
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్‌తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది. శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్‌గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్, బ్యూటీ సీక్రెట్‌లేంటో చూద్దామా..
నటి శ్రియ శరణ్ ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యాన్ని షేర్ చేసుకుంది. అదే తన తన బ్యూటీ సీక్రెట అని నవ్వుతూ చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లేనని అంటోంది శ్రియ. మన ఆరోగ్యంతో మన సౌందర్యం ముడిపడి ఉంటుందంట. అందుకే తినే భోజనం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానంటోంది.
వర్కౌట్‌ల కంటే కూడా తీసుకునే భోజనం పోషకవంతమైనదైతే ఆటోమేటిగ్గా స్లిమ్‌గా, అందంగా ఉంటామని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఇదేంటి ఆమె చాలా వెరైటీగా మాట్లాడుతుందనుకుంటే.. పొరబడ్డట్టే. ఎందుకంటే చాలామంది నిపుణులు కూడా చాలాసార్లు ఈ విషయాన్నే బలంగా నొక్కి చెప్పారు.
డైట్ ఎలా ఉండాలంటే..
సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటుందట. నిర్ణిత సమయానికే బోజనం తీసుకునేలా చూసుకుంటుందట. కడుపు నిండిన అనుభూతి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని తెలిపింది. తన రోజుని నిమ్మకాయ తేనెలతో కూడిన వాటర్ తీసుకుంటుందట.
ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,బాడీలో ఉండే టాక్సిన్‌లను బయటకు పంపేస్తుందట. హైడ్రేషన్ తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తానంటోంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం బాదంగింజలు, ఓట్‌మీల్, గుడ్లులో తెల్లసొనతే వేసిన ఆమ్లేట్ లేదా బెర్రీలు, అరటి పండ్లు తింటుందట. పొద్దపొద్దునే డీప్ ఫైడ్ పదార్థాల జోలికిపోదట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించి చురుకుదనం లేకుండా చేస్తాయట.
ఇక భోజనంలో పప్పు, రోటీ , సబజీ, కవినోవా, ఉడికించిన కూరగాయలు, కాల్చిన చేప లేదా చికెన్ ఉంటాయట. ఇంట్లో తయారు చేసిన పెరుగుని తీసుకుంటుందట. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక జీర్ణక్రియ సమస్యలను అదుపులో ఉంచుతుందట. ఇక స్నాక్స్‌గా బిస్కెట్లు లేదా చిప్స్ వంటి జోలికి అస్సలు పోనంటోంది. అందుకోసం దోసకాయ, క్యారెట్ వంటివి ఆస్వాదిస్తా, ఒకవేళ కుదరకపోతే కొంచెం డార్క్ చాక్లెట్ ముక్కతో గ్రీన్ టీ తీసుకుంటానంటోంది. జీవక్రియను చురుగ్గా ఉంచే స్నాకస్ తీసుకుంటే అతిగా తినాలనే కోరిక అదుపులో ఉంటుందటోంది శ్రియ.
రాత్రి భోజనం తేలికగా జీర్ణంమయ్యే వాటిని ఎంచుకుంటానంటోంది. కూరగాయలతో తయారు చేసిన సూప్, కిచ్డీ లేదా సలాడ్ తీసుకుంటానంటోంది. అయితే రాత్రి భోజనం సాధ్యమైనంతవరకు సాయంత్రం ఏడున్నరలోపే ఫినిష్ చేస్తుందట. అంతేగాదు రాత్రి సమయాల్లో ఎక్కువ ఆయిల్‌తో కూడిన ఆహారాలను తీసుకోకపోవడమే మేలంటోంది. ఎందుకంటే ఇది జీరణక్రియను మందగింపచేసి, మరసటి రోజు బాడీలోని శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుందట.
ఎలాంటి వర్కౌట్‌లంటే..
చర్మం ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఉపకరించేలా నీళ్లను ఎక్కువగా తీసుకుంటుందట. అలాగే యోగా, పైలేట్స్, డ్యాన్స్ వంటివి తన దినచర్యలో భాగమని అంటోంది.
హెల్తీగా ఉండటం అంటే..
ఫిట్‌గా ఉండటం అంటే ఆహారాలను దూరం చేసుకోవడం అని కాదు. ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం అని భావిస్తే..బరువు నిర్వహించడం తేలిక అవుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే నోరు కట్టేసుకున్నామనే ఫీల్ కలగదు. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శ్రమ లేకుండానే మంచి పోషకాహారాలతో హెల్తీగా, నాజుగ్గా ఉండొచ్చని చెబుతోంది అందాల శ్రియ.
(చదవండి: మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!)
Comments
Please login to add a commentAdd a comment