తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ చైర్మన్ కందుకూరి భారతి సాక్షి, అమరావతి: ‘ప్రైమ్ నార్త్’ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో కూల్ క్రూయిర్స్ జట్టు విజేతగా నిలిచినట్టు టీఏఎల్ చైర్మన్ కందుకూరి భారతి తెలిపారు. ఆదివారం ఇంగ్లాండ్‌లోని లాంగ్లీ స్లౌ క్రికెట్ క్లబ్ మైదానంలో ఫైనల్స్ నిర్వహించామన్నారు. ద్వితీయ స్థానంలో డీజే వారియర్స్, తృతీయ స్థానంలో వైజాగ్ బ్లూస్ జట్లు గెలుపొందాయని తెలిపారు.
ఈ ఏడాది 10 జట్లతో 14 వారాల పాటు 51 మ్యాచ్‌లతో లీగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఉత్తమ బౌలర్‌గా వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్(21 వికెట్లు), ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా డీజే వారియర్స్‌కు చెందిన పవన్‌కుమార్ (274 పరుగులు)నిలిచారన్నారు. తొలిసారిగా మహిళా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఐటీ ట్రీ వారియర్స్, గెలాక్సీ గర్ల్స్ మధ్య పోటీలో గెలాక్సీ గర్ల్స్ గెలుపొందినట్టు పేర్కొన్నారు.
2008లో లండన్‌లో టీఏఎల్ క్రికెట్ లీగ్‌ని ప్రారంభించిందని, 2012లో ప్రీమియర్ లీగ్ ఫార్మాట్‌గా రూపాంతరం చెందిందన్నారు. యూకేలోని అన్ని తెలుగు కుటుంబాలను కలుపుతూ పెద్ద కమ్యూనిటీ క్రికెట్ లీగ్ అవతరించినట్టు తెలిపారు. టోర్నీ విజయవంతానికి కృషి చేసిన అనితా నోముల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్, అనిల్, కిషోర్లను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment