ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిసెంబరు 22 నుంచి సోమశిల నుంచి పాదయాత్ర ప్రారంభించి అన్ని మండలాలు తిరుగుతానని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిసెంబరు 22 నుంచి సోమశిల నుంచి పాదయాత్ర ప్రారంభించి అన్ని మండలాలు తిరుగుతానని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనుమసముద్రంపేట లోని వీజీఆర్ రైస్ మిల్లు సమీపంలో శుక్రవారం మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, ఆ పార్టీ యువ నాయకులు పందిళ్లపల్లి గోపిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పరిచయ సమావేశంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఆత్మకూరు తమ సొంత నియోజకవర్గమని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. జిల్లాలో ఆత్మకూరును రోల్‌మోడల్ నియోజకవర్గంగా చేస్తానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు.