చేనేతన్నకు వడ్డీ భారం
-
పింఛన్ల కోసం ఎక్కేమెట్టు దిగేమెట్టు
-
గడప గడపలో సమస్యల తిష్ట
పక్కా గృహాలు ఊరింపేనా..
టవరు లైను కింద ఉన్న వారికి పక్కాగృహాలుఇస్తామని ఊరిస్తున్నారే తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదని రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట డీబ్లాకు గౌతమీనగర్ వాసులు వాపోయారు. జీవనం కష్టంగా మారిందని, కుమార్తె పనిచేసి పోషిస్తుందని కన్నీటి పర్యంతమయింది. గోదావరి చెంతనే తాగేందుకు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని సరోజినిదేవి కాతేరులో ఆవేదన వ్యక్తం చేసింది. కాతేరు సుబ్బారావునగర్‌లో సరైనరోడ్డు లేక వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చాడు.
సాక్షిప్రతినిధి, కాకినాడ :
రూ.110 కోట్లు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. రెండేళ్ల తర్వాత అమలు చేయటంతో రూ.35 కోట్లు వడ్డీ భారం భరించాల్సి వచ్చిందని చేనేత కార్మికులు అమలాపురం శివారు రంగాపురంలో మంగళవారం గడపగడపకు వైఎస్‌ఆర్‌లో భాగంగా వెళ్లిన నేతలముందు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సంఘం నాయకుడు కరెళ్ల రమేష్‌బాబు, అక్కిశెట్టి మల్లిబాబులు చేనేతలకు జరుగుతున్న నష్టాలను వివరించారు. సరైన రహదారులు, డ్రెయినేజీ సదుపాయం లేక ముంపు సమస్యతో ఇబ్బంది పడుతున్నామని పలువురు అయినవిల్లి మండలం తొత్తరమూడిలో ఆందోళన వ్యక్తం చేశారు. సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని శీలం వెంకటేశ్వర్లు, సునీత రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం బ్రహ్మపురిలో వాపోయారు. రోడ్లు నిర్మాణాలు జరగక మురుగులో బతుకుతున్నామని అర్జమ్మ అనే మహిళ మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మం డలం నల్లూరు కొత్తకాలనీలో మొరపెట్టుకుంది.
అన్నీ సమస్యలే...
నోటీసు ఇవ్వకుండా రహదారి విస్తరణలో తొలగించినా నష్టపరిహారం ఇవ్వలేదని నున్న నాగమణి కాకినాడ జగన్నాథపురం 16, 23, 25 డివిజన్లలో జరిపిన గడప, గడపకు వైఎస్‌ఆర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్‌సిటీలో తోపుడు బళ్ళ స్థానంలో లక్షన్నర విలువైన అత్యాధునిక ఆటోలు వినియోగించాలని అధికారుల ఆదేశాలు చిరువ్యాపారులకు ఇబ్బందికరంగా మారాయని వ్యాపారి పేపకాయల సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగురాలినైన తనకు పింఛను పొందేందుకు అర్హత ఉంది. పింఛన్ మంజూరైంది. నాలుగు నెలలు ఇచ్చారు. టీడీపీ వచ్చాక అర్హతలేదని తొలగించారని విశ్వనా«ద్ మొరబెట్టుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతోనే దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు సామర్లకోట మండలం పీబీ దేవంలో మొరబెట్టుకుంటున్నారు. ఎన్ని చేసినా దోమలు పెరిగి పొతున్నాయని గాలి ఉమా, ఓదూరి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ ఏదీ...
పలువురు మహిళలు రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేసాడని గొల్లప్రోలు గాంధీనగర్ 9, 10వ వార్డులో ఆరోపించారు. భర్త చనిపోయి ఏళ్లుగడిచినా ఫించ ను మంజూరుచేయలేదని బండారు నూకరత్నం, రేషన్‌సరుకులు ఇవ్వడం లేదని దివ్యాంగురాలైన ఇమ్మంది లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటిæ వర్షానికే రహదారులు బురదమయమయ్యాని చవాకుల లక్ష్మి మొరబెట్టుకుంది. ఇంటి స్థలం ఇ వ్వాలని అధికారపార్టీ అధికారులు వద్దకు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని నక్కా నాగమణి పి గన్నవరం నియోజకవర్గం తొత్తరమూడి గడ పగడపకు వైఎస్‌ఆర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.