసుకునేలా చేసే సమర్థవంతమైన డైట్ వ్యూహం అని నిపుణుల చెబుతున్నారు. ఈ వ్యూహం ప్రకారం ఎక్కువ సేపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. అదే వీరి ఒంట్లోని కొవ్వుని, కేలరీలను సులభంగా బర్న్ చేస్తుంది. అలాగే ఫుడ్ తీసుకునే సమయంలో మంచి సమతుల్య ఆహారం తప్పనిసరి. ఇక్కడ ఈ డైట్‌లో బరువు తగ్గడం అనేది సదరు వ్యక్తి అంకితభావం, నిలకడ మనస్తత్వం తదితర వాటి కారణంగా బరువు తగ్గడం జరుగుతుంది.
(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?)
Comments
Please login to add a commentAdd a comment