Yoga Does Not Help You Lose Weight Doctor Viral Post - Sakshi
Sakshi News home page

యోగా వలన బరువు తగ్గరు.. ప్రముఖ డాక్టర్ సందేశం  

Published Tue, Jun 27 2023 5:04 PM | Last Updated on Thu, Jul 27 2023 5:01 PM

Yoga Does Not Help You Lose Weight Doctor Viral Post  - Sakshi

కేరళ: భారత సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన యోగా ఆరోగ్య ప్రదాయనిగా, ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే దాని వలన ప్రయోజనమేమీ లేదని చెబుతున్నారు కేరళకు చెందిన డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్.

ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి అప్రమత్తం చేశాక అత్యధికులకు ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ పెరిగిపోయింది. అప్పటివరకు శరీరానికి కొంచెమైనా పని చెప్పని వారంతా ఉదయాన్నే లేచి వ్యాయామాలు, ప్రాణాయామాలు, యోగాలు చేయడం మొదలుపెట్టారు. వీటివలన బరువు నియంత్రణలో ఉండి ఆరోగ్యం మెరుగవుతుందన్నది వారి ప్రధాన ఉద్దేశ్యం. కానీ యోగా చేస్తే అసలు బరువు తగ్గరని కచ్చితంగా చెబుతున్నారు డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్.        

అంతేకాదు, మానవాళి నిజమని నమ్ముతున్న కొన్ని నిజాలు అసలు నిజమే కాదని చెబుతూ డా. ఫిలిప్స్ లివర్ డాక్ పేరిట ఉన్న తన  ట్విట్టర్ అకౌంట్లో ఒక సందేశాన్ని రాశారు.  

ఫిలిప్స్ రాసిన ట్వీట్ సారాంశమేమిటంటే.. 
1. గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు 
2. గ్రీన్ టీ బరువు తగ్గడానికి సహాయపడదు 
3. బెల్లం, తేనె లేదా చెఱుకు తెల్ల చక్కర కంటే ఆరోగ్యకరం కాదు 
4. "ఆరోగ్యకరమైన మద్యం" అంటూ లేదు  
5. ఒత్తిడిని తగ్గించడానికిగాని నిద్ర పట్టడానికిగాని అశ్వగంధ ఏమాత్రం ఉపయోగపడదు 
6. శిలాజిత్తు అనే రాతి పదార్ధంలో మగవారి లైంగిక సామర్ధ్యాన్ని పెంచడం వంటి ప్రయోజనాలేమీ లేవు
7. పాలలో కలిసిన పసుపు రక్తంలో చేరదు సరికదా మలంలో బయటకు వెళ్ళిపోతుంది 
8. పండ్లు తినడానికి సమయమంటూ ఏమీ ఉండదు.. రాత్రి పగలు ఎప్పుడైనా తినవచ్చు 
9. చక్కర లేని బ్లాక్ కాఫీ రోజుకు మూడు సార్లు తాగితే కాలేయ సమస్యలు తగ్గుతాయి 
10. ఆపిల్ సైడర్ వినెగర్ ఈగలను పట్టుకోవడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడదు 
11. రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలన్నది వట్టి పురాణం మాత్రమే 
12. అవసరాన్ని బట్టి తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకుంటూ ఉంటే కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యాంగా ఉంటాయి 
13. రెస్వెరాట్రాల్ వయసును తగ్గించదు 
14. స్వయంప్రకటిత శాస్త్రవేత్తలు వైద్యులు కారు 
15. ఫలానా ఆహారం వలన బరువు తగ్గారంటే అది వారి శరీరంలో కేలరీల నియంత్రణల బట్టి సాధ్యమైంది తప్ప ఆహరం వలన కాదు
16. పండ్లతోపాటు పాలు పదార్ధాలు తీసుకోవడం మంచిదే 
17. యోగా చేయడం వలన బరువు తగ్గరు 
18. ప్రతిరోజూ మాల్ట్ విటమిన్లు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగు పడదు, వ్యాధులు రాకుండా ఉండవు 
19. జుట్టు పెరగడానికి గాని ఎదగడానికి గాని బయోటిన్ ఏ విధంగానూ ఉపయోగపడదు 
అని పెద్ద చిట్టా రాశారు 

వాస్తవాల సంగతి అటుంచితే దీనిలో యోగా వలన బరువు తగ్గదనడానికి ఏమి ఆధారాలున్నాయని అనేకమంది నెటిజన్లు డాక్టరును ఎదురు ప్రశ్నించారు. దీంతో డాక్టర్ తన పరిశోధనకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ యోగా వలన బరువు తగ్గుతారనడానికి సరైన రుజువులు లేవని చెప్పారు.      

హఠ యోగ క్రియల్లో భాగంగా చెప్పిన విన్యాసం యోగా, పవర్ యోగా మాత్రమే బరువు నియంత్రణకు ఉపయోగపడతాయని ఫిలిప్స్ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement