కృష్ణానగర్ రైల్వేగేటు వద్ద నిలిచిపోయిన పనులను పరిశీలిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ధ్వజం
– నిలిచిపోయిన కృష్ణానగర్ బ్రిడ్జిపనుల పరిశీలన
కర్నూలు (ఓల్డ్‌సిటీ): చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన ఐదు రైల్వే వంతెనల నిర్మాణ పనులు ముందుకు సాగకుండా చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి కృష్ణానగర్ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. గుంతలు తవ్వి వదిలేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, నందికొట్కూరు ఇన్‌చార్జి అశోక్‌రత్నం, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్.వేణుగోపాల్, ఎస్.సలాం, కె.పెద్దారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ బీసీసెల్ ఉపాధ్యక్షుడు శివకుమార్, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ సుదర్శన్‌రెడ్డి, కార్యదర్శులు సత్యంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్సీసెల్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు.