రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా? | Jayaprakash Narayana comments on Roja incident | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా?

Published Mon, Feb 13 2017 2:19 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా? - Sakshi

రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా?

రోజా సంఘటనపై జయప్రకాశ్‌ నారాయణ స్పందన

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పాలన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోందా అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఇటీవల విశాఖపట్నంలో క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపడం, జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే ప్రభుత్వం అడ్డుకోవడం వంటి వరుస సంఘటనలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో సామాన్య వ్యక్తిని పాల్గొనకుండా అడ్డుకున్నా పెద్ద తప్పుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. అలాం టిది ప్రజలెన్నుకున్న మహిళా ప్రజాప్రతినిధిని ఆ సదస్సులో పాల్గొనకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇతరులను కించపరిచేలా ప్రవర్తించారని  ఎమ్మెల్యే రోజా కానీ, ఇంకెవరైనా కానీ అనుకుంటే న్యాయపరంగా వారిపై పరువు నష్టం దావా వేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇలాంటి పరిణామాలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, చివరికి రాష్ట్రానికే చెడ్డపేరు తెస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పోలీసులు సైతం రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement