
92 స్థానాల్లో ‘వన్ హైదరాబాద్ కూటమి’ పోటీ
లోక్‌సత్తా -35,సీపీఎం-33. సీపీఐ-22,ఎంసీపీఐ-2
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి 92 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లోక్‌సత్తా 35,సీపీఎం 33,సీపీఐ 22.ఎంసీపీఐ 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాజీ ఎంపీ అజీజ్‌పాషా(సీపీఐ), డీజీ నర్సింహారావు(సీపీఎం), పాండురంగారావు(లోక్‌సత్తా), తాండ్రకుమార్(ఎంసీపీఐ) మాట్లాడుతూ స్వచ్ఛ రాజకీయాలు, వార్డు స్థాయిల్లో స్థానిక ప్రజలకే అధికారాలు అన్న ప్రాతిపదికన కనీస ఉమ్మడి కార్యక్రమంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరి లోకి దిగటానికి తాము ‘వన్ హైదరాబాద్ కూటమి’గా ఏర్పడినట్లు తెలిపారు. తమకు ఎంబీసీ-జేఏసీ, లౌకిక ప్రజాతంత్ర శక్తులు, కాలనీ కమిటీలు,వెల్ఫేర్ అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయన్నారు. కొన్ని సీట్లల్లో వారు కూడా పోటీ చేస్తారన్నారు. టీఆర్‌ఎస్-ఎంఐఎం , టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుళ్లు రాజకీయాల నుంచి బయటపడేందుకు నగర ప్రజ లకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ వన్ హైదరాబాద్ కూటమి మాత్రమేనన్నారు. సమావేశంలో నాయకులు ఎం.శ్రీనివాస్, సోమయ్య(సీపీఎం),డాక్టర్ సుధాకర్, నర్సింహా (సీపీఐ), తారకృష్ణ స్వామి, శ్రీనివాస్(లోక్‌సత్తా), మల్లేష్(ఎంసీపీఐ) పాల్గొన్నారు.
పార్టీల వారీగా వివరాలు ఇవీ
లోక్‌సత్తా 35 స్థానాలు: ఏస్‌రావు నగర్(డివిజన్-2), చర్లపల్లి(3),హయత్‌నగర్(13), బీన్‌రెడ్డినగర్(14), వనస్థలిపురం(15), కొత్తపేట(21), చైతన్యపురి(22),గడ్డిఅన్నారం(23), మూసారంగ్‌బాగ్(25), మెహిదీపట్నం(70), నల్లకుంట(81), రాంనగర్(87), గాంధీనగర్(89), బంజరాహిల్స్(93), జూబ్లీహిల్స్(95), యూసఫ్‌గూడ(96), సోమాజీగూడ(97), అమీర్‌పేట(98), సనత్‌నగర్(100), రహమత్‌నగర్(102), మాదాపూర్(107), హఫీజ్‌పేట(109), చందానగర్(110), కేపీహెచ్‌బీ కాలనీ(114),అల్లాపూర్(116),మూసాపేట(117),ఓల్డ్బోయినపల్లి(119),కూకట్‌పల్లి(121),వివేకానందనగర్(122),అల్విన్‌కాలనీ(124),అల్వాల్(134),వినాయక్‌నగర్(137),ఈస్ట్ ఆనంద్‌బాగ్(139),మల్కాజిగిరి(140),బేగంపేట(149). సీపీఎం-33 సీట్లు: కాప్రా(డివిజన్-1),మీర్‌పే హెచ్‌బీకాలనీ(4),హబ్సీగూడ(8),రామంతాపూర్ ఈస్ట్(9),ఉప్పల్(10),మన్సూరాబాద్(12),చంపాపేట (17),లింగోజీగూడ(18),సంతోష్‌నగర్(39),ఉప్పుగూడ(44),బేగంబజార్(50),గోషామహాల్(51),మైలారదేవపల్లి(59),జియాగూడ(62),లంగర్‌హౌజ్(66), గుడి మల్కాపూర్(71), గోల్నాక(82),బాగ్ అంబర్‌పేట (84),ముషీరాబాద్(86),భోలక్‌పూర్(88),కవాడీగూడ (90),వెంగళరావునగర్(99),ఎర్రగడ్డ(101),బోరబండ (103),గచ్చిబౌలి(105),శేరిలింగంపల్లి(106),బాలాజీనగర్(115),సూరారం(129),మౌలాలి(138),అడ్డగుట్ట
(142),మెట్టుగూడ(144),బౌద్ధనగర్(146), బన్సీలాల్‌పేట(147). సీపీఐ -22 స్థానాలు: మల్లాపూర్(డివిజన్-5),నాగోల్ (11),సరూర్‌నగర్(19): అక్బర్‌బాగ్(27),పత్తర్‌పట్టి (32),గౌలీపుర(35),లలితాబాగ్(36),ఐఎస్‌సదన్(38),జంగంమెట్(45),రాజేంద్రనగర్(60),గోల్కొండ(67),అంబర్‌పేట(83), కోండాపూర్(104),రామచంద్రాపురం(112),బాలానగర్(120),జగద్గిరిగుట్ట(126),గాజుల రామారం(125),రంగారెడ్డి నగర్(127),వెంకటాపురం (135),నేరేడ్‌మెట్(136), గౌతంనగర్(141),తార్నాక (143). ఎంసీపీఐయూ-2 స్థానాలు: షేక్‌పేట, మియాపూర్ (108).