
ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు.
తునిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 650 మంది విద్యార్థులకు గానూ ఆరుగురు లెక్చరర్లు మాత్రమే ఉండగా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని డిగ్రీ కళాశాలలో 50 మంది విద్యార్థులకు 13 మంది లెక్చరర్లు ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వముండటం దౌర్భాగ్యమన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాల్సిన అవసరముందన్నారు.