ఎజెండాలతో ‘హోదా’కు గండి | Andhra pradesh is not getting special status with agendas | Sakshi
Sakshi News home page

ఎజెండాలతో ‘హోదా’కు గండి

Published Sun, Aug 23 2015 4:55 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఎజెండాలతో ‘హోదా’కు గండి - Sakshi

ఎజెండాలతో ‘హోదా’కు గండి

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి ఏడాదికి పైగా కేంద్ర ప్రభుత్వం దోబూ చులాట సాగించింది. అధ్యయనం చేస్తు న్నట్టు, సానుకూల ప్రకటన వస్తుంద న్నట్టు ఆశలు రేకెత్తించారు. కేంద్రం తమ చేతులలోనే ఉన్నట్టు రాష్ర్ట ప్రభుత్వం బీరాలు పలికింది. విభజన బిల్లు మీద జరిగిన చర్చలో గట్టిగా వాదించిన ఆనా టి ప్రతిపక్ష నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు ఇప్చడు కీలక పదవు లలో ఉండడంతో నమ్మకాన్ని పెంచింది. ఆ తర్వాత ఈ నేతలే మాటమార్చడంతో, ముఖ్యమంత్రి మౌనముద్ర దాల్చడంతో శంక లు మొదలయ్యాయి. జూైలై 31న కేంద్ర ప్రణాళికా శాఖమంత్రి, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ ైైజైట్లీల ప్రకటనలతో ప్రత్యేక హోదాకు ఎసరు పెట్టారని అర్థమైంది.
ప్రత్యేక హోదాను నిరాకరించడానికి బీజేపీ ప్రభుత్వం చూపు తున్న కారణాలలో నిజాయితీ కనిపించదు. రాష్ర్ట ప్రగతి గురించి నిరంతరం ప్రగ ల్భించే టీడీపీ ప్రభుత్వం హోదా గురించి  గట్టిగా నిలదీయకపోవడం వెనుక చిత్తశుద్ధి కూడా కానరాదు.

విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని  చేర్చక పోవడా న్ని బీజేపీ సాకు గా చూపుతున్నది. ఎన్నికలకు ముందే విభజన జర గాలనుకు న్నారు. దానికోసం రాజ్యసభలో బిల్లును యథాతథంగా ఆమోదిం చకపోతే, మళ్లీ లోక్‌సభ ఆమోదం పొందవలసి ఉంటుంది. కాబట్టే కాంగ్రె?స ప్రభుత్వం, నాటి ప్రతిపక్ష బీజేపీ చేసుకున్న ఒప్పందం ఫలితంగానే ప్రధాని ప్రకటన వచ్చిందనేది బహిరంగ రహస్యం. దానిని అమలు చేయవలసిన నైతిక బాధ్యత బీజేపీ మీద ఉంది. చట్టంలో ఈ అంశం ఉండి తీరాలని కేంద్రం భావిస్తే, చట్ట సవర ణతో ముంపు గ్రామాలను చేర్చినట్టూ, శాసనమండలి స్థానాలను పెంచినట్టూ ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించాలి. అంతేగాని హోదా ఎగవేతకు దానినే కారణం చేయరాదు.


అరుణ్ జైట్లీ తాజాగా 14వ ఆర్థిక సంఘం సిఫారసును కూడా ఓ సాకుగా చూపుతున్నారు. గతంలో ఉన్న ప్రత్యేక కేటగిరీ విధానం ఇప్చడు సరికాదని ఆర్థిక సంఘం చెప్పిందనీ, అందు వల్ల ఈ వివాదానికి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక సాయమందజేస్తామనీ ప్రకటించారు. అంటే ప్రత్యేక హోదా లేదని జైట్లీ చెప్పకనే చెప్పారు. ఆయన న్యాయవాది. రాజ్యాంగాన్ని ఔపో సన పట్టినవారు. ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేని అంశం. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రకటించే లేదా తొల గించే అధికారం ఆర్థిక సంఘానికి ఎక్కడ నుంచి వచ్చినదీ జైట్లీయే చెప్పాలి. ప్రత్యేక హోదాకు మార్గదర్శకాలను ప్లానింగ్ కమిషనఖ రూపొందించినా, మంజూరు గురించి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం జాతీయ అభివృద్ధి మండలికి ఉండేది. ఇప్చడు ఈ రెండు సంస్థలు రద్దయ్యాయి. అధికారం గల సంస్థ అస్తిత్వంలో లేదు. అస్తిత్వంలో ఉన్న ఆర్థిక సంఘానికి లేని అధికారాలు కట్ట బెట్టి ప్రత్యేక హోదాను పక్కన పెట్టడం కంటే మించిన వంచన ఉం డదు. ప్రత్యేక హోదాను మంజూరు చేసే సంస్థలు లేకపోవడంతో  నిర్ణయం తీసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా ఆమోదించిన హామీని నెరవేర్చక పోతే పార్లమెంటఖ విశ్వసనీయత దెబ్బ తింటుంది. ఇది ఒక అసా ధారణ పరిస్థితిలో, రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీ.

మన రాజ్యాంగం ఆర్టికలఖ 4 ప్రకారం రాష్ట్రాల పునర్విభజన సం దర్భంగా ఉత్పన్నమయ్యే తాత్కాలిక ఇబ్బందుల పైనా, పర్యవ సానాలపైనా తగిన చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటఖకు ఉంది. బీజేపీకి హామీని నిలబెట్టుకోవడం కంటే, టీడీపీకి ఆ హోదా ను సాధించడం కంటే తమ తమ సొంత ఎజెండాలే ముఖ్యమైన ట్టు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టడానికి బలమైన రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదాను కోరుతున్న బిహార్‌కు త్వరలో ఎన్నికలు జరగబో తున్నాయి. ఇక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ బిహార్ ఎన్నికలలో హోదా ప్రధాన ఎజెండా అవుతుంది. పార్లమెంటఖ ఎన్నికలలో ఢిల్లీలో ఘనవిజయం సాధించిన బీజేపీ తర్వాత జరి గిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైంది. ఇదే బిహార్‌లోనూ పునరావృతమైతే, అది దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైనట్టు చెప్పే బలమైన సంకేతమవుతుంది. అందుకే హోదాలకు బదులు ప్యాకేజీ నినాదాన్ని తలకెత్తుకుంది. మరోపక్క తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత ఆంధ్రప్రదేశఖకు ప్రత్యేక హోదాను తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ఆమెతో దోస్తీకి బీజేపీ బాటలు వేసుకుంది.

రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అనుమతి పొంద కుండా  కేంద్ర మంత్రులు హోదాపై ప్రకటనలు చేసే వీలులేదు. ప్రత్యేక హోదా రాదని బాబుకు ముందే తెలుసునని టీడీపీ పార్ల మెంటఖ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి ఒక ప్రకటనే చేశారు. అడపా దడపా హోదా అని అంటున్నా, బాబు మనసు మాత్రం ప్యాకేజీ మీదేనని ఆయన స్పందిస్తున్న తీరే తేటతెల్లం చేస్తున్నది. చేసిన వాగ్దానాలు, ఇస్తున్న రాయితీలు, దుబారా అన్నీ కలిపి నెలనెల గండంగా ఉంది. ఇవే తనను గెలిపించిన మంత్రదండాలుగా ఆయన భావిస్తున్నారు. దీనిని సాగించడానికి డబ్బు కావాలి. ప్యా కేజీ ఐతే ఖజానాకు డబ్బుల్ఠస్తాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికీ, ప్రజలకూ ప్రయోజనం. ప్యాకేజీ ప్రభుత్వానికి ప్రయోజనం. అందుకే ప్రత్యేకహోదా కోసం చెప్పే మాటలలో చిత్తశుద్ధి కొరవ డింది. బీజేపీ, టీడీపీలు స్వప్రయోజన రాజకీయాలకు ప్రత్యేక హోదాను బలితీసుకున్నట్టు కనిపిస్తున్నది.  
వ్యాసకర్త అధ్యక్షులు, డీవీవీఎస్ శర్మ,
ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా పార్టీ, మొబైల్  9866074023

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement