Bharati
-
కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్‌రాజ్‌లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్‌పేమెంట్ రసీదును వాట్సప్‌లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు. -
కఠినమైన డైట్, జిమ్ చెయ్యలేదు..కేవలం పరాఠాలతో బరువు తగ్గడమా..?
ప్రస్తుతం జీవన విధానంలో బరువు తగ్గడం అనేది అదిపెద్ద సమస్య. ఎన్ని వర్కౌట్లు, వ్యాయామాలు చేసినా బరువు తగ్గక ఇబ్బందిపడుతుంటారు. పాపం వేలకు వేలు జిమ్ సెంటర్లు, ఫిట్నెస్ సెంటర్లకు డబ్బులు తగలేస్తుంటారు. కానీ కొందరూ మాత్రం ఎలాంటి కఠినమైన డైట్లు పాటించరు. శరీరాన్ని కష్టబెట్టేలా వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చెయ్యరు. అయితే వాళ్లు తమ శరీరానికి సరిపడే విధంగా సొంత డైట్ ప్లాన్‌తో భలే వెయిట్ లాస్ అయ్యి అందర్నీ షాక్‌కి గురిచేస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే భారతీ సింగ్. ఏకంగా 91 కిలోలు ఉండే ఆమె అన్ని కిలోల బరువు ఎలా తగ్గిందంటే..సెప్టంబర్ 2021 వరకు భారతి సింగ్ 91 కిలోల బరువు ఉండేది. అయితే తాను ఎలాగైనా.. బరవు తగ్గాలని చాలా గట్టిగా అనుకుంది. పలు ప్రయత్నాలు కూడా చేసింది. అలా అని వ్యాయమాలు వంటివి చేయడం ఆమె వల్ల కాదు. ఏదో రకంగా మితంగా తింటూ తగ్గాలి. అందుకోసం ఉపవాసాలు కూడా చెయ్యలేదు. అందుకని ఆమె అడపదడపా ఉపవాసాన్ని సెలక్ట్ చేసుకుంది. ఈ డైట్ విధానం ప్రకారం.. ఓ నిర్థిష్ట నియమానుసారంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. ఆమె మధ్యాహ్నం 12 గంటలు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆహారం తీసుకునేది కాదు.ఆమెకు పరాఠాలు, వెన్న అంటే మహా ఇష్టం. ఇంట్లో వండిన భోజనమే తినేది ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ టైంలో ఫుల్‌గా తనకిష్టమైన ఆహారం తీసుకునేది. ఆ తర్వాత నుంచి రాత్రి ఏడింటి వరకు ఏమీ ముట్టుకునేది కాదు. అయితే ఆహారం తీసుకునే టైంలో మంచి హెల్తీ ఫుడ్‌ని తీసుకునేది. దీంతో ఆమె 15 నుంచి 16 గంటలు రకు ఏమి తీసుకోకుండా ఉండగలిగేది. అలా ఆమె చాలా శ్రద్ధతో ఒకేటైంలో ఆహారం తీసుకునేలా శ్రద్ధ వహించింది. అందువల్ల రాత్రి ఏడింటి తర్వాత ఆమె శరీరం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారం తీసుకునేందుకు ఇష్టపడదు. దీంతో ఆమె ఆకలిని నియంత్రించగలిగింది. తద్వారా భారతి సింగ్ సుమారు 15 కిలోల బరువు తగ్గిపోయింది. ప్రస్తుతం ఆమె బరువు 76 కిలోలు. అడపాదడపా ఉపవాసం అంటే..ఉపవాసానికి, తినడానికి మధ్య చాలాసేపటి వరకు విరామం ఇస్తే దీన్ని అడపాదడపా ఉపవాసం అంటారు. బరువు తగ్గేందుకు, జీవక్రియను మెరుగుపరుచుకునేలా.. ఈజీగా నచ్చిన ఆహారం తీసుకునేలా చేసే సమర్థవంతమైన డైట్ వ్యూహం అని నిపుణుల చెబుతున్నారు. ఈ వ్యూహం ప్రకారం ఎక్కువ సేపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. అదే వీరి ఒంట్లోని కొవ్వుని, కేలరీలను సులభంగా బర్న్ చేస్తుంది. అలాగే ఫుడ్ తీసుకునే సమయంలో మంచి సమతుల్య ఆహారం తప్పనిసరి. ఇక్కడ ఈ డైట్లో బరువు తగ్గడం అనేది సదరు వ్యక్తి అంకితభావం, నిలకడ మనస్తత్వం తదితర వాటి కారణంగా బరువు తగ్గడం జరుగుతుంది.(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
సాక్షి డైరెక్టర్ పీవీకే ప్రసాద్ కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ భారతి
-
టీఏఎల్ క్రికెట్ లీగ్ విజేతగా కూల్ క్రూయిర్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ చైర్మన్ కందుకూరి భారతి సాక్షి, అమరావతి: ‘ప్రైమ్ నార్త్’ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో కూల్ క్రూయిర్స్ జట్టు విజేతగా నిలిచినట్టు టీఏఎల్ చైర్మన్ కందుకూరి భారతి తెలిపారు. ఆదివారం ఇంగ్లాండ్‌లోని లాంగ్లీ స్లౌ క్రికెట్ క్లబ్ మైదానంలో ఫైనల్స్ నిర్వహించామన్నారు. ద్వితీయ స్థానంలో డీజే వారియర్స్, తృతీయ స్థానంలో వైజాగ్ బ్లూస్ జట్లు గెలుపొందాయని తెలిపారు. ఈ ఏడాది 10 జట్లతో 14 వారాల పాటు 51 మ్యాచ్‌లతో లీగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఉత్తమ బౌలర్‌గా వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్(21 వికెట్లు), ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా డీజే వారియర్స్‌కు చెందిన పవన్‌కుమార్ (274 పరుగులు)నిలిచారన్నారు. తొలిసారిగా మహిళా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఐటీ ట్రీ వారియర్స్, గెలాక్సీ గర్ల్స్ మధ్య పోటీలో గెలాక్సీ గర్ల్స్ గెలుపొందినట్టు పేర్కొన్నారు. 2008లో లండన్‌లో టీఏఎల్ క్రికెట్ లీగ్‌ని ప్రారంభించిందని, 2012లో ప్రీమియర్ లీగ్ ఫార్మాట్‌గా రూపాంతరం చెందిందన్నారు. యూకేలోని అన్ని తెలుగు కుటుంబాలను కలుపుతూ పెద్ద కమ్యూనిటీ క్రికెట్ లీగ్ అవతరించినట్టు తెలిపారు. టోర్నీ విజయవంతానికి కృషి చేసిన అనితా నోముల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్, అనిల్, కిషోర్‌లను అభినందించారు. -
‘అక్షర’ భారతికి ఏపీ ప్రభుత్వ సాయం
సాక్షి, అనంతపురం: కూలిపనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ సంబంధిత పత్రాలకు సోమవారం ఆమెకు అందజేశారు. అలాగే.. ఆమెకు జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఆఫర్ చేశారు జిల్లా కలెక్టర్ గౌతమి. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిందామె. డాక్టర్ భారతి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని కదిలించింది కూడా. ఈమె డాక్టర్ భారతి.. కష్టాల్ని ఈది గెలుపు తీరాన్ని చేరింది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనినికి చెందిన భారతి.. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదివింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసింది. సాయం ఎప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని సాకేభారతికి కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో రెండు ఎకరాల పొలం పట్టా అందజేసి.. భారతి విజయంపై సంతోషం వ్యక్తం చేశారామె. భారతి ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన ఆమె ఎందరికో స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరఫున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వేనెంబరు 9–12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందింఆం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్నివిధాలుగా అవసరమై ప్రొత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, శింగనమల తహసీల్దారు ఈశ్వరమ్మ, సాకేభారతి భర్త శివప్రసాద్, కుమార్తె ప్రసూన, తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెంత ఆలస్యం..?
సాక్షి, న్యూఢిల్లీ: బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేసే ధోరణిలోనే సమాధానాలు చెప్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 లో ఇచ్చిన హామీల్లో భాగంగా పదేళ్లలో బీబీ నగర్ ఎయిమ్స్‌ను పూర్తి చేసే ప్రక్రియలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణంపై శుక్రవారం లోక్‌సభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్ ముక్తాయింపు సమాధానం ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు వాయిదాలే.. బీబీనగర్ నిర్మాణం పూర్తిపై లోక్‌సభలో 2020 సెప్టెంబర్ 18న అడిగిన ప్రశ్నకు 2022 సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తామని కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 4న మరొక ప్రశ్నకు సమాధానంగా, 2023 నవంబర్ కల్లా పూర్తి చేస్తామని కేంద్రం గడువు పొడిగించిందని విమర్శించారు. కొన్ని నెలల తర్వాత 2022 జూలై 22న తాను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో 2025 జనవరిలోగా బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారని ఎంపీ ఉత్తమ్ తెలిపారు. తాజాగా శుక్రవారం లోక్‌సభలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా టెండర్ ఇచ్చామని, నిర్మాణం మొదలైందని మాత్రమే చెప్పారు కానీ ఎప్పటికల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తామో చెప్పకుండా కేంద్రం తప్పించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బీబీనగర్ ఎయిమ్స్‌కు మంజూరైన రూ.1,028 కోట్లలో కేవలం రూ.29.28 కోట్లు మాత్రమే కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత జూలైలో ఎయిమ్స్ నిర్మాణానికి టెండర్ గత ఏడాది జూలైలో బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి టెండర్ పిలిచామని కేంద్ర వైద్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. అనంతరం ఎయిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
-
భళా.. భారతి!
తొర్రూరు: పురుషులకు మాత్రమే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును తొలిసారి ఓ గిరిజన యువతి చేజిక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం బోజ్యా తండా పంచాయతీ పరిధిలోని దేశ్యా తండాకు చెందిన వాంకుడోతు భారతి దేశంలోనే తొలి జూనియర్ లైన్ వుమెన్‌గా ఎంపికై రికార్డు సృష్టించింది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. మహబూబాబాద్ జిల్లా నుంచి భారతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించలేమని అధికారులు సెలవిచ్చారు. అయినా వెనక్కు తగ్గని భారతి హైకోర్టును ఆశ్రయించగా.. మహిళలను కూడా లైన్ వుమెన్ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీం తో అధికారులు మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో క్లిష్టమైన స్తంభాలు ఎక్కే పరీక్షలో కూడా ప్రతిభ కనబరిచిన భారతి జూనియర్ లైన్ వుమెన్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన బబ్బూరి శిరీష కూడా ఉద్యోగాన్ని సాధించింది. లంబాడ సామాజిక వర్గానికి చెందిన తనకు చెట్లు ఎక్కడం, వ్యవసాయ పనులు చేయడం అలవాటేనని, ఆ ధైర్యంతోనే తాను స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు, ప్రభుత్వానికి విన్నవించుకున్నానని భారతి చెప్పారు. తాను ఉద్యోగానికి ఎంపికైనట్లు ఇప్పటికే సమాచారం అందిందని, ప్రభుత్వం నుంచి నియామక పత్రం రాగానే ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తానని తెలిపింది. కాగా, భారతి భర్త మోహన్ ప్రైవేటు ఉద్యోగి. వీరికి ఎనిమిదేళ్ల సాయితేజ, నాలుగేళ్ల శాన్విశ్రీ సంతానం. -
టీవీ నటుడి భార్య ఆత్మహత్య
హైదరాబాద్: టీవీ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి ఆత్మహత్యపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లి తిరుమల మాట్లాడుతూ..‘మధు ప్రకాష్ నా కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె పరిచయం అయినప్పటి నుంచి మధు ప్రకాష్‌కు నా కూతురును నిర్లక్ష్యం చేస్తున్నాడు. రెండేళ్లుగా భారతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. వారికి సర్థిచెప్పే ప్రయత్నం చేశాం. అయితే మధు ప్రకాష్ మాత్రం మా మాటలు పట్టించుకోలేదు. రూ.15 లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసాం. చివరికి నా కూతురు చావుకు కారణం అయ్యాడు. మధు ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. కాగా మణికొండ పంచవటి కాలనీకి చెందిన టీవీ నటుడు మధుప్రకాశ్‌తో గుంటూరుకు చెందిన భారతికి 2015లో వివాహమైంది. ఆమె ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగికి పనిచేస్తోంది. అయితే తనను పట్టించుకోవడం లేదని, షూటింగ్‌ల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడంటూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన మంగళవారం రాత్రి భారతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది . రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
కలెక్టర్ అమ్రపాలికి స్వచ్ఛతా అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేసింది. స్వచ్ఛత విషయంలో ఉత్తమ పనితీరు కనబర్చిన విద్యాసంస్థలకు, మోడల్ గ్రామాలను తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్లకు ఈ అవార్డులు అందజేసింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లాలో శంభునిపల్లి గ్రామాన్ని, మెదక్ జిల్లాలో ముజ్రంపేట గ్రామాన్ని స్వచ్ఛత పాటించడంలో ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు ఆ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, భారతి హోళీకేరికు ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అవార్డులు అందజేశారు. -
రిసరెక్షన్
కథ రాత్రి పదకొండవుతోంది. భారతి లైబ్రరీలో కూర్చుని చదువుకుంటోంది. అడుగుల శబ్దం వినిపించి తల పెకైత్తి చూసింది. దాదాపు పాతికేళ్ల వయసుంటుంది అతనికి. డెనిమ్ జీన్స్ మీద రౌండ్ నెక్ బ్లూ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అతనికి లైబ్రరీ అంతా పరిచయమున్నట్టుగా ఉంది. తనకేం కావాలో బాగా తెలిసినట్టుగా తటపటాయింపు లేకుండా సైన్స్ సెక్షన్లోకి వెళ్లిపోయాడు. అతను ఏదో పాట పాడుతూ సైన్స్ సెక్షన్‌లోని ర్యాక్స్‌లో ఉన్న ఒక్కొక్క పుస్తకాన్ని చూస్తూ ముందుకి వెళ్తున్నాడు. ర్యాక్ చివర్లో ఉన్న సెలైన్స్ ప్లీజ్ అన్న బోర్డ్ చూశాడు. పాట ఆపి, ష్... అనుకుని, తనలో తానే నవ్వుకుంటూ మరొక ర్యాక్ దగ్గరికి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయేంతవరకూ అతన్నే ఆశ్చర్యంగా చూసిన భారతి తను చదువుతున్న పుస్తకం మూసి కవర్‌పేజీ చూసింది. పోస్ట్‌మార్టం. భారతి చదువుతున్న బుక్ టైటిల్ అది. తెలుగులో ఇక ఎవరి పుస్తకాలు వాళ్లే ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి, రచయిత సెల్ఫ్ పబ్లిష్ చేసుకున్న పుస్తకం. చరిత్ర మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలను మర్చిపోతే అప్పటి తప్పులే పునరావృత్తం అవుతూ ఉంటాయి. అందుకే మరణించిన నా మిత్రుడి జ్ఞాపకంగా ఈ పుస్తకం రాస్తున్నానని పరిచయ వాక్యాల్లో చెప్పుకొచ్చాడు రచయిత. భారతికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని, పెళ్లి చేసుకుని, ఇల్లు కట్టుకుని, పిల్లల్ని కని - ఇలా పద్ధతి ప్రకారం జీవితం సాగిపోవాలని ఆమె కోరిక. అయితే తన సబ్జెక్ట్‌కి సంబంధం లేని పుస్తకాలు చదవడమంటే భారతికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా ఆమె ఆసక్తిగా పుస్తకం తెరిచి ఆపిన చోటు నుంచి చదవడం మొదలుపెట్టింది. ఈ పోస్ట్‌మార్టం పుస్తకాన్ని ఈ మధ్య అందరూ చదువుతున్నారు. ఫేస్బుక్లో చాలామంది ఈ పుస్తకం గురించి రివ్యూలు రాస్తున్నారు. ఆ రివ్యూల్లో చాలామంది - పోస్ట్‌మార్టం పుస్తకం చదివాక నిద్రపట్టలేదనీ, తమని బాగా డిస్టర్బ్ చేసిందనీ, చదువుతున్నంతసేపూ కన్నీళ్లు పెట్టుకున్నామని రాశారు. పోస్ట్‌మార్టం పుస్తకం ఒక ఫ్రెండ్ ద్వారా భారతికి చేరింది. నువ్వు బోర్ కొట్టి బుక్స్ చదువుతావు. నాకు బుక్ చదవడమే బోర్. అది కూడా బయోగ్రఫీలు నావల్ల కాదు అని తన ఫ్రెండ్‌కి చెప్పి తప్పించుకుందామని చూసింది భారతి. కానీ అతను ఒప్పుకోలేదు. ఈ బుక్ చదవకపోతే నీ లైఫ్ వేస్ట్ అన్నాడు. ‘ఇది మన స్టూడెంట్స్ తప్పక చదవాల్సిన పుస్తకం. నీ కోసం బుక్ ఎగ్జిబిషన్ నుంచి ఒక కాపీ తెచ్చాను. చదవాల్సిందే’ అనడంతో ఇష్టం లేకున్నా ఆ పుస్తకాన్ని తీసుకుంది. కానీ చాలా రోజుల వరకూ ఆ పుస్తకాన్ని తెరవనైనా లేదు భారతి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి లైబ్రరీకి వచ్చి చదువుకుందామనుకుంది. వస్తూ వస్తూ తెచ్చుకున్న క్లాస్ పుస్తకాలతో పోస్ట్‌మార్టం కూడా కలిసిపోయింది. సాయంత్రం నుంచీ సబ్జెక్ట్ పుస్తకాలు చదివి బోర్ కొడుతుంటే సరేలే అని పోస్ట్‌మార్టం తెరిచింది. పదిహేను పేజీలకు పైగానే చదివింది. ఏదో బోరింగ్ డాక్యుమెంటరీ సినిమా చూసినట్టుగా ఉంది భారతికి. అబ్బా, ఇంక చదివింది చాల్లే అని మూసేద్దామనుకుంది. కానీ అదే సమయానికి లైబ్రరీలోకి నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే భారతి ఆశ్చర్యపోయింది. ఆ వచ్చిన అతను, పోస్ట్‌మార్టం పుస్తకంలో నుంచి నడిచొచ్చినట్టుగా ఉన్నాడు. అంతే వయసు. అదే హైట్. అదే వెయిట్. డ్రెస్ చేసుకునే తీరు, నడిచే విధానం, పెరిగిన గెడ్డం. సేమ్ టు సేమ్ ఆ పుస్తకంలోని క్యారెక్టర్లానే ఉన్నాడు అతను. పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే ఫ్యాన్స్ ఆ హీరో స్టైల్‌ని కాపీ కొట్టి అభిమానం చాటుకోవడం సహజం. కానీ మరణించిన ఒక సామాన్యుడికి కూడా అభిమానులుంటారా? అనుకుంది భారతి. చదివిన కొన్ని పేజీల్లో అతని గురించి భారతికి తెలిసిందేమిటంటే అతను అందరిలాంటివాడే. కానీ కళ్లల్లో వెలుగుల్ని నింపుకుని కొత్త ఆశలవైపు ప్రయాణించినవాడు. అతను కవి, రచయిత. రీసెర్చ్ స్కాలర్. యువకుడు, పోరాట పటిమ ఉన్నవాడు. చనిపోయినప్పుడు అతను సామాన్యుడే. కానీ అతని మరణం అతన్ని ప్రపంచానికి అసామాన్యుడిగా పరిచయం చేసింది. కాబట్టి అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంలో ఆశ్చర్యమేముందిలే అనుకుంది భారతి. ఆ రోజు తర్వాత చాలాసార్లు అతన్ని చూసింది భారతి. ప్రతిరోజూ తన సబ్జెక్ట్ పుస్తకాలు చదివి అలసిపోయాక అలవాటుగా పోస్ట్‌మార్టం బుక్ చదువుతుండగా అతను వస్తాడు. అదే పాట పాడుకుంటూ సైన్స్ సెక్షన్‌కి వెళతాడు. లైబ్రరీలో అతన్ని చూడడం - తన రొటీన్ జీవితంలో ఒక చిన్నపాటి ఆనందం భారతికి. ఏ రోజైనా లైబ్రరీకి వెళ్లడం వీలుకాకపోతే భారతికి ఇబ్బందిగా ఉండేది. అటు తన సబ్జెక్ట్ పుస్తకాలకు అన్యాయం చెయ్యకుండా, కొత్తగా ఆసక్తి పెంచుకున్న పోస్ట్మార్టంకీ అన్యాయం చేయకుండా రోజుకి పది పేజీలు చదువుతూ అతని గురించి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంది. చాలా కష్ట నష్టాలతో కూడిన అతని బాల్యం. తల్లిదండ్రుల మధ్య వైరం, సొంత ఇంటిలోనూ పరాయి వాడిగా పెరగాల్సి రావడం, పేదరికం. అతని జీవితంలో ఉన్నన్ని కష్టాలు లేకున్నా పేదరికం విషయంలో భారతికి తన జీవితంతో పోలికలు కనిపించాయి. అందుకే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నప్పటికీ, రోజూ పోస్ట్మార్టంలోని కొన్ని పేజీలైనా చదివితే గానీ నిద్రపట్టేది కాదు భారతికి. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే భారతి లైబ్రరీలో ఉండగా అతను వచ్చాడు. తన స్టైల్లో పాట పాడుకుంటూ సైన్స్ సెక్షన్ వైపు వెళ్తుంటే, భారతి లేచి అతని దగ్గరకు వెళ్లింది. హలో అని పలకరించింది. అతను గోడ మీదున్న సెలైన్స్ ప్లీజ్ బోర్డ్ వైపు చూపించి, ష్ అని ముందుకు వెళ్లిపోయాడు. ఆ రోజు అతనితో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుంది భారతి. అతని వెంటే నడిచింది. అతను మరొక ర్యాక్‌లో ఏదో పుస్తకం కోసం వెడుతున్నాడు. అతని పక్కనే నిలబడి చూస్తున్నప్పటికీ, భారతిని అతను పట్టించుకోలేదు. భారతి అతని భుజం మీద చెయ్యేసి, తన చేతిలో ఉన్న పుస్తకం చూపించి, ‘ఈ పుస్తకం కోసమేనా వెతుకుతున్నావ్’ అంది. భారతి చేతిలో ఉన్న కార్ల్ సాగన్ పుస్తకం చూడగానే అతను లాక్కున్నంత పనిచేశాడు. ‘ఇది నాకిస్తావా? అని అడిగాడు. అది నీదే!’ అంది భారతి, అతను దగ్గరకొచ్చి నీకెలా తెలుసు అన్నాడు. ‘నేను కూడా పోస్ట్‌మార్టం చదువుతున్నాలే’ అంది భారతి. ‘పోస్ట్‌మార్టమా? అదేంటి?’ అని కార్ల్ సాగన్ పుస్తకం తెరిచాడు. ఎప్పటినుంచో వెంటాడుతున్న ప్రశ్నలకు అందులోనైనా సమాధానాలు దొరుకుతాయేమో అని ఆత్రంగా పేజీలు తిరగేశాడు అతను. ‘నీకు నిజంగానే పోస్ట్‌మార్టం బుక్ తెలియదా?’ అడిగింది భారతి. తల పెకైత్తకుండానే తెలియదన్నట్టుగా తలూపాడు. ‘ఒక్క నిమిషం ఆగు’ అని భారతి తను కూర్చున్న టేబుల్ వైపు నడిచింది. పోస్ట్‌మార్టం బుక్ పట్టుకుని భారతి అక్కడికొచ్చేసరికి అతను లేడు. అతనలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాక అతని మీద మరింత ఆసక్తి కలిగింది భారతికి. ఆ రోజు ఎప్పటిలా పది పేజీలు కాకుండా, పుస్తకంలో ఇంకొన్ని పేజీలు చదివింది. పేజీ నంబర్ 114లో అతను ఎన్నో రోజులుగా వెతుకుతున్న ఒక పుస్తకం అతనికి ఎలా దొరికిందో - రచయిత చాలా వివరంగా రాసిన విషయం చదివి - భారతికి ఆ పుస్తకం మీద మరింత ఆసక్తి కలిగింది. కొంచెం వింతగా కూడా అనిపించింది. చదువుతున్నకొద్దీ ఆమెకి ఆ పుస్తకం మరింత చదవాలని అనిపించింది. కానీ లైబ్రరీ క్లోజ్ చేసే టైమ్ అవ్వడంతో హాస్టల్‌కి బయల్దేరింది. ఆ తర్వాత రోజు లైబ్రరీలో ఎప్పటిలానే పోస్ట్‌మార్టం చదవడం మొదలుపెట్టింది భారతి. చదువుతున్నంతసేపూ అతనెప్పుడు లైబ్రరీకి వస్తాడా అని ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆ రోజు అతను రాలేదు. లైబ్రరీ మూసేంతవరకూ అతని కోసం ఎదురుచూసింది. అయినా అతను రాలేదు. అసలే పద్ధతి ప్రకారం నడిచే ఆమె జీవితంలో అతను రాకపోవడం కొంత వయొలెన్స్‌ని సృష్టించింది. తనేమైనా తప్పు చేసిందా? లేదంటే అతనికి కావాల్సిన పుస్తకం దొరికింది కాబట్టి అతను ఏ మూలో కూర్చుని చదువుకుంటున్నాడా? - ఇలా ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ లైబ్రరీ బయటకు నడిచింది. కొంచెం దూరం నడవగానే అతను ఎదురయ్యాడు. ఒక చేతిలో మడత పెట్టిన పరుపు, దుప్పటి... మరొక చేతిలో పెద్ద అంబేద్కర్ ఫొటో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ‘హలో’ అంది. ఎవరు నువ్వు అన్నట్టుగా భారతి వైపు చూశాడు అతను. లైబ్రరీ, కార్ల్ సాగన్ పుస్తకం - అని ఇంకా ఏదో చెప్పి అతనికి గుర్తు తెప్పించాలనుకుంది. కానీ అతను ఇబ్బందిగా మోస్తున్న అంబేద్కర్ ఫొటో చేతిలోకి తీసుకుని అతనితో నడిచింది. ‘ఎక్కడికి?’ అని అడిగింది. ‘ఆకాశంలో నక్షత్రాలు చూడ్డానికి’ అన్నాడతను. మౌనంగా అతని వెంటే నడిచింది. కొంచెం దూరం నడిచాక అతను ఆగి ఫుట్‌పాత్ మీద పరుపు పరిచి కూర్చున్నాడు. భారతి కూడా అతని పక్కనే కూర్చుంది. ‘నక్షత్రాలు చూడ్డానికొస్తూ అంబేద్కర్‌ని ఎందుకు తోడు తెచ్చుకున్నావ్?’ అడిగింది భారతి. ‘వుయ్ ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ స్టార్స్. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ నక్షత్రాలపై తయారైన కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే మనందరిలోనూ ఉన్నాయి. కానీ మానవత్వం వికసించిన ఇన్నేళ్లకు కూడా రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టక ఆధారంగా మనుషులను అంచనా వేసి అణచివేతకు గురి చేస్తూనే ఉన్నారు. మనుషుల మధ్య జాతి, కులం, మతం అని గోడలు కట్టి విడదీశారు. వంతెనలు కట్టాల్సిన చోట మనిషి గోడలు కడుతున్నాడు. అసలు గొడవంతా ఇదే! అందుకే నాకు మనుషుల కంటే నక్షత్రాలే ఇష్టం.’ అతనితో పాటు అంబేద్కర్ ఫొటో మాత్రమే కాదు. అంబేద్కర్ రాసిన ఎనిహిలేషన్ ఆఫ్ కేస్ట్ పుస్తకం కూడా ఉంది. ఆ రాత్రి చాలాసేపు వాళ్లు ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ కూర్చుండిపోయారు. లైబ్రరీ నుంచి వచ్చేవాళ్లు, పరీక్షల కోసం రాత్రంతా చదివి కాసేపు రిలాక్స్ అవ్వడానికి రోడ్ మీద తిరిగేవాళ్లు - కొంత మంది వారి పక్క నుంచి పట్టించుకోకుండా నడుచుకుని వెళ్లిపోయారు. కొంతమంది వాళ్లతో పాటే ఫుట్‌పాత్ మీద కూర్చుని నక్షత్రాలను చూస్తుండిపోయారు. భారతి జీవితంలోనే - ఆ రాత్రి నక్షత్రాలను చూడడం, అతను చెప్పింది వినడం - ఒక అద్భుతమైన అనుభవం. ఎప్పుడు తను హాస్టల్ రూమ్‌కి చేరుకుందో, ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. భారతి నిద్ర లేచేసరికి సాయంత్రమైంది. అంతసేపు నిద్రపోయినందుకు తనని తాను తిట్టుకుని పుస్తకాలు పట్టుకుని లైబ్రరీకి బయల్దేరింది. ముందు రోజు రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది ఆమెకు. వెంటనే చదువుతున్న పుస్తకాలు మూసేసి పోస్ట్‌మార్టం పుస్తకం తెరిచింది. క్యాంపస్‌లో జరిగిన ఒక ఘటన, దాని పర్యవసానంగా అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్తున్నాడు రచయిత. అతనిలోని ఒక గుణాన్ని తెలుపుతూ, ఎంతో క్లిష్టమైన విషయాన్ని కూడా చాలా సింపుల్‌గా తన స్నేహితులకు వివరించి చెప్పడం గురించి చెప్పుకొచ్చాడు రచయిత. ఒక ఉదాహరణగా, ఒక రాత్రిపూట ఆరుబయట పడుకుని నక్షత్రాల గురించి ఒక అమ్మాయికి చెప్పడం గురించి రాశాడు. ఆ పేజీ చదవడం అవ్వగానే భారతికి ఆశ్చర్యం వేసింది. ఆ పేజీని మళ్లీ మళ్లీ చదివింది. భారతికి భయం వేసింది. పుస్తకాన్ని దూరంగా తోసేసింది. ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్‌కి డయల్ చేసింది. ‘పుస్తకంలో నేనెలా ఉన్నాను?’ అడిగింది. ‘నువ్వు పుస్తకంలో ఉండటమేంటి? అసలే పుస్తకం?’ అన్నాడతను. ‘అదే మొన్న నువ్విచ్చిన పోస్ట్‌మార్టం పుస్తకం. అందులో నా గురించి కూడా ఉంది.’ ‘అందులో నీ గురించి ఉండడమేంటి? ఏం మాట్లాడుతున్నావు?’ ‘నేనతన్ని రోజూ లైబ్రరీలో కలుస్తున్నాను.’ ‘ఎవర్ని?’ ‘అదే ఆ బుక్‌లోని క్యారెక్టర్ని.’ ‘నీకు పిచ్చెక్కిందా? అతను చనిపోయి చాలా రోజులైంది.’ ‘మరి అతను రోజూ నాకెలా కనిపిస్తున్నాడు?’ ‘భారతీ ఏమైంది నీకు? ఏదో అతని గురించి తెలుసుకుంటావని బుక్ చదవమన్నాను. చదవకపోతే వదిలెయ్. ఎందుకు జోక్ చేస్తావు?’ భారతి ఏదో చెప్దామనుకునే లోపలే అతను ఫోన్ కట్ చేశాడు. భారతి లైబ్రరీ నుంచి బయటికొచ్చేసరికి అతను దూరంగా ఒక రాయిమీద కూర్చుని ఉన్నాడు. భారతి వెళ్లి అతని పక్కనే కూర్చుంది. ‘ఏమాలోచిస్తున్నావ్?’ అడిగింది. ‘అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? లైఫ్ షుడ్ బి గ్రేట్ రేదర్ దెన్ లాంగ్. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు. ‘నీ కష్టాలు నాకు తెలుసు. కానీ చనిపోతే కష్టాలు పోవు. వంద రెట్లవుతాయి. నిన్ను ఇష్టపడినవారందరినీ అవి బాధపెడతాయి’ అంది భారతి. ‘నేనేం చావనులే’ అన్నాడు. ‘గుడ్ బాయ్. గుడ్ నైట్’ అని చెప్పి అక్కడ్నుంచి బయల్దేరింది భారతి. భారతికి అంతా అర్థమైంది. ఈ పుస్తకం ఒక టైం మెషీన్. తను పుస్తకం చదివిన ప్రతిసారీ అతను బతికొస్తాడు. తర్వాతి రోజు భారతి లైబ్రరీలో కొంచెం భయంగానే పోస్ట్‌మార్టం తెరిచింది. దాదాపుగా పుస్తకం మొత్తం అయిపోయింది. చివరి కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి. చదవడం పూర్తయితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అందుకే పుస్తకం తెరిచి ఒక్కొక్క పదమే మెల్లిగా చదువుతోంది. ఎక్కడో అతను మళ్లీ రక్తమాంసాలను తనలో నింపుకుంటున్నాడు. ఒక పేజీ మాత్రమే చదివి లైబ్రరీ నుంచి బయటికొచ్చింది భారతి. అతను మరికొంతమందితో కలిసి నేలమీద పరుపులేసుకుని కూర్చుని ఉన్నాడు. దూరం నుంచి అతన్నే చూస్తోంది భారతి. అతను లేచాడు. ఇప్పుడే వస్తానని అతని మిత్రులతో చెప్పి అక్కడ్నుంచి ముందుకు నడిచాడు. భారతి అక్కడ్నుంచి పరిగెత్తింది. ‘ఎక్కడికి పరిగెడ్తున్నావు?’ అడిగాడు. ‘నిన్ను కాపాడ్డానికి’ అంది భారతి. ‘నన్ను కాపాడలేవు.’ ‘కాపాడతాను. నువ్వు నా బిడ్డవి. నేనే నీకు మళ్లీ జన్మనిచ్చాను. నిన్ను నేను మాత్రమే కాపాడగలను.’ ‘ఎలా?’ భారతికి ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్లిద్దరూ అలా పరిగెట్టుకుంటూ హాస్టల్ వైపు వెళ్తున్నారు. వాళ్లిద్దరూ అలసిపోయి హాస్టల్ ముందు ఆగి చూస్తుండగానే అతను హాస్టల్లోకి అడుగుపెట్టాడు. ‘చూశావా వాడు ఎలా ధైర్యంగా ముందుకు నడుస్తున్నాడో? చావడాని కంటే బతికుండడానికే ఎక్కువ ధైర్యం కావాలన్నాడు ఒక పెద్దమనిషి. కొటేషన్స్ మనిషిని బతికించవు. వాడు రూంలోకి వెళ్లిపోతున్నాడు. మనం వాడిని అందుకోలేం. ఆపలేము. ది ఎండ్ ఈజ్ వెరీ నియర్’ - అన్నాడు. ‘లేదు నిన్ను కాపాడతాను’ అంది భారతి. ‘ఎలా?’ అన్నాడతను. ‘పాతికేళ్లు వెనక్కి వెళ్లి అప్పటి బర్త్ సర్టిఫికెట్స్‌లో క్యాస్ట్ అనే కాలమ్ లేకుండా చేస్తే?’ అంది. ‘కులం అనేది మనసుల్లో నుంచి పోవాలి అప్లికేషన్ ఫామ్స్ నుంచి కాదు’ అన్నాడతను. ‘ఒకవేళ మనం 1936కి వెళ్లి జాత్‌పాత్ తోడక్ మండల్ వాళ్లని ఒప్పించి అంబేద్కర్ చేత అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ స్పీచ్ ఇప్పించేలా చేస్తే? అది విని ప్రజలు మారిపోతే?’ అడిగింది భారతి. ‘ఆయన ఒక్కడి వల్ల అయ్యే పని అయ్యుంటే, ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు’ అన్నాడు అతను. ‘మరెలా?’ ‘ఈ సమస్య ఇప్పటిది కాదు, మనం ఇంకా వెనక్కి వెళ్లాలి. వేదాలు, స్మృతులు, సదాచారాలు - అప్పటిలోకి వెళ్లాలి.’ ‘వెళ్తాను.’ ‘వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదేమో! ఎంత వెనక్కి వెళ్లినా, మారాల్సింది ఇప్పుడు మన ముందున్న జనాలు. అప్పుడే సమస్యకి పరిష్కారం. కానీ వీళ్లు మారరు. అందుకే నేను వెళ్తున్నా. నా టైం వచ్చేసింది’ అని అతను బయల్దేరాడు. ‘నో, ఈ కథకి ఈ ముగింపు సరికాదు’ అంది భారతి. ‘నాది కథ కాదు. జీవితం’ అన్నాడతను. - వెంకట సిధారెడ్డి -
'ఇక ఆట నాదే' ఆడియో ఆవిష్కరణ
-
కాంగ్రెస్‌కు ఓట్లు సీట్లు తప్ప మరో ప్రాతిపదిక లేదు
-
జన నేత ఆరోగ్య పరిస్తితిపై అభిమానుల ఆందోళన
-
జగన్ కు సాయంగా ఉండేందుకు భారతికి అనుమతి
-
నిమ్స్ ఆస్ప్రత్రికి చేరుకున్న వైయస్ భారతి
-
జగన్‌ను కలిసేందుకు వైయస్ భారతికి కోర్టు అనుమతి
-
ఉస్మానియా ఆస్పత్రి వద్ద వైఎస్ భారతిని అడ్డుకున్న పోలీసులు
-
ఆమరణ దీక్షలు భగ్నం
రాయదుర్గం, తాడిపత్రి, న్యూస్‌లైన్ : వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నరసింహయ్య చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. ఐదు రోజులుగా దీక్ష చేపట్టడం వల్ల వారి బీపీ, షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయి. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్యులు పేర్కొనడంతో రాయదుర్గంలో ఎస్ఐ రాఘవరెడ్డి మహిళా, పోలీసు సిబ్బందితో శిబిరానికి చేరుకున్నారు. దీక్షను భగ్నం చేయకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. అయినా పోలీసులు దీక్షను భగ్నం చేసి.. కాపు భారతిని బలవంతంగా అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు, నాయకులను పక్కకు తోసేసి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తాను వైద్యం చే యించుకోనని మూడు గంటలపాటు ఆమె మొండికేశారు. వైఎస్ విజయమ్మ దీక్ష కొనసాగే వరకూ తాను కూడా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు, ఎస్ఐ చెప్పినా ససేమిరా అన్నారు. చివరకు ఎమ్మెల్యే ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో బంధువులు కంటనీరు పెట్టుకుంటూ ఆమె వద్దే ఉండిపోయారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అందరూ ఒత్తిడి చేసి ఆమెకు కొబ్బరి నీళ్లు తాగించి.. చికిత్స ప్రారంభించారు. తాడిపత్రిలో పైలా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు డీఎస్పీ నాగరాజుకు సమాచారమిచ్చారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ సీఐలు లక్ష్మినారాయణ, మోహన్.. సిబ్బందితో రాత్రి 9.30 గంటలకు దీక్షా స్థలికి చేరుకుని పైలాను బలవంతంగా 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. తాను దీక్ష విరమించేది లేదని ఆయన అక్కడ చాలా సేపు మొండికేశారు. ఎట్టకేలకు వైద్యులు, పోలీసులు నచ్చజెప్పి ఆయనకు వైద్యం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి నియోజక వర్గ సమన్వకర్త వి.ఆర్.రామిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని పైలాను పరామర్శించారు.