హైదరాబాద్: టీవీ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి ఆత్మహత్యపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తల్లి తిరుమల మాట్లాడుతూ..‘మధు ప్రకాష్ నా కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె పరిచయం అయినప్పటి నుంచి మధు ప్రకాష్‌కు నా కూతురును నిర్లక్ష్యం చేస్తున్నాడు. రెండేళ్లుగా భారతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. వారికి సర్థిచెప్పే ప్రయత్నం చేశాం. అయితే మధు ప్రకాష్ మాత్రం మా మాటలు పట్టించుకోలేదు. రూ.15 లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసాం. చివరికి నా కూతురు చావుకు కారణం అయ్యాడు. మధు ప్రకాష్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.
కాగా మణికొండ పంచవటి కాలనీకి చెందిన టీవీ నటుడు మధుప్రకాశ్‌తో గుంటూరుకు చెందిన భారతికి 2015లో వివాహమైంది. ఆమె ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగికి పనిచేస్తోంది. అయితే తనను పట్టించుకోవడం లేదని, షూటింగ్‌ల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడంటూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన మంగళవారం రాత్రి భారతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది . రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment