
వాళ్లకు గల్లాపెట్టె, ఓటు బ్యాంకే ముఖ్యం: జేపీ
విశాఖపట్నం: గల్లా పెట్టె, ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప రాష్ర్ట ప్రయోజనాల్ని కొన్ని పార్టీలు పట్టించుకోవడం లేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. తెలుగు ప్రజల భవిత కోసం 4 డిమాండ్లతో కూడిన 'సంకల్ప దీక్ష' ను గురువారం ఉదయం 10.30 నిమిషాలకు చేపట్టిన జేపీ సాయంత్రం నాలుగు గంటలకు విరమించారు. దీక్షకు ముందు, తర్వాత జేపీ ప్రసంగించారు. రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించడం సంతోషదాయకమన్నారు. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి డబ్బులు లేవంటే నవ్వుతారని, క్యాంపు కార్యాలయం కోసం రూ.కోట్లు వెచ్చించడమేమిటని ప్రశ్నించారు. ఈ నెల 15న హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.