Public Problems
-
తూతూ మంత్రం.. ప్రజా సమస్యల పరిష్కారం!
సాక్షి, అమరావతి: ప్రజా వినతులకు సరైన పరిష్కారం చూపకుండా ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. నామమాత్రపు చర్యలతో సరిపెడుతోంది. చాలా వినతులను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజా వినతుల పరిష్కారంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరు సక్రమంగా లేదని ప్రకటించారు.గత ఏడాది జూలై 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ వరకు 7.42 లక్షల ప్రజా వినతులు రాగా, అందులో ఇంకా 2.91 లక్షలు పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. మరోవైపు కొన్ని వినతులు పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఉండటం లేదని ప్రభుత్వ అధ్యయనంలోనే తేలింది. ప్రజా వినతుల పరిష్కార పరిస్థితి ఇదీ... » పోలీసు శాఖ ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరుపై 70 శాతం అర్జీదారులు అసంతృప్తి చేశారు. » మున్సిపల్ శాఖపై 69 శాతం మంది అసంతృప్తి. » స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై 67 శాతం సంతృప్తి వ్యక్తమైంది. » రెవెన్యూ శాఖలోను 60 శాతం అసంతృప్తి వ్యక్తంచేశారు. అత్యధికంగా రెవెన్యూలో మ్యుటేషన్, విస్తీర్ణంలో తేడాలపై సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీల సరవణలు, భూ కమతాల పంపిణీ, పట్టాదారు పాస్‌పుస్తకాల గురించి వినతులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా సంబంధిత వీఆర్వోలకు బదిలీ చేస్తున్నారు. వీఆర్వో నివేదిక ఆధారంగా అధికారులు ఎండార్స్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పిటీషనర్ల దగ్గరకు వెళ్లడం లేదు. ప్రాథమిక విచారణ చేయడం లేదు. » ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన కొన్ని కేసుల్లో అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎండార్స్మెంట్లు ఇస్తున్నారు. కానీ, చాలా కేసుల్లో నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని ఫిర్యాదులను అప్లోడ్ చేయడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పేర్కొంటున్నారు. అటువంటి వాటిపై నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోవడం లేదు. » అర్జీదారుల వినతి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్నిచోట్ల ఫిర్యాదులను తిరిగి తెరిచినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. » వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి శాఖల వారీగా చేసిన సర్వేకు, సీఎంవో చేసిన సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. సీఎంవో నిర్వహించి సర్వేలో ఎక్కువ శాఖల్లో ప్రజల వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. -
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్‌లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అంతటి జనసంద్రంలోను ప్రజలపైనే ద్యాస..
-
మోదీపై నామినేషన్ల అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యనేతలపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాధితులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడం సరికొత్త నిరసన అస్త్రంగా మారింది. పసుపు బోర్డు ఏర్పాటు, మొక్కజొన్నకు మద్దతు ధర హామీలు నెరవేర్చకపోవడంతో ఇటీవల నిజామాబా ద్ లోక్‌సభ స్థానానికి సుమారు 200 మంది రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లోరోసిస్ బాధిత ప్రజల తరఫున సరిగ్గా ఇదే తరహా లో ప్రధాని మోదీపై నామినేషన్లు వేసేందుకు రెండు రాష్ట్రాల ఎన్ఆర్ఐలు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ 22 నుంచి 28 వరకు వారణాసి స్థానానికి నామినేషన్లను స్వీకరించనుండగా, మే 19న ఎన్నికలు జరగనున్నాయి. కోదాడకు చెందిన ఎన్ఆర్ఐ జలగం సుధీర్, ప్రకాశం జిల్లాకు చెందిన వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ వడ్డె శ్రీనివాస్ మరో ఇద్దరు ఫ్లోరోసిస్ బాధితులతో కలసి ఏప్రిల్ 22న వారణాసిలో నామినేషన్లు వేయబోతున్నారు. నల్లగొండలో 2 లక్షల మంది బాధితులు నల్లగొండ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది ఫ్లోరోసి స్ బాధితుండగా, ప్రకాశం జిల్లాలో వేలాది మంది ఉన్నారు. ఫ్లోరోసిస్ వ్యాధి గుర్తింపు, చికిత్స విధానం పై పరిశోధనల కోసం 2007–08లో నాటి యూపీఏ ప్రభుత్వం దేశంలో 2 రీజినల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాల కోసం నల్లగొండ జిల్లాకు, ఉత్తరాది రాష్ట్రాల కోసం గుజరాత్‌కు ఈ కేంద్రాలను మంజూరు చేసింది. 2007లో ఈ ప్రాజె క్టు నల్లగొండ జిల్లాకు మంజూరు కాగా, ఇప్పటి వర కు కాగితాలపైనే ఉండిపోయింది. నాటి రాష్ట్ర ప్రభు త్వ విజ్ఞప్తి మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ల ను తయారు చేసి, 2007–12 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మూడుసార్లు సమర్పించింది. తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఈ ప్రాజెక్టు కోసం చౌటుప్పల్‌లో 8 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు జిల్లా కలెక్టర్ కోర గా, ఇందుకు ఆ సంస్థ నిరాకరించింది. తాము కన్స ల్టెంట్‌గా మాత్రమే సేవలందిస్తామని, ప్రాజెక్టును అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం.. నాయకులు, అధికారుల అనాసక్తితో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. కేంద్రం అశ్రద్ధ... డిసెంబర్ 2017లో ఎన్ఆర్ఐల బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్లో సమావేశమై ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు స్థితిగతులను తెలుపుతూ కేసీఆర్ నుంచి కొన్ని రోజులకు ఓ లేఖ అందిందని జల గం సుధీర్ తెలిపారు. కేంద్రంలోని కొందరు అధికారులు అశ్రద్ధ చూపడంతో ప్రాజెక్టు సాధించలేకపోతున్నామన్నారు. ఈ విషయంలో కేం ద్రం విఫలం కావడంతోనే ప్రధానిపై పోటీకి దిగుతున్నామన్నారు. ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్‌తో పాటు వ్యాధి బాధిత ప్రజలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. -
కొడుకులిద్దరూ ఎస్సైలు తరచూ తండ్రి అరెస్ట్..
మెదక్ : అతనొక రిటైర్డ్ ఎంఈఓ...ఆయన ఇద్దరు కొడుకులు ఎస్సైలుగా పని చేస్తున్నారు. ఒకరు సివిల్ ఎస్సైగా, మరొకరు ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఆ తండ్రిని మాత్రం పోలీసులు తరచూగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. స్టేషన్‌కు తరలించి స్వంత పూచీకతుపై ఏ సాయంత్రానికి వదిలిపెడుతున్నారు. ఇంతకీ ఆ తండ్రి చేసిన నేరం ఏంటని అనుకుంటున్నారా? ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే ఆ అరెస్ట్‌లకు కారణం పేదల పక్షాన నిలబడి ప్రశ్నించడమే.. మెదక్ పట్టణం అజంపుర వీధికి చెందిన సార శ్యాంసుందర్ 1977 సంవత్సరంలో ఎజ్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఎంఈఓ స్థాయికి ఎదిగారు. 58 సంవత్సరాల ఆయన సర్వీస్‌లో వేలాది మంది విద్యార్థులకు బతుకు దారి చూపిన ఆయన 2012 సంవత్సరంలో మెదక్ ఎంఈఓగా రిటైర్డ్ అయ్యారు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కొడుకులు ఎస్సైలుగా స్థిరపడ్డారు. ఒకరు హైదరాబాద్‌లో సివిల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తోంటే, మరో కొడుకు సీఆర్పీఎఫ్ ఎస్సైగా ఛత్తీస్‌ఘడ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శ్యాంసుందర్‌కు నెలనెలా ఐదంకెల పింఛన్ సైతం వస్తోంది. ఎలాంటి ఆర్థిక బాధలు, ఇబ్బందులు లేవు. కానీ ఆయన బాధంతా సమాజంలోని సమస్యలపైనే. వాటిపైనే ఆయన పోరాటం. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సరసన చేరిన ఆయన జేఏసీ జిల్లా కో–చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కోదండరాం పిలుపునిచ్చే ప్రతీ ఆందోళనలో ముందుంటూ పాల్గొంటున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అరెస్టయ్యాడు. కరీంనగర్ జిల్లా నేరళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు వెళ్లి అక్కడ అరెస్టయ్యాడు. రైతు రుణమాఫీలు, అన్నదాతల ఆత్మహత్యలపై కోదండరాం చేపట్టిన ఆందోళనలో అరెస్టయ్యాడు. కొలువుల కొట్లాటకు నిరసనకారులు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసిన ఘటనలోనూ శ్యాంసుందర్ మాస్టారును అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రజా సమస్యలపై ముందుండి పోరాటం చేస్తున్న శ్యాంసుందర్ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన మర్కిలి పోచయ్య దుబాయి వలసవెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. నెలల తరబడి అతడి మృతదేహాన్ని తీసుకురాకపోవడంతో శ్యాంసుందర్ మాస్టారు బాధిత కుటుంబీకులతో కలిసి మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో ధర్నా చేశారు. పోచయ్య మృతదేహాన్ని రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన ముందుండి ఇతరులకు తన వంతు సేవ చేస్తుంటాడు. తనతోటి పెన్షన్‌దారులతో కలిసి జిల్లా కమిటీని వేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటాడు. పెద్ద వయస్కులు, నడవలేని వారికి ప్రతీ యేటా లైఫ్ సర్టిఫికెట్లను సంబంధిత అధికారులకు సబ్మిట్ చేస్తూ వారికి అండగా ఉంటున్నాడు. తన సామాజిక వర్గానికి చెందిన నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, కోచింగ్‌లు ఇప్పించడం వంటి పలు కార్యక్రమాలను సైతం చేస్తూ మన్ననలు పొందుతున్నాడాయన. ప్రశ్నించేతత్వం ఉండాలి ప్రతీ వ్యక్తి ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. సమస్యలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తేనే వాటిని నెరవేర్చుతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే వాటిపై గళమెత్తాలి. అప్పుడే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి. దీన్ని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలి. నిరుపేదలు ఆపదలో ఉంటే వారి తరఫున నిలబడడం, అత్యవసర సమయంలో తోచిన ఆర్థిక సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. – సార శ్యాంసుందర్, రిటైర్డ్ ఎంఈఓ, జేఏసీ, ఎస్సీసెల్ నాయకుడు -
వైఎస్ జగన్‌కు ప్రజా సమస్యలే జగన్‌కు ముఖ్యం
-
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవండి
-
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవండి
కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ నేతలకు సూచించారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక హెలికాన్ టైమ్స్‌లో పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లతో సోమవారం పార్టీ కార్యకలాపాలపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను ఇవ్వాలన్నారు. జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలను కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. నియోజకవర్గాల వారీ సమీక్ష ఇంటింటికీ వైఎస్సార్‌తో పాటు పోలింగ్‌బూత్ స్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం, ఇతర అంశాలపై నియోజకవర్గాల వారీగా ధర్మాన సమీక్షించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి పార్టీని, పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, మోషేన్‌రాజు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, కాకినాడ పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, అమలాపురం పరిశీలకులు వలవల బాబ్జి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, ముత్తా శశిధర్, తోట సుబ్బారావునాయుడు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, అనంత ఉదయభాస్కర్, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, అల్లూరి కృష్ణంరాజు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కాకినాడ సిటీ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు. సురాజ్య యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తునిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 650 మంది విద్యార్థులకు గానూ ఆరుగురు లెక్చరర్లు మాత్రమే ఉండగా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరులోని డిగ్రీ కళాశాలలో 50 మంది విద్యార్థులకు 13 మంది లెక్చరర్లు ఉన్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వముండటం దౌర్భాగ్యమన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాల్సిన అవసరముందన్నారు. -
కేటీఆర్ రాజీనామా చేయాలి: నిరంజన్
సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గంలోని నేరేళ్లలో దళితులు, బీసీలపై పోలీసులు జరిపిన దౌర్జన్యం గురించి తెలియదని, స్థానిక నాయకులు తనకు సరైన సమాచారం ఇవ్వలేదని బుకాయిస్తున్న కేటీఆర్.. మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన ఐదువారాలకు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ ప్రజా సమస్యలపై ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుస్తోందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. -
సమస్యలు గాలికొదిలేసి వ్యక్తిగత దాడులా?
ఒంగోలు: శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ తప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గుక్కెడు మంచినీళ్లు లేక ఓ వైపు జనం అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్షంపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. సభలో ప్రతిపక్షం ప్రజా సమస్యలపై నిలదీస్తే చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వితండవాదాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని బత్తుల పేర్కొన్నారు. -
కర్నూలులో YSRCP ప్రజా సమస్యలపై పోరుబాట
-
పండుగ తర్వాత ప్రజా దర్బార్
ప్రగతి భవన్లో జనంతో సీఎం కేసీఆర్ ముఖాముఖి కులాలు, వర్గాలవారీగా సమావేశాలు సమస్యలు, పరిష్కారాలు పంచుకునే యోచన సీఎంఓ అధికారులు, సన్నిహిత మంత్రులతో ఇప్పటికే మంతనాలు సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభానికి సీఎం కె.చంద్రశేఖర్ రావు సిద్ధమవుతున్నారు. కొత్తగా నిర్మించిన సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ వేది కగా ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తు న్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులు, సన్ని హిత మంత్రులతో సీఎం ఇప్పటికే సమాలోచ నలు జరిపారు. దర్బార్ నిర్వహణకు అనుస రించాల్సిన విధానాలను చర్చించారు. అన్ని కులాలు, వర్గాలతో సమావేశమయ్యేలా ప్రణా ళిక ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిశ్చయించారు. దీంతోపాటు తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చే బాధితులు, ఆపన్నులను సైతం తనను కలిసేందుకు వీలు కల్పించాలని సూచించారు. దీంతో రెండు విధాలుగా ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశాలు ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. జనహిత భవన్లో సమాలోచన... ప్రగతి భవన్ సముదాయంలోనే దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా ఇప్పటికే హాల్‌ను నిర్మించారు. సీఎం దీనికి ‘జనహిత భవన్’ అని పేరు పెట్టారు. రైతులు, కార్మికు లు, ఉద్యోగులు, కళాకారులు తదితర వర్గాల తో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ విధానాల రూప కల్పన, కార్యక్రమాల అమలుపై వారితో సమాలోచనలు జరుపుతారు. ఈ సమావేశాల నిర్వహణకు వీలుగానే మీటింగ్ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన కొత్తలో ఎమ్మార్వోలు, ఎంపీడీవో లతో సీఎం సమావేశమైన తరహాలోనే ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకా ల లబ్ధిదారులు, వృత్తులు, కులాలు, సంఘా లు, యూనియన్లవారీగా ప్రతి వర్గంతో సీఎం నేరుగా మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలకు షెడ్యూ లు ఖరారు చేస్తారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి సమావేశానికి వచ్చే వారికి రానుపోను రవాణా సదుపాయంతోపాటు ప్రగతి భవన్ సముదాయంలోనే భోజన ఏర్పాట్లు చేయా లని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, బంగారు తెలంగాణ లక్ష్య సాధన ఇతివృత్తంతో రూపొందించిన డాక్యు మెంటరీలు, వీడియో క్లిప్పింగులు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. క్షేత్రస్థాయిలో వారి సాధక బాధకాలు, సమస్యలను వివరించే అవకాశం కల్పించటంతోపాటు చివరగా ముఖ్యమంత్రి సందేశమిచ్చేలా సమావేశాలకు రూపకల్పన చేస్తున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రీనింగ్... ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే జనాన్ని నియంత్రించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ విధానంలో సీఎంను కలవాల నుకుంటున్న అర్జీదారులు ముందుగా సంబంధిత కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. నిజంగానే అది సీఎం దృష్టికి వెళ్లాల్సిన అంశమని కలెక్టర్లు భావిస్తే వారికి అవకాశం కల్పిస్తారు. ఏరోజు వెళ్లాలనే సమాచా రంతోపాటు ఉచిత రవాణా సదుపాయం కల్పించే కూపన్ కూడా ఇస్తారు. కేవలం అవసరమున్న వారు, బాధితులు, ఆపన్నులు, అర్జీదారులు మాత్రమే సీఎంను కలిసేందుకు ఈ నియంత్రణ ఏర్పాట్లు ఉండాలని యోచిస్తున్నారు. -
ప్రజల సమస్య ప్రభుత్వానికి పట్టదా?
తుని : ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. ఎంతసేపూ తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికే సీఎం పరిమితమయ్యారన్నారు. తుని శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజా ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి వారం అవుతోందని, ఇంతవరకూ ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరును ఎండగడుతున్న ప్రతిపక్షాలపై పోలీసులు చేత కేసులుపెట్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తొండంగి మండలం కోన ప్రాంతంలో కాలుష్యం వెదజల్లే దివీస్ పరిశ్రమ కోసం అక్కడి ప్రజలను సమస్యల్లోని నెడుతున్నాయన్నారు. దివీస్ బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోß毌S రెడ్డి ఈ నెల 22న తొండంగి మండలానికి వస్తున్నారన్నారు. అక్కడ జరిగే జగ¯ŒS బహిరంగ సభను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంత చేయాలని రాజా కోరారు. -
అధ్యక్షా ఇదేమి సంప్రదాయం...!
జిల్లా సమస్యలపై చర్చే లేదు వెంటాడుతున్న అనారోగ్యాల ఊసేలేదు మంత్రి వెంట పరుగులు ... హాజరుకాని డీఎంహెచ్ఓ తూతూ మంత్రంగా సాగిన జెడ్పీ సమావేశం రాష్ట్రానికి శాసన సభ ఎలానో ... జిల్లాకు జెడ్పీ సర్వసభ్య సమావేశం అలాంటింది. తమ జిల్లా ప్రతినిధులు శాసన సభలో ఏ అంశాలు ప్రస్తావించనున్నారోనని ఆశగా ఆ జిల్లా ప్రజలు ఎదురు చూసినట్టే ... తమ మండలంలోని ఏ సమస్యలను మండల ప్రజా ప్రతినిధులు, జెడ్పీ సభ్యులు చర్చకు తేనున్నారోనని మండలాల్లోని ప్రజలు గమనిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జెడ్పీ సమావేశం ఉబుసపోక కేంద్రంగా మారుతోంది. అజెండా ఉండదు ... చర్చనీయాంశ అంశాలేవో తెలియదు ... గత సమావేశం తీర్మానాల ప్రగతి ఎలా ఉంది? అభివృద్ధి ఎలా సాగుతుందో సమాధానం చెప్పేవారే లేరు. యథారాజా తథాప్రజా మాదిరిగా ప్రజాప్రతిని«ధులు గైర్హాజరైతే మేమేం తక్కువ తిన్నామానంటూ అదే బాటను పడుతున్నారు అధికారులు. సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పరిష్కారం చూపించేందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మించిన వేదిక మరొకటి ఉండదు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డిఆర్సీ) అంటూ ఒకటుండేది. ఇప్పుడది మనుగడలో లేదు. మూడు నెలలకోసారి జరిగే ఈ జెడ్పీ సమావేశాలు జిల్లా అంతటినీ ప్రతిబింబించాలి. కానీ సమావేశాలు జరుగుతున్న తీరుతో జెడ్పీ రానురాను ప్రజల్లో పలచనైపోతోంది. జిల్లా వ్యాప్తంగా 62 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఇందుకు కొద్ది అటు ఇటుగా మండల పరిషత్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే హాజరయ్యారు, ఎంపీలు..ఇలా ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో మూడొంతులు మంది ప్రాతినిధ్యంవహిస్తున్న జెడ్పీలో ‘ప్రజల సమస్యలపై లోతైన సమీక్షలు జరిగే రోజులు గతంలో ఉండేవంట’ అని అనుకునే వాతావరణం కనిపిస్తోంది. సోమవారం కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఇందుకు అద్దం పడుతోది. చర్చల్లేకుండా కాలక్షేపం... ఉదయం 11.15 గంటలకు ప్రారంభమైన సమావేశం భోజన విరామం అనంతరం తిరిగి 3 గంటలకు ప్రారంభమై నాలుగు గంటలతో ముగిసింది. అంటే ఐదు గంటలతో సభను ముగించేశారు. ఇదివరకైతే పలు అంశాలపై సుదీర్ఘ చర్చ చేపట్టడంతో రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు మన జెడ్పీలో అనేకం ఉన్నాయి. సభ్యులు పంపించిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలు తెలియచేయడం, సంతృప్తి చెందకుంటే వాటిపై చర్చను చేపట్టడమనే సంప్రదాయం గతంలో ఉండేది. ఇందుకు తొలి గంట ప్రశ్నోత్తరాల సమయంగా నిర్ణయించేవారు. ఇప్పుడసలు ప్రశ్నోత్తరాల సమయమే లేకుండా చేశారని, చర్చకు వచ్చిన అంశాలకు సమాధానాలు కూడా సంతృప్తినివ్వలేకున్నాయని సభా ముఖంగా పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. జిల్లాలో 19 మంది ఎమ్మెల్యేలుంటే పట్టుమని పది మంది మించి ఎమ్మెల్యేలు కనిపించ లేదు. ఎమ్మెల్సీలైతే ఒక్కరు కూడా హాజరుకాలేదు. వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఒకటి, రెండు అంశాలపై చర్చలో పాల్గొన్నాక వెళ్లిపోయారు. భోజన విరామానికి ముందు నిండుగా కనిపించిన సభ ఆ తరువాత పలచబడిపోయింది. ‘పనీపాట లేకుండా వచ్చామనుకుంటున్నారా’అంటూ ఏజెన్సీ ప్రాంతంలో కూవనరం జెడ్పీటీసీతోపాటు పలువురు మహిళా జెడ్పీటీసీలు మాట్లాడే అవకాశం దక్కలేదని స్పందిస్తేనే గానీ వారికి అవకాశం ఇవ్వలేదు. ఆరోగ్యం అంటే అంత నిర్లక్ష్యమా...! ప్రజాప్రతినిధులనే కాదు. ఇటు అధికారుల వైపు నుంచి కూడా దాదాపు ఇదే తీరు కనిపించింది. సమావేశంలో కొందరు అధికారులు నిర్థిష్టమైన సమాధానాలు చెప్పకపోవడం, కొందరు గైర్హాజర్ కావడాన్ని బట్టి సమావేశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాçష్ట్ర స్థాయిలో అసెంబ్లీ తరహాలోనే జిల్లా స్థాయిలో అంతటి ప్రాధాన్యం కలిగిన జెడ్పీ సమావేశం జరిగే తీరు ఇదేనా అని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఏజెన్సీలో అంతుపట్టని కాళ్లవాపు వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృత్యువాతపడినా వ్యాధి నిర్థారణ కాని పరిస్థితుల్లో సమావేశంలో చర్చకు అవకాశం ఉన్నా డీఎంహెచ్ఓ గైర్హాజర్ కావడం విస్మయాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు సభ్యులు ప్రస్తావిస్తే జగ్గంపేటలో ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు కార్యక్రమం ఉండటంతో రాలేదనే సమాధానం లభించింది. అంటే ఇక్కడ ఏడుగురు గిరిజనులు చనిపోయి, ఏజెన్సీ సహా జిల్లా అంతటా మలేరియా, టైపాయిడ్, విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితులు చర్చకు వస్తాయని తెలియదా అని సభ్యులు ప్రశ్నలకు సమాధానం లేదు. ఇక్కడ ప్రజల ఆరోగ్యంపై చర్చకంటే మంత్రి పర్యటనకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రజా సమస్యలపై వారికున్న చిత్తశుద్ధిని తెలియచేసింది. అలాగైతే అధికారులు తమ సబార్డినేట్లను పంపినట్టే తాము కూడా తమ భార్యలు, పిల్లలను పంపితే సరిపోతుందా అని పలువురు ప్రశ్నించడం గమనార్హం. కానరాని సగం శాఖల అధిపతులు 22 శాఖలకు సంబంధించిన సమాచారంతోపాటు అనుబంధంగా ఆరు శాఖల సమాచారాన్ని మాత్రమే ఎజెండాలోకి తీసుకువచ్చారు. ప్రధానమైన శాఖలు 55కుపైనే ఉన్నా వాటిలో సగానికి పైనే శాఖలను ఎజెండాలో విస్మరించిన అంశం ప్రస్తావనకు రాగా, వచ్చే సమావేశాల్లో అన్నింటినీ తీసుకువస్తామని జెడ్పీ సీఈఓ పద్మ సమాధానం సభ్యులకు సంతృప్తినివ్వలేదు. సమావేశంలో వచ్చిన సమస్యలను ఆయాశాఖలకు నివేదిస్తే ఆ తరువాత సమావేశం నాటికి పరిష్కరించ గలిగితే పరిష్కరించినట్టు లేకుంటే సాధ్యం కాదని ఆయా శాఖల అధిపతుల నుంచి సమాధానం జెడ్పీ ద్వారా సభ్యులకు తెలియజేయాలి. అది కూడా జరగడం లేదనే విషయం ఈ సమావేశం సాక్షిగా బయటపడింది. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇక ముందు అలా జరగకుండా చూస్తామని జెడ్పీ సీఈఒనే స్వయంగా పేర్కొనడాన్ని బట్టి కొన్ని శాఖల నుంచి సమాచారం రాకపోవడం వాస్తవమేనని విషయం వెల్లడైంది. సభలో రైతుల రుణాలు, పాఠశాల భవనాల నిర్మాణాలు, పవర్టిల్లర్లు పంపిణీ తదితర అంశాలపై ఒకపక్క చర్చ నడుస్తుంటే అదే సమయంలో వేదిక దిగువన పలువురు అధికారులు సభ్యులతో మరేదో అంశాలపై గుసగుసలతో సభ గందరగోళంగా మార్చడం సభా సంప్రదాయాలను పక్కదారిపట్టించడం కాదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇక ముందైనా సభా సమయాన్ని వృధా కానివ్వకుండా అన్ని అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిపి జిల్లాలో ప్రధాన సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో సభ్యులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
చేనేతన్నకు వడ్డీ భారం
పింఛన్ల కోసం ఎక్కేమెట్టు దిగేమెట్టు గడప గడపలో సమస్యల తిష్ట పక్కా గృహాలు ఊరింపేనా.. టవరు లైను కింద ఉన్న వారికి పక్కాగృహాలుఇస్తామని ఊరిస్తున్నారే తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదని రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట డీబ్లాకు గౌతమీనగర్ వాసులు వాపోయారు. జీవనం కష్టంగా మారిందని, కుమార్తె పనిచేసి పోషిస్తుందని కన్నీటి పర్యంతమయింది. గోదావరి చెంతనే తాగేందుకు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని సరోజినిదేవి కాతేరులో ఆవేదన వ్యక్తం చేసింది. కాతేరు సుబ్బారావునగర్‌లో సరైనరోడ్డు లేక వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చాడు. సాక్షిప్రతినిధి, కాకినాడ : రూ.110 కోట్లు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. రెండేళ్ల తర్వాత అమలు చేయటంతో రూ.35 కోట్లు వడ్డీ భారం భరించాల్సి వచ్చిందని చేనేత కార్మికులు అమలాపురం శివారు రంగాపురంలో మంగళవారం గడపగడపకు వైఎస్ఆర్లో భాగంగా వెళ్లిన నేతలముందు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సంఘం నాయకుడు కరెళ్ల రమేష్‌బాబు, అక్కిశెట్టి మల్లిబాబులు చేనేతలకు జరుగుతున్న నష్టాలను వివరించారు. సరైన రహదారులు, డ్రెయినేజీ సదుపాయం లేక ముంపు సమస్యతో ఇబ్బంది పడుతున్నామని పలువురు అయినవిల్లి మండలం తొత్తరమూడిలో ఆందోళన వ్యక్తం చేశారు. సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని శీలం వెంకటేశ్వర్లు, సునీత రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం బ్రహ్మపురిలో వాపోయారు. రోడ్లు నిర్మాణాలు జరగక మురుగులో బతుకుతున్నామని అర్జమ్మ అనే మహిళ మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మం డలం నల్లూరు కొత్తకాలనీలో మొరపెట్టుకుంది. అన్నీ సమస్యలే... నోటీసు ఇవ్వకుండా రహదారి విస్తరణలో తొలగించినా నష్టపరిహారం ఇవ్వలేదని నున్న నాగమణి కాకినాడ జగన్నాథపురం 16, 23, 25 డివిజన్లలో జరిపిన గడప, గడపకు వైఎస్ఆర్లో ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్‌సిటీలో తోపుడు బళ్ళ స్థానంలో లక్షన్నర విలువైన అత్యాధునిక ఆటోలు వినియోగించాలని అధికారుల ఆదేశాలు చిరువ్యాపారులకు ఇబ్బందికరంగా మారాయని వ్యాపారి పేపకాయల సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగురాలినైన తనకు పింఛను పొందేందుకు అర్హత ఉంది. పింఛన్ మంజూరైంది. నాలుగు నెలలు ఇచ్చారు. టీడీపీ వచ్చాక అర్హతలేదని తొలగించారని విశ్వనా«ద్ మొరబెట్టుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతోనే దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు సామర్లకోట మండలం పీబీ దేవంలో మొరబెట్టుకుంటున్నారు. ఎన్ని చేసినా దోమలు పెరిగి పొతున్నాయని గాలి ఉమా, ఓదూరి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ ఏదీ... పలువురు మహిళలు రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేసాడని గొల్లప్రోలు గాంధీనగర్ 9, 10వ వార్డులో ఆరోపించారు. భర్త చనిపోయి ఏళ్లుగడిచినా ఫించ ను మంజూరుచేయలేదని బండారు నూకరత్నం, రేషన్‌సరుకులు ఇవ్వడం లేదని దివ్యాంగురాలైన ఇమ్మంది లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటిæ వర్షానికే రహదారులు బురదమయమయ్యాని చవాకుల లక్ష్మి మొరబెట్టుకుంది. ఇంటి స్థలం ఇ వ్వాలని అధికారపార్టీ అధికారులు వద్దకు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని నక్కా నాగమణి పి గన్నవరం నియోజకవర్గం తొత్తరమూడి గడ పగడపకు వైఎస్ఆర్లో ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రజా సమస్యలకు పరిష్కారమేదీ?
– చూద్దాం..చేద్దామంటూ కాలయాపన – మీ కోసం కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతులు కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. కనీసం వారి సమస్య వినే ఓపిక కూడా అధికారులకు లేదు. వివిధ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఎంతో వ్యయ ప్రయాసలు పడి సోమవారం కలెక్టరేట్లోని మీ కోసం కార్యక్రమానికి వ చ్చిన ప్రజలకు అధికారులు భరోసా ఇవ్వలేకపోయారు.lబాధితుల నుంచి వినతులు తీసుకుని చూద్దాం.. చేద్దామంటూ సమాధానం చెప్పడంతో వారు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. సునయన ఆడిటోరియంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్ తదితరులు వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వినుతుల వెల్లువెత్తాయి. వచ్చిన సమస్యల్లో ముఖ్యమైనవి కొన్ని.. చెరువులకు హంద్రీ నీవానీళ్లు వదలండి: దేవనకొండ గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో హంద్రీనీవా కాలువ ఉంది. అక్కడక్కడ బ్రిడ్జి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పందికోన రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా దేవనకొండలోని రెండు చెరువులకు నీళ్లు ఇవ్వండి. తాగునీటి సమస్య తీరడంతో పాటు పశువులకు నీరు దొరుకుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. పిల్ల కాల్వలను మేమే సొంతంగా తవ్వుకుంటాము. అనుమతి ఇవ్వాలని ఎంపీపీ రామచంద్రనాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు భర్త ఉబ్బీరప్ప, ఎంపీటీసీ సభ్యుడు నరసారావు, వీరేష్, వైసీపీ నాయకుడు కిట్టు తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నీటి సమస్య పరిష్కరించండి : ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఉంది. ఎస్ఎస్ ట్యాంకులో పూర్తిగా నీళ్లు అడుగంటి పోయాయి. గ్రామంలో కేవలం ఒక బోరు మాత్రమే పని చేస్తుంది. కరెంటు లేకపోతే చుక్కనీరు రాదు. వెంటనే తగిన చర్యలు తీసుకుని నీటి సమస్య పరిష్కరించాలని సర్పంచ్ పాపన్న, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బన్న, రైతు సంఘం నేతలు కోరారు. రూ.20 వేలు లంచం ఇచ్చినా సర్వే చేయడం లేదు: మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలోని 7 సర్వే నెంబర్లలో 19.60 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో నావాట 4.50 ఎకరాలు ఉంది. ఈ భూమికి హద్దులు గుర్తించడానికి 3సార్లు చలానా కట్టినాను. రూ.20 వేలు లంచం ఇచ్చాను. అయినా, ఇంతవరకు సర్వే చేయలేదు. మీరైనా స్పందించి పొలం సర్వే చేయించాలని కోరారు. -
ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ధ్వజం – నిలిచిపోయిన కృష్ణానగర్ బ్రిడ్జిపనుల పరిశీలన కర్నూలు (ఓల్డ్‌సిటీ): చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన ఐదు రైల్వే వంతెనల నిర్మాణ పనులు ముందుకు సాగకుండా చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి కృష్ణానగర్ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. గుంతలు తవ్వి వదిలేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, నందికొట్కూరు ఇన్చార్జి అశోక్‌రత్నం, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్.వేణుగోపాల్, ఎస్.సలాం, కె.పెద్దారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ బీసీసెల్ ఉపాధ్యక్షుడు శివకుమార్, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి, కార్యదర్శులు సత్యంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్సీసెల్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. -
మా గోడు అరణ్య రోదనే
‘గడపగడపకూ వైఎస్సార్’లో నేతల వద్ద ప్రజల ఆక్రందన స్థానిక సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న నేతలు ‘అగ్ని ప్రమాదం జరిగి మా ఇళ్లు కాలిపోయాయి. ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిది నెలలైనా అతీగతీ లేదు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని పట్టాలు ఇచ్చారు. అందులో తహసీల్దార్ సంతకం మాత్రమే ఉంది. అధికారిక ముద్ర, సర్వే నంబర్ ఏమీ లేవు. మాకు బోగస్ పట్టాలు ఇచ్చారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు’ – మునక పార్వతి, గెద్దాడ పాప, గెద్దాడ వెంకటరత్నం, పండ్రవాడ గ్రామం, పెద్దాపురం నియోజకవర్గం ‘గతంలో ఎస్సీల్లో ఉన్న మమ్మల్ని ఓసీలుగా మార్చారు. దీనివల్ల పిల్లలకు విద్యా సంస్థల్లో సీట్లు, స్కాలర్షిప్లు రావడం లేదు. తెలంగాణలో మమ్మల్ని ఎస్సీలుగానే పరిగణిస్తున్నారు. ఇక్కడ కూడా తిరిగి ఎస్సీలుగా గుర్తించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు’ – కప్పిలి వెంకన్న, బేడబుడగ జంగాల నేత, కొంతమూరు గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఇవి కేవలం ఒకటి, రెండు ప్రాంతాలకు పరిమితం కాదు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న నేతల వద్ద అన్నిచోట్లా ప్రజలు తమ వెతలను ఇలా చెప్పుకొస్తున్నారు. ఆదివారం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగింది. – సాక్షి, రాజమహేంద్రవరం ‘అర్హత ఉన్నా్న పింఛను రావడంలేదు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల బిల్లులు ఇవ్వడంలేదు. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగు రోడ్లపై పారుతోంది.’ పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ఉన్న సమస్యలను ప్రజలు తమ వద్దకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టికి తీసుకువస్తున్నారు. ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు తీరు, రెండేళ్ల పాలనలో చంద్రబాబు దగా, అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుంచేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ‘గడపగడపకూ వైఎస్సార్’ కార్యక్రమం ఆదివారం జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో జరిగింది. గుంతలమయమైన రోడ్లతో అల్లాడుతున్నామని, అధ్వానంగా ఉన్న పారిశుధ్యం కారణంగా తాము రోగాల బారిన పడుతున్నామని, సమస్యలు పరిష్కరించాలని స్థానిక నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా, చివరికి తమ గోడు అరణ్యరోదనైందని ప్రజలు వైఎస్పార్ సీపీ నేతల వద్ద వాపోతున్నారు. తమ సమస్యలు ఆలకించేందుకు వస్తున్న నేతలను ప్రజలు వాడవాడలా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రజలు సమస్యలు సావధానంగా వింటున్న నేతలు వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పి.గన్నవరం మండలం గాజులపాలెంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు నిర్వహించారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీ ఆరో వార్డులోని శీలం వారి సావరం, రైలుగట్టు ప్రాంతాల్లో కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డా.యనమదల మురళీకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి శంకర్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు గ్రామం జంగాల కాలనీలో కోఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు(బాబు) కార్యక్రమం నిర్వహించారు. వర్షం వస్తే కాలనీ ప్రధాన రోడ్డు బురదమయంగా మారుతోందని స్థానికులు గిరిజాల వద్ద వాపోయారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట, కాకినాడ నగరపాలక సంస్థ ఒకటో డివిజన్లో కార్యక్రమం జరిగింది. స్థానిక నేత వాసిరెడ్డి సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపకూ వెళ్లి ప్రజా బ్యాలెట్ ప్రజలకందించి, చంద్రబాబు హామీలపై మార్కులు వేయాలని కోరారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో కార్యక్రమాన్ని కోఆర్టినేటర్ తోట సుబ్బారావు నాయుడు నిర్వహించారు. తమ ఇళ్లు కాలిపోయాయని, కొత్త ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది నెలలైనా ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి వీరభద్రరావు, కార్యకర్తలు ఉన్నారు. మండపేట పట్టణం ఐదో వార్డులో నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మరో కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి పట్టణంలోని పదో వార్డులో కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ ప్రతిప„ý Sనేత శాఖా ప్రసన్నకుమార్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
ఖమ్మం ఎన్నికలంటేనే ప్రభుత్వానికి వణుకు
♦ ప్రజాసమస్యలు పక్కనపెట్టి ఫిరాయింపులకు ప్రోత్సాహం ♦ ఓటమి భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో తిష్ట ♦ కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయంతో కేసీఆర్ కళ్లు తెరవాలి ♦ విలేకరుల సమావేశంలో గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఖమ్మం: ‘ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అంటేనే సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతోంది. ప్రజలను బలవంతపెట్టి, భయపెట్టి..లొంగదీసుకోవడమే టీఆర్ఎస్ నాయకుల పనిగా మారింది..’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్, ఆయన మంత్రి వర్గానికి ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ను ఓడించేందుకు ఖమ్మం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఖమ్మంలో తిష్టవేశారన్నారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లి రాత్రిళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బెదిరిస్తే పార్టీలోకి వచ్చిన వారు ఎంతకాలం ఉంటారని ప్రశ్నించారు. ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో కూడా అభ్యర్థులను బెదిరించి, నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ. 25 లక్షలు ఇస్తామని ఆశపెట్టారని ఆరోపించారు. నిరంకుశ పోకడల నుంచి కేసీఆర్ కు కనువిప్పు కలగాలంటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బంగారువల్లి కావాలె
గజ్వేల్: ‘‘గ్రామజ్యోతి అంటూ సీఎం ఉరుకులాడుతుండు.. ఆయన ఉండే ఎర్రవల్లి సంగతేంది? అని అందరూ అనుకునే పరిస్థితి రావొద్దు. నా ఊరు చిన్నతనం కావొద్దు. ఈ ఎర్రవల్లి బంగారువల్లిగా మారాలె. రాష్ట్రంలోనే నంబర్ వన్ గ్రామంగా అవతరించాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో ‘గ్రామజ్యోతి’ గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని వీధులన్నీ కలియతిరిగారు. ఈ సందర్భంగా పారిశుధ్యం, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ.. ‘‘ఏడ్వదలుచుకుంటే గంటసేపు ఏడ్చే బాధ ఉంది. ఇబ్బంది ఉంది. కానీ ఏడిస్తే పని కాదు కదా! నేను ఎర్రవల్లిలో ఉండే తెలంగాణ తెచ్చిన. ఎన్నో విజయాలను అందుకున్న. ఇప్పుడు ఈ ఊరిని మార్వలేనా? మీరంతా నాకు సహకరించండి. ఈ గ్రామం రూపురేఖలు మారుస్తా’’ అని పేర్కొన్నారు. ‘‘నేను తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఈ బక్కోనితోని ఏమైతది. బొండిగె పిసికితే పోతడు అని అవమానపరిచారు. అయినా బాధ పడలే. లక్ష్యం కోసం పనిజేసిన. అనుకున్నది సాధించిన. మీరు కూడా మన ఊరి బాగుకు కదలాలే.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్ అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం. మనం మేల్కోనాలె’’ అని వ్యాఖ్యానించారు. గ్రామానికి జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తున్నానని, ఆయన గ్రామం రూపురేఖలు మార్చటానికి సహకరిస్తారని చెప్పారు. ‘‘గ్రామంలో 231 పెంకుటిండ్లు, 107 ఆర్సీసీ బిల్డింగ్లు, 40 కూలిపోయేదశలో ఉన్న ఇండ్లు, మరో 10 గుడిసెలు, వలస వెళ్లటం వల్ల మరో 30-40 వృథాగా ఉన్న ఇండ్లు ఉన్నాయ్.. మీరు చేయాల్సిందల్లా ఒకటే! కరాబైన ఇండ్లను కూల్చేసుకొని కొత్త ఇండ్లు కట్టుకోవాలి. గ్రామానికి 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నా’’ అని ప్రకటించారు. దీంతో గ్రామస్తులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయగా.. ‘‘చప్పట్లు కొట్టినట్లు కాదు. ఊరి కోసం కష్టపడాలి’’ అని సీఎం పేర్కొన్నారు. గ్రామం రూపురేఖలు మార్చుకొని రోడ్లు పెద్దగా చేసుకుందామని, ఇందుకు అధికారులు ప్లాన్ ఇస్తారని వివరించారు. ‘‘నేను రాత్రికి ఇక్కడ్నే ఉంటా. శుక్రవారం వస్తా. అందరం కలిసి శ్రమదానం చేద్దాం. నేను మీతో కలిసి శ్రమదానం చేస్తా. మీరు ఎన్ని తట్టల మట్టి మొయ్యిమంటే అన్ని మోస్తా. మోరీలు సాప్ చేయమంటే చేస్తా. రేపు మాత్రం అందరూ ఇందులో పాల్గొనాలి. గ్రామంలో చెత్త లేకుండా చేయడానికి అంతా కలిసి రోజంతా శ్రమదానం చేద్దాం. అందరూ గడ్డపార, తట్ట పట్టుకొని రావాలి. భోజనం నేనే పెట్టిస్త’’ గ్రామస్తులతో అన్నారు. నాలుగు ముక్కలుగా పనిని విభజించుకుందామని, జిల్లేడు, సర్కార్ తుమ్మచెట్లు పూర్తిగా తొలగిద్దామని, ఆ చెట్లు దారిద్య్రానికి హేతువులని అన్నారు. మున్ముందు 24 గంటల కరెంట్... ‘‘మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కష్టాలుండె. ఇప్పుడా బాధ లేదు. కరెంట్ కోతలను నివారించాం. మున్ముందు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ తెస్త. నేను ఇంతకుముందే అసెంబ్లీలో చెప్పిన. ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎలక్షన్ల ఓట్లు అడగనని. అదే మాట మీద ఉంట. గోదావరి జలాలు తెస్త. నియోజకవర్గంలోని పాములపర్తిలో 20 టీఎంసీల పెద్ద రిజర్వాయర్ కడుతున్నం. అది పూర్తయితే మనకు సాగునీటి బాధలు ఉండవు’’ అని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రామ్రెడ్డి, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(గడా) ఓఎస్డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మీ బతుకులు మారుస్తా.. చెత్తపై యుద్ధం ప్రకటించి గ్రామం రూపురేఖలు మార్చడమే కాదు.. మీ బతుకులూ మారుస్తానని సీఎం గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ‘‘మీరు ముందుగాల నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వెళ్లండి. నేను 1986లో సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచాక వెళ్లి ఆ గ్రామంపై అధ్యయనం జరిపితే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వారి వ్యవసాయం కొత్తగా ఉంది. సంఘటితంగా ఉండటం వల్ల ఎన్నో విజయాలు సాధించారు. గ్రామంలో ఇప్పటివరకు పోలీస్ కేసు నమోదు కాలేదు. బ్యాంకుల్లో వారి డిపాజిట్లు అప్పట్లోనే రూ.22 కోట్లు ఉన్నయ్. ఎర్రవల్లి కూడా మరో అంకాపూర్ కావాలి. గ్రామంలో ఎవరిని ఎలా ఆదుకోవాలి. విద్యార్హతలను బట్టి ఎలా ఉపాధి కల్పించాలి అనేది అధికారులు ప్రతి కుటుంబం నుంచి ఫార్మాట్ తీసుకుంటరు. విద్యార్హతలు లేనివారినీ ఆదుకుంటాం. బర్లు, గొర్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్న. అంతేకాదు గ్రామంలోని రైతులందరికీ డ్రిప్ పథకం వర్తింపజేస్తా’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. -
దండులా కదలాలె
సంఘటితమై ‘పవర్’ చాటాలె.. - గ్రామాల ప్రగతికి బాటలు వేయాలె - ఎర్రవల్లి ‘గ్రామజ్యోతి’లో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు - గ్రామంలో వీధులన్నీ కలియతిరిగిన సీఎం - పారిశుద్ధ్యం, ప్రజాసమస్యలపై ఆరా - నేడు ‘చెత్తపై యుద్ధా’నికి సీఎం నిర్ణయం గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఊరు బాగుకు కదలాలె.. సంఘటితమై ‘పవర్’ ఏమిటో చాటాలె.. గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్.. అయినా మారుతలేవ్. మారాలంటే ఒక్కటే మార్గం.. మనం మేల్కొనాలె’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్వహించిన గ్రామజ్యోతి సభలో కేసీఆర్ ప్రసంగించారు. అంతకుముందు గ్రామంలో వీధులన్నీ కలియతిరిగి పారిశుద్ధ్యం తీరును పరిశీలించడమే కాకుండా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ, ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ రాంచంద్రంలతోపాటు వివిధ శాఖల అధికారులతో గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సమీక్ష జరిపారు. అనంతరం సభలో గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘గ్రామాలకు ఎన్నో నిధులు వస్తున్నయ్. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్రజా చైతన్యంతోనే ప్రగతికి బాటలు పడతాయి..’ అంటూ పేర్కొన్నారు. ‘గ్రామం లో 1500 మంది పైచిలుకు జనాభా ఉంది. చి న్న పిల్లలు, వృద్ధులు సుమారు 500 మందిని మినహాయిద్దాం. మిగిలిన 1000 మంది ఒక్కటై సంఘటిత శక్తిని చాటుదాం. ఏళ్ల తరబడి పాములు, తేళ్లు పారే ఇండ్లల్లో బతికినం. ఇప్పటికైనా ఈ దుస్థితి మారాలె’ అంటూ చైతన్యపరిచారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ముందుగా సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించి ఆ తర్వాత శిథిలమైన ఇళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా విశాలమైన రోడ్ల నిర్మాణానికి బాటలు వేసుకోవాల్సిన అవసరముందన్నారు. పారిశుద్ధ్యంలో వరంగల్ జిల్లా గంగదేవునిపల్లి మనకు ఆదర్శం కావాలన్నారు. అందరూ పట్టించుకుంటే చిటికె లో సమస్యలు పరిష్కారమవుతాయని వివరిం చారు. 6, 7 నెలల్లో గ్రామాన్ని పూర్తిగా మార్చేద్దామని చెప్పారు. గ్రామాన్ని బాగుచేసుకోవడమే కాకుండా ప్రతి వ్యక్తి కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయే రోజు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ‘నా ఫామ్‌హౌస్ ఇక్కడనే ఉం ది. ఇది నా ఊరు. అటుపోయినపుడు, ఇటుపోయినపుడు వస్త. మీ వెంట ఉండి సమస్యలు పరిష్కరిస్తా’నని భరోసా ఇచ్చారు. ‘గ్రామంలో బస్తీలన్నీ అద్దంలా మారాలె. ఆరేడు నెలల్లో మంచినీటి కోసం ఏ ఆడపడుచు రోడ్డుమీదికి రావొద్దు. అలా వచ్చిందంటే ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయా లె అన్నారు. ‘మరో నాలుగేళ్లల్లో ఈ గ్రామానికి రూ. 74లక్షలు వస్తాయి. వీటితోపాటు మరిన్ని నిధులు మీకు ఇస్త. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తా’ అంటూ పునరుద్ఘటించారు. రాజకీయాలు గిప్పుడెందుకు? గ్రామంలో అంతా కలిసికట్టుగా ముందు కు సాగాల్సిన అవసరముందని సీఎం హితవు పలికారు. ‘ఎలక్షన్లు వచ్చినపుడు రాజకీయాల సంగతి చూద్దాం. ఇప్పుడొద్దు’ అంటూ సూచిం చారు. గ్రామంలో ‘సర్వవర్గ సమితి’ పేరిట కమిటీని ఏర్పాటుచేసుకోవాలని, ఇందులో అన్ని కులాలకు ప్రాతినిథ్యం దక్కేలా చూడాల న్నారు. ఈ కమిటీ నిర్ణయాల మేరకు ముందు కు సాగాలన్నారు. బ్రెజిల్ దేశంలోని లియోడిజనిరో పట్టణం కాలుష్యం లేని ప్రాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి గ్రామం, పట్టణం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు ఎప్పుడూ తమగురించే ఆలోచించకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలని కోరారు. గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాల సాధనకు తమవంతు ప్రయత్నం చేయాలని సూచించారు. గ్రామంలో శుక్రవారం ‘చెత్తపై యుద్ధం’ కార్యక్రమం చేపడదామని సీఎం పిలుపునివ్వగా గ్రామస్తులు చప్పట్లతో హర్షామోదం పలికారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. ‘చప్పట్లు కొట్టినట్లు గాదు... నాతో పంచాయతీ గొట్టు ఉంటది. పని అయిపోయేదాక వెంటపడత. అందరూ సహకరించాలె’ అంటూ పేర్కొనగా గ్రామస్తులు ముఖ్యమంత్రికి తాము ఎల్లపుడూ సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్ నగరపంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ నేతలు జహంగీర్ తదితరలు పాల్గొన్నారు. -
సీఎం బ్లాక్ వద్ద విపక్షాల మెరుపు ధర్నా
లెఫ్ట్, టీడీపీ, వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా నేతల అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, టీడీపీ, వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా నేతలు సచివాలయంలోని సీఎం అధికారిక కార్యాలయం సమతా బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె సహా ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సీఎం అపాయింట్మెంట్ కోరినా ఇవ్వనందుకు నిరసనగా సచివాలయంలో బైఠాయించారు. మున్సిపల్ కార్మికులసమ్మెను పరిష్కరించాలి, సీఎం కేసీఆర్ వెంటనే చర్చలకు పిలవాలి, రైతు ఆత్మహత్యలు, ప్రజాసమస్యలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే ని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు పల్లా వెంకటరెడ్డి, రవీంద్రకుమార్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైఎస్సార్సీపీ నేతలు కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్‌లతోపాటు వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), జానకిరాములు, గోవింద్ (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), దయానంద్, నరేందర్ (ఫార్వర్డ్ బ్లాక్), భూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్), రామ్మోహనరావు (లోక్‌సత్తా) తదితరులను అరెస్ట్ చేసి గాంధీభవన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి, న్యూడెమోక్రసీ నేత వి.వెంకటరామయ్య తదితరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వారు సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు మఖ్దూం భవన్ నుంచి అఖిలపక్ష నేతలు బయలుదేరి సచివాలయం గేటు వద్దకు చేరుకున్నారు. సీఎం అపాయింట్మెంట్ లేదు కాబట్టి అనుమతించబోమని అక్కడున్న పోలీసులు వారిని నిలిపివేశారు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగాక, ఈ నేతలు వారిని తోసుకుని సచివాలయం ‘సీ’ (సీఎం బ్లాక్) బ్లాక్ ఎదుటకు చేరుకోగా అక్కడ వారిని ఆపేశారు. సీఎం ఎప్పుడు సమయం ఇచ్చినా అప్పటివరకు తాము వేచి ఉంటామని వారు పోలీసులకు చెప్పారు. దీనిపై చర్చ జరుగుతుండగానే వారంతా రోడ్డుపై బైఠాయించారు. ఇదేం ప్రజాస్వామ్యం..: విపక్షాల నేతలు సమస్యలపై మాట్లాడేందుకు సీఎంను కలుద్దామని వస్తే రోడ్డుపైనే ఆపేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం, ఇదేమి పాలన అంటూ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. తెలంగాణ పరిపాలన ఇలానే సాగించదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. నెలరోజులకు పైగా సమ్మె చేస్తూ పేద మున్సిపల్ కార్మికులు కష్టాల్లో ఉంటే సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికులు, ఇతర కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వాలని అన్ని పార్టీలు లేఖ రాస్తే సీఎం కేసీఆర్ నుంచి ఏ స్పందన లేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి చెప్పారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమ్మెలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకోలేదన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజలెవరినీ సీఎం కలవకపోవడం ఏమిటని వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. తాము కూడా ఉద్యమాలు చేశామని, ఇటువంటి పద్ధతిని ఎక్కడా చూడలేదన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ 14 నెలల పాలనలో సీఎం కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత కె.శివకుమార్ ధ్వజమెత్తారు. ఒకవైపు ఉద్యోగాలిస్తామంటూ, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎంగా ఉండగా ప్రజలను కలుసుకునేందుకు రోజూ పొద్దున సమయమిచ్చినట్లుగా సీఎం కేసీఆర్ కూడా సమయమివ్వాలని డిమాండ్ చేశారు. -
జనఘోషతో హోరెత్తిన కలెక్టరేట్లు
ప్రజా సమస్యలే ఎజెండాగా వైఎస్సార్సీపీ ధర్నాలు ♦ పోటెత్తిన ప్రజలు... సర్కారు తీరుపై మండిపాటు ♦ పాలకపక్షం కళ్లు తెరిపించేలా సాగిన ఆందోళనలు ♦ విజయనగరంలో జాతీయ రహదారి దిగ్బంధం ♦ విశాఖలో మహిళా ఎమ్మెల్యేపై ఏసీపీ దౌర్జన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకపక్షం కళ్లు తెరిపించేలా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజల సమస్యలపై పోరుబాట పట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలు జనఘోషతో దద్దరిల్లాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ సర్కారు తమను మోసం చేసిందని ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ జిలా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. చంద్రబాబు ఏరుదాటి తెప్ప తగలేసినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుపై కూడా ఏ1గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎడ్లబండ్ల ర్యాలీ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ టీడీపీ నేతలు జగన్‌పై బురద జల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తూర్పుగోదావరిజిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో భారీ ఎత్తున జనం హాజరయ్యారు. శ్రీకాకుళంలో జరిగిన ధర్నాలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ప్రసంగించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిసరాలు ధర్నాతో హోరె త్తాయి. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతపురంలో కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్వద్ద తమ వాదన విన్పించడంలో విఫలమవ్వడంతో రాయలసీమ రైతులకు నష్టం వాటిల్లుతుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసు దౌర్జన్యం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలను ఏసీపీ ఆర్.రమణ అడ్డుకున్నారు. కలెక్టర్ లేకపోవడంతో వినతిపత్రాన్ని గోడకు అంటించే యత్నం చేసిన నేతలను గెంటివేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన డీఆర్వో కె.నాగేశ్వరరావు ముఖ్యనాయకులు తన గదిలోకి రావాలని కోరారు. అయినప్పటికీ ఏసీపీ వారిని డీఆర్వో దగ్గరకు పంపేందుకు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేయిపట్టుకుని బయటకు నెట్టి వేశారు. మహిళా ఎమ్మెల్యేనైన తనకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్ రైజ్ చేస్తామని ఆమె చెప్పారు. -
వైఎస్సార్ సీపీ పోరుబాట
- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కదంతొక్కిన నాయకులు, కార్యకర్తలు - మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు..ర్యాలీలు - రెవెన్యూ అధికారులకు వినతిపత్రాల అందజేత - టీడీపీ మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలి, రుణ మాఫీ చేయాలని డిమాండ్ గుంటూరు సిటీ : ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విల్లు సంధించింది. పరిష్కారమే లక్ష్యంగా పోరుబాట పట్టింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్వంలో సోమవారం జిల్లాలోని పలు మండల కార్యాలయాల ఎదుట ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ప్రజల గోడు పట్టని పక్షంలో పతనం తప్పదని తెలుగుదేశం ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఒకే సమయంలో ఇటు కరువు, అటు అకాల వర్షాలు దాడి చేస్తున్న చిత్రమైన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. అకాల వర్షాలతో జిల్లా రైతాంగం భారీగా నష్టపోగా, కరువుతో కూలీలు వలస బాట పట్టిన వాతావరణం సర్వత్రా కనిపిస్తోంది. సాగునీటి మాట దేవుడెరుగు ప్రస్తుతం తాగునీరు కూడా దక్కని దుస్థితి జిల్లా అంతటా తాండవిస్తోంది. ప్రభుత్వ పట్టనితనం, అధికారుల అలసత్వం వెరసి జిల్లా ప్రజల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ దృష్టి సారించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రెండ్రోజుల ఆందోళనకు తెర తీసింది. మొదటి రోజులో భాగంగా పలు మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించింది. మేడికొండూరు, ఫిరంగిపురం, బాపట్ల టౌన్, రూరల్, మంగళగిరి టౌన్, రూరల్, క్రోసూరు, వేమూరు, చుండూరు, అమృతలూరు, తెనాలి టౌన్, రూరల్, కొల్లిపర, నర్సరావుపేట టౌన్, రూరల్, రొంపిచర్ల, చిలకలూరిపేట టౌన్, రూరల్, గురజాల, మాచవరం, నకరికల్లు, ముప్పాళ్ల తదితర మండలాల్లో సోమవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టి రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. నీటి ఎద్దడి నివారించాలనీ, వలసలు నిరోధించాలనీ, కరువు, అకాల వర్షాల ధాటికి దెబ్బతిన్న రైతాంగానికి తక్షణం నష్టపరిహారం అందించాలనీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలనీ, రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలనీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను పగలే అందించాలనీ డిమాండ్ చేశారు. -
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజాసమస్యలపై గళం విప్పి పరిష్కరించేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్బోధించారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు అయిన శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వాయిదా పడ్డాక జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఇందులో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చంద్రబాబు ప్రభుత్వం వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని, అలాంటి విషయాల్లో ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు. సమావేశాలకు ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రతి అంశంపైనా అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా పోరాడాలని సూచించారు. ఆ అంశాల్లో ఏది మంచిది కాదో చెప్పాలి: గడికోట అసెంబ్లీలో చర్చకోసం బీఏసీలో తమ పార్టీ ప్రతిపాదించిన అంశాల్లో ఏది మంచిది కాదో అధికారపక్షం ప్రజలకు చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభాపక్షం సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తామిచ్చిన 22, అధికారపక్షమిచ్చిన 12 మొత్తం 34 అంశాలపైనా చర్చ జరగాలనే తమ పార్టీ శాసనసభాపక్షం కోరుకుంటోందన్నారు. కరువు పరిస్థితులు మొదలు, జీవో నంబర్ 22 జారీ వెనుక అవినీతి, నిరుద్యోగ సమస్య, రైతుల ఆత్మహత్యలు, సాగు, తాగునీటి సమస్యలు శాసనసభలో ప్రస్తావిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కళత్తూరు నారాయణస్వామి, కోన రఘుపతి, కిలివేటి సంజీవయ్య, అత్తారు చాంద్‌బాష, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రన్నా.. సమస్యలు చూడన్నా..
నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం.. హాస్పిటల్ స్థాయిని 50 పడకలకు పెంచుతాం.. ఆర్టీసీ డిపోను వెంటనే పునరుద్ధరిస్తాం.. తాడేపల్లిగూడెం గేటు వద్ద ఆర్వోబీ నిర్మిస్తాం.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.. ఇవి ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు గుప్పించిన హామీలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో జరిగిన సభలో చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు గడుస్తున్నా ఈ హామీలలో ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. నియోజకవర్గంలో సమస్యలు తాండవిస్తున్నా.. అధికార పార్టీ నాయకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఆదివారం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సమస్యలపై ఫోకస్. - నిడదవోలు గేటు పడిందా గోవిందా నిడదవోలు నెహ్రూబొమ్మ సెంటర్లో రైల్వే గేటు వద్ద ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం ఎండమావిగానే మిగిలిపోయింది. గతంలో ఆర్వోబీ మంజూరైందని ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఉభయగోదావరి జిల్లాలకు రాకపోకలకు నిడదవోలు దగ్గరదారి కావడంతో రోజూ వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు వైపు వెళ్లేందుకు కచ్చితంగా గేటు దాటాల్సిన పరిస్థితి. రోజుకి సుమారు 200 ైరెళ్లు నిడదవోలు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో 200 సార్లు గేటు పడుతుంది. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీగా మారుతోంది. ఒక్కోసారి రైల్వేగేటును వాహనాలు ఢీకొనడంతో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఇటువంటి సందర్భాలలో గంటల తరబడి గేటు మూతపడటంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. పేరుకే పెద్దాసుపత్రి నిడదవోలులో ప్రభుత్వాసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా కొనసాగుతోంది. పట్టణంలోని 45 వేల జనాభాతో పాటు చుట్టుపక్కల 45 గ్రామాలకు సేవలందించాల్సిన ఆసుపత్రిలో 8 పడకలు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రి స్థాయిని 50 పడకలకు పెంచాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. కనీసం 30 పడకల స్థాయికి పెంచేందుకు కూడా నాయకులు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో అరకొర సేవలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర కేసులను వైద్యులు తణుకు, రాజమండ్రి ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఎక్స్‌రే యంత్రం, ఆక్సిజన్ సిలిండర్, మత్తు మందు అందించే యంత్రాలు లేవు. రోగులకు రెండు గదులు మాత్రమే కేటాయించడంతో అవస్థలు తప్పడం లేదు. రోజూ కనీసం 160 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నా మందులు పూర్తిస్థాయిలో లేవు. ప్రభుత్వాసుపత్రితో పాటు నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. గర్భిణులకు సదుపాయాలు లేకపోవడంతో ప్రసవాల సంఖ్య నెలనెలకూ తగ్గుతోంది. డిపో పునరుద్ధరణ ఊసేలేదు నిడదవోలు ఆర్టీసీ డిపోను ఆదాయం తక్కువుగా ఉందనే సాకుతో 2006 ఆగస్టులో మూసివేశారు. ఇక్కడి బస్సులను తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, జంగారెడ్డిగూడెం తదితర డిపోలకు పంపారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ప్రజలకు ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. బస్సులన్నీ వేరే డిపోల నుంచి రావడం వల్ల గంటల తరబడి ఆలస్యమవుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. కొన్నేళ్లుగా డిపో పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆగని సూపర్ ఫాస్ట్‌లు నిడదవోలు రైల్వే జంక్షన్ అయినా సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జన్మభూమి, లోకమాన్య తిలక్, కాకినాడ ఏసీ స్పెషల్ తదితర రైళ్లకు హాల్ట్‌లు కల్పించాలని డిమాండ్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో మరిన్ని సమస్యలు నిడదవోలు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలకు మెరక పనులు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉండ్రాజవరం మండలంలో డెల్టా ఆధునికీకరణ పనులు నెమ్మదించాయి. మోర్తాలో మురుగు కాలువ పూడిపోవడంతో 5 గ్రామాల్లో 3 వేల ఎకరాలకు సాగునీరందడం లేదు. పెరవలి మండలం కానూరులో బీసీ హాస్టల్ భవన నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కలగా.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పట్టణంలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేసినా పనులకు మోక్షం కలగడం లేదు. విజ్జేశ్వరం హెడ్‌స్లూయిజ్ వెనుక నుంచి పైపులైన్ ద్వారా గోదావరి జలాలను పట్టణానికి తరలించాలని 2013లో సుమారు రూ.52 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే కార్యరూపం దాల్చకపోవడంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఎర్రకాలువ ముంపు కష్టాలు ఏటా వర్షాకాలంలో ఎర్రకాలువ వరద ముంపుతో మండలంలోని సింగవరం, కంసాలిపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, శంకరాపురం, కాటకోటేశ్వరం, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెం, అట్లపాడు గ్రామాల్లో వేలాది ఎకరాలు ముంపునకు గురువుతున్నాయి. నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నా ఫలితం ఉండటం లే దు. ముంపునకు కారణమవుతున్న నందమూరు పాత అక్విడెక్ట్‌ను తొలగించాలని రైతులు కోరుతున్నారు. -
పేదలకు మాటలు.. పెద్దలకు చేతలు
⇒ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడతాం ⇒జిల్లాలో పార్టీ విస్తరణకు పకడ్బందీ ప్రణాళిక ⇒పోడు భూముల సమస్యపై మరో ఉద్యమం ⇒ఈ ప్రభుత్వానిదీ అవకాశవాద వైఖరే... ⇒సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పేదలకు మాటలు చెబుతూ పెద్దల కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ అవకాశవాద వైఖరిని ఎండగట్టేందుకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. శుక్రవారం నుంచి మూడురోజులపాటు మధిరలో జరిగే పార్టీ జిల్లా మహాసభలను పురస్కరించుకొని పార్టీ ఉద్యమ కార్యాచరణ- విస్తరణ అంశాలపై గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు... ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన అనేక పథకాల అమలులో కేసీఆర్ ప్రభుత్వానికే సరైన స్పష్టత లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత పేదలకు సంక్షేమాన్ని పంచడానికి ఇవ్వలేకపోతున్నారు ఈ తరహా పాలనపై తమ పార్టీ రాబోయే రోజుల్లో ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. జిల్లాలో సీపీఎంను అన్ని మండలాలు, గ్రామాల్లో మరింత పటిష్టపరిచేందుకు కార్యాచరణ రూపొందించుకుంటాం. ప్రజా ఉద్యమాల నిర్మాణం..ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన ఘనత మా పార్టీకి ఉంది. రూ.3.50లక్షలతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారు. అందులో రూ.లక్ష పేదలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. లక్ష రూపాయలు ఇవ్వగలిగిన వారు పేదవారు ఎలా అవుతారు?. ఎన్నో ఉద్యమాలు నిర్మించాం.. మూడేళ్లుగా జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది. పాలక వర్గాలు దిగివచ్చి పలు సమస్యలను పరిష్కరించాయి. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తాం. జిల్లాలో రూ.10 వేల కోట్లతో 10 లక్షల ఎకరాల భూమిని సాగు చేసే అవకాశం ఉంది. మూడు పంటలు పండించడానికి అనువైన పరిస్థితి ఉంది. వీటిపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు సాగునీటి సాధన యాత్ర నిర్వహించాం. దుమ్ముగూడెం నుంచి పాలేరు వరకు, అక్కడి నుంచి ఖమ్మం వరకు 12 రోజులపాటు 1000 మందితో నిర్వహించిన పాదయాత్ర ప్రభుత్వాన్ని కదలించింది. మా ఆందోళనల ఫలితంగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ రూ.100 కోట్లు అదనంగా కేటాయించింది. దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లా సస్యశ్యామలం కావాలంటే ప్రభుత్వం రూపొందించిన డిజైన్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం రూరల్ మండలం వరకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మున్నేరు మీద అక్విడేట్ నిర్మించి దీని ద్వారా పాలేరు వరకు పొడిగిస్తే రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. అలాగే మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగర్ ద్వారా నీరు అందుతుంది. మేము చేసిన పోరాటాల ఫలితంగానే దుమ్ముగూడెం నుంచి సాగర్ టేల్‌పాండ్‌ను రద్దు చేశారు. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం విధి విధానాలను వెల్లడించాల్సి ఉంది. భవిష్యత్‌లోనూ జిల్లాలో మిత్రపక్షమైన సీపీఐతో కలిసి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు నిర్వహిస్తాం. ఐక్య ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐక్య ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగింది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలనే డిమాండ్‌తో త్వరలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని యోచిస్తున్నాం. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో మరో ఉద్యమం చేస్తాం. జిల్లాలో అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. అటవీ అధికారులు, గిరిజనులను అనేక ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తున్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పూర్తి హక్కు కల్పించేందుకు గిరిజనులతో కలిసి ఓ పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. జిల్లాలో దళితులు, గిరిజనులకు విద్య, వైద్య, ఉపాధి, ఆరోగ్య అంశాల్లో తీరని అన్యాయం జరుగుతోంది. వీరికి ఆయా అంశాల్లో న్యాయం జరిగేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారి సంక్షేమానికే కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో జిల్లా నుంచి సీపీఎం ప్రధాన భూమిక పోషిస్తోంది. గత ప్రభుత్వాల బాటలోనే టీఆర్ఎస్...గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీలపై నిర్బంధం కొనసాగించాయి. ఈ ప్రభుత్వం సైతం అదే ధోరణితో వ్యవహరిస్తోంది. జిల్లాలో అన్ని వర్గాల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఎం తమకు గల ప్రజా పునాదిని రాజకీయంగా మలచుకోవడంలో కొంత వెనుకబడి ఉంది. పకడ్బందీ రాజకీయవ్యూహాలతో తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి మూకల చేతిలో అమరులైన కొమరంభీమ్, దొడ్డి కొమురయ్యల త్యాగనిరతిని శ్లాఘిస్తూనే.. నిజాం నవాబును గొప్పవాడిగా పొగడటం కేసీఆర్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. దీనిపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను కేసీఆర్ నివృత్తి చేయాలి. టీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేయాలి. రాజకీయంగా గతంలో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా మరింత చైతన్యవంతంగా వ్యవహరిస్తాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఆ తర్వాత పార్టీలో మెజార్టీ సభ్యులు వ్యక్తం చేశారు. జిల్లాలో తునికాకు సేకరిస్తున్న గిరిజనులకు న్యాయమైన కూలి, పూర్తిస్థాయి బోనస్ లభించేందుకు ఉద్యమాలు చేయాలని యోచిస్తున్నాం. మూడు రోజులపాటు మధిరలో జరిగే జిల్లా మహాసభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తదితరులు పాల్గొంటారు. -
కళాకారుడు సంపూర్ణ ఉద్యమకారుడు
అరుణోదయ మహాసభల్లో సతీష్‌చందర్ ఒంగోలు: ప్రజా సమస్యలను కళల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించి వారిని చైతన్యపరచడంలో కళాకారుడు కీలకపాత్ర పోషిస్తాడని సంపాదకుడు సతీష్‌చందర్ పేర్కొన్నారు. అలాంటి కళాకారుడు సంపూర్ణ ఉద్యమకారుడని కొనియాడారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులోని సుబ్బారావు పాణిగ్రాహినగర్లో జరిగిన ప్రతినిధుల సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. పది శాతం యువత సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ‘నమో’ జపం చేస్తుంటే దాని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తప్పితే పేద, శ్రామిక వర్గాల స్థితిగతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో భాగంగా ‘ప్రజాకళలు-సాహిత్యం’ అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. రెండు రాష్ట్రాల కార్యవర్గాల ఎన్నిక: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ, తెలంగాణ కార్యవర్గాలను ఆదివారం ఒంగోలులో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సిహెచ్.జాలన్న (ప్రకాశం), ప్రధాన కార్యదర్శిగా డి.అంజయ్య (ప్రకాశం), ఉపాధ్యక్షుడిగా రామన్న (పశ్చిమగోదావరి), సహాయ కార్యదర్శిగా భీమశంకర్ (తూర్పుగోదావరి), కోశాధికారిగా ఎన్.సామ్రాజ్యం (గుంటూరు), మరో పదిమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.వేణు (హైదరాబాద్), ప్రధాన కార్యదర్శిగా ఎ.నిర్మల (ఖమ్మం), సహాయ కార్యదర్శిగా వెంకన్న (నల్లగొండ), కోశాధికారిగా అశోక్ (కరీంనగర్), మరో నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మరికొందరిని ఎన్నుకోవలసి ఉంది. -
ప్రజాసమస్యలు విస్మరించిన సర్కార్
సదాశివపేట, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గాల్లో కలపడం ఖాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజ్ అన్నారు. మంజీర జలాలు, తాగు, సాగుకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చే స్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయన్నారు. యూపీఏ మంత్రులు చేసిన టెలికం, బొగ్గు కుంభకోణాల డబ్బులతో దేశంలోని పేదలందరికీ 35 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వవచ్చన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అసంఘటిత, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 12,500 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల ప్రజలకు మంజీర తాగు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇళ్ల స్థలాల పట్టాలిచ్చిన వారందరికీ వెంటనే పొజిషన్ చూపించి ఇందిరమ్మ రుణాలు మంజూరు చేయాలన్నారు. మండల పరిధిలోని గంగకత్వవాగు ఎత్తు పెంచి కాలువ మరమ్మత్తు పనులు చేపట్టి సాగుకు నీరందించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఎం చేపట్టిన సైకిల్‌యాత్ర ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మండల కార్యదర్శి నర్సింలు, ఖయ్యూం, హోలి అహ్మద్, అడివయ్య, రవి, మల్లేశం, నరేందర్, గోపాల్ పాల్గొన్నారు. -
ఆ ఇద్దరే దిక్కు..!
సాక్షి, నరసరావుపేట :గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి గ్రామానికి ఓ కార్యదర్శిని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలంలో మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. నల్లమల అటవీ ప్రాంతం అధికంగా ఉండే బొల్లాపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీలు, మరో 30 వరకు శివారు తండాలు ఉన్నాయి. మారుమూల ప్రాంత ప్రజలకు సేవలందించేందుకు ఇక్కడ గ్రామ కార్యదర్శులను నియమించడంలో ఉన్నతాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని గరికపాడు, బొల్లాపల్లి గ్రామాలకు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన 21 పంచాయతీలకు కూడా వీరిద్దరే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తండాల్లో ప్రజలకు ఏఅవసరం వచ్చినా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మండల కేంద్రానికి వచ్చి గ్రామ కార్యదర్శితో చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్యం, వీధిలైట్లు, మంచినీరు వంటి సమస్యలను సైతం పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. బొల్లాపల్లి మండలంలో రూ. 4,77,520 పన్ను వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ. 22,023 మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి గ్రామపంచాయతీ పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలో ఒక్క వెల్లటూరు గ్రామ పంచాయతీ మినహా మిగతా ఏ పంచాయతీలోనూ పన్ను వసూలు రిజిస్టర్లు కూడా లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆడిట్లో సైతం కేవలం రశీదులు మాత్రమే చూపుతూ రిజిస్టర్లు చూపడంలేదు. పన్ను రిజిస్టర్లు చూపలేదంటూ ఆడిటర్లు రాసుకొని వెళ్లిపోతున్నారు. గత ఏడాది భారీ సంఖ్యలో వీఏఓ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలాన్ని మాత్రం మరిచింది. పంచాయతీల్లో యథేచ్ఛగా నిధుల గోల్మాల్ బొల్లాపల్లి మండలంలోని అనేక పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్, పంచాయతీ, మండలస్థాయి అధికారులు కుమ్మక్కై లక్షల రూపాయల నిధులను మింగేస్తున్నారు. పేరూరిపాడు పంచాయతీలో 2010లో రూ. 1.75లక్షల నిధులను కాజేసి చెక్‌బుక్‌లు, రికార్డులు సైతం మాయం చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి రికార్డులు పంపాల్సిందిగా ఆదేశించారు. ఇది జరిగి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ రికార్డులు చూపలేదు. దీంతో ఈ గ్రామ పంచాయతీలో వున్న రూ. 9లక్షల నిధులను ఖర్చు చేసే వీలు లేకపోవడంతో గ్రామాభివృద్థి కుంటుపడింది. ఇటీవల ఆ గ్రామ మాజీ సర్పంచ్‌పై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం మండలంలో ఈఓపీఆర్డిగా పనిచేసిన అధికారి ఒకరు అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు రూ. 3 లక్షల ఇంటి పన్నులు అక్రమంగా కాజేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అధికారులు వీటిపై దృష్టిసారించకుండా సిబ్బంది కొరత అనే సాకు చూపుతూ చేతులు దులుపుకుంటున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం పేరూరిపాడు గ్రామంలో పెద్ద మొత్తంలో నిధులు కాజేసిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇద్దరే కార్యదర్శులు ఉండటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. - డీఎల్పీఓ భాస్కరరెడ్డి -
22 నుంచి పాదయాత్ర
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిసెంబరు 22 నుంచి సోమశిల నుంచి పాదయాత్ర ప్రారంభించి అన్ని మండలాలు తిరుగుతానని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనుమసముద్రంపేట లోని వీజీఆర్ రైస్ మిల్లు సమీపంలో శుక్రవారం మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, ఆ పార్టీ యువ నాయకులు పందిళ్లపల్లి గోపిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పరిచయ సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఆత్మకూరు తమ సొంత నియోజకవర్గమని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. జిల్లాలో ఆత్మకూరును రోల్‌మోడల్ నియోజకవర్గంగా చేస్తానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. -
రెండునాళ్ల ముచ్చట
సాక్షి, రాజమండ్రి :‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’- తెలుగు సినిమాలకు వాటి పేర్ల కింద తగిలిస్తున్న ఉపశీర్షికల్లా.. మూడవ విడత ‘రచ్చబండ’కు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు తగిలించిన వ్యాఖ్య ఇది. అయితే పేరులో ఎంత ఆర్భాటం ఉన్నా..కథ, కథనాల్లో పస లేని సినిమా ఫ్లాపయినట్టు.. రాజమండ్రిలో రచ్చబండ కార్యక్రమం తుస్సుమంది. రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చే 41 అర్బన్ డివిజన్లు, తొమ్మిది రూరల్ డివిజన్లకు కలిపి కేవలం రెండు రచ్చబండలు మాత్రమే నిర్వహించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. పట్టుమని రెండు రోజులు కూడా జరగని ఈ తంతులో కూడా నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వినిపించలేదు. ఆర్ అండ్ బి శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వస్తున్నారు కాబట్టి ఓ సభ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తున్నారు కాబట్టి మరో పెద్ద సభ అన్నట్టుగానే నగరంలో రచ్చబండ జరిగింది. రాష్ట్రంలో అది చేశాం, జిల్లాకు ఇది చేస్తాం అంటూ అటు ముఖ్యమంత్రి, ఇటు పితాని డంబాలు పలికారు, అంతే తప్ప వివిధ పథకాలకు సంబంధించిన స్థానిక లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయకుండా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం కన్నా గత ఏడాది మంజూరైన వాటిని అందచే సేందుకే అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ విమర్శలకే పరిమితం.. జిల్లాలో ఈనెల 11 నుంచి 26 వరకూ రచ్చబండ కార్యక్రమాలు సాగుతాయని కలెక్టర్ ప్రకటించారు. వాస్తవానికి ప్రతి రెండు, మూడు డివిజన్లకొక రచ్చబండ నిర్వహించాల్సి ఉంది. కనీసం ఐదు డివిజన్లకో రచ్చబండైనా నిర్వహించకుండా రెండే రెండింటితో సరిపుచ్చడం పట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఈ నెల 12న పుష్కరాల రేవు వద్ద నిర్వహించిన తొలి రచ్చబండకు ఆర్ అండ్ బి మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం తన రాజకీయ విమర్శలకే పరిమితం చేశారు. ‘మీకు మంజూరైన కార్డులు, పెన్షన్లు మంత్రిగారు అంద చేస్తారు’ అని జనాన్ని పిలిచిన అధికారులకు కూడా మంత్రి వ్యవహార శైలి ఇబ్బంది కలిగించింది. అసలే ఆలస్యంగా వచ్చిన మంత్రి జనం సమస్యల గురించి కాక ఇతర విషయాలు మాట్లాడి, తీరా అసలు కార్యక్రమానికి వచ్చేసరికి ఓ నలుగురికి మంజూరు పత్రాలు అందచేసి చక్కా వెళ్లిపోయారు. మొత్తం 11 డివిజన్లకు నిర్వహించిన ఈ సభలో డివిజన్ల వారీ సమస్యలు చర్చకు రాలేదు. కొత్తగా ఎవరికి ఏం కావాలో అడగలేదు. దీంతో ఎంతో ఆశతో వచ్చిన జనం తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. ‘సమైక్య’ ప్రచారానికే ప్రాధాన్యం.. ఈ నెల 16న సుబ్రహ్మణ్య మైదానంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరైన రచ్చబండ కూడా అదే తంతుగా జరిగింది. తాను సమైక్యవాదినని, రాష్ట్ర సమైక్యత కోసం ఎంతకైనా సిద్ధమని చెప్పుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని సీఎం ప్రజల సమస్యలపై మాట్లాడడానికి ఇవ్వనేలేదు. వాస్తవంగా ఈ కార్యక్రమం 39 డివిజన్ల లబ్ధిదారులను ఉద్దేశించి పెట్టినా మొత్తం 50 డివిజన్ల వారినీ పిలిచారు. సుమారు 25 స్టాళ్లు పెట్టి రచ్చబండలో మంజూరైన ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇక్కడే ఇచ్చేస్తామంటూ ప్రచారం చేశారు. అదే ఊరింపుతో లబ్ధిదారులను సభకు తరలించారు. తీరా సీఎం వెళ్లిపోయాక ‘మీ రేషన్ కార్డులు, కూపన్లు డిపోలకు వస్తాయి. పెన్షన్ల కోసం సంబంధిత అధికారులను సంప్రదించండి’ అంటూ చేతులు దులుపుకొన్నారు. ఎక్కడ ‘రచ్చ’ అవుతుందోననే.. నగరంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న పలువురు మాజీ కార్పొరేటర్లు తమ వర్గీయులకు రచ్చబండలో లబ్ధి చేకూర్చడం లేదని ఆగ్రహంగా ఉన్నారు. చాలా కాాలంగా కొత్త రేషన్ కార్డులు మంజూరుకాకపోవడం, గత ఏడాది మంజూరైన కార్డులను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో సంగతి తేల్చుకుందామని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారులను నిలదీసేందుకు వివిధ రాజకీయ పక్షాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో డివిజన్లలోకి వెళ్లి రచ్చ చేసుకోవడం కన్నా పోలీసు పహారాలో మంత్రితో ఓ సభ, ముఖ్యమంత్రితో మరోసభ నిర్వహించి ‘మమ’ అనిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తమ సమస్యలు చెప్పుకుందామని, పథకాల ప్రయోజనం పొందుదామని గంపెడాశలు పెట్టుకున్న జనానికి నిరాశే మిగిలింది. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కొవ్వూరు, న్యూస్‌లైన్ :ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు పీఎంఎంఎం హైస్కూల్లో బుధవారం నిర్వహించిన మండల, పట్టణ రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో విడత రచ్చబండలో 18 లక్షల మందికి రేషన్ కార్డులు, 14 లక్షల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించామని చెప్పారు. మొదటి విడత రచ్చబండలో 6 లక్షల మందికి, రెండో విడతలో 14 లక్షల మందికి రేషన్ కార్డులు అందించామన్నారు. మొదటి విడతలో 3 లక్షల మందికి, రెండో విడతలో 5 లక్షల మందికి, మూడో విడతలో 9 లక్షల మందికి పింఛన్లు అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ కలల్లో భాగంగా రాష్ట్రంలో 4.98 లక్షల మంది ఎస్సీలకు, 5.15లక్షల మంది ఎస్టీలకు 50 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న వారి బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి, జిల్లాలో 2,020 మందికి బంగారుతల్లి పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నామన్నారు.కొవ్వూరులోని వెంకమ్మ చెరువు వద్ద రోడ్డు మలుపులను సరిచేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే టీవీ రామారావు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన వారందరికి లబ్ధి చేకూరుతుందా లేదా అని సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించగా పథకాలు అందడం లేదని 80 శాతం మందికిపైగా చేతులెత్తడంతో వేదికపై ఉన్న వారంతా నోళ్లెళ్లబెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముదునూరి నాగరాజు మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి పితాని, ఎమ్మెల్యే రామారావు మంజూరు పత్రాలను అందజేశారు. టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సూరపనేని చిన్ని, ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.