ప్రజా సమస్యలకు పరిష్కారమేదీ?
ప్రజా సమస్యలకు పరిష్కారమేదీ?
Published Mon, Sep 19 2016 9:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
– చూద్దాం..చేద్దామంటూ కాలయాపన
– మీ కోసం కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతులు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. కనీసం వారి సమస్య వినే ఓపిక కూడా అధికారులకు లేదు. వివిధ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఎంతో వ్యయ ప్రయాసలు పడి సోమవారం కలెక్టరేట్‌లోని మీ కోసం కార్యక్రమానికి వ చ్చిన ప్రజలకు అధికారులు భరోసా ఇవ్వలేకపోయారు.lబాధితుల నుంచి వినతులు తీసుకుని చూద్దాం.. చేద్దామంటూ సమాధానం చెప్పడంతో వారు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. సునయన ఆడిటోరియంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్ తదితరులు వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వినుతుల వెల్లువెత్తాయి.
వచ్చిన సమస్యల్లో ముఖ్యమైనవి కొన్ని..
చెరువులకు హంద్రీ నీవానీళ్లు వదలండి:
దేవనకొండ గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో హంద్రీనీవా కాలువ ఉంది. అక్కడక్కడ బ్రిడ్జి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పందికోన రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా దేవనకొండలోని రెండు చెరువులకు నీళ్లు ఇవ్వండి. తాగునీటి సమస్య తీరడంతో పాటు పశువులకు నీరు దొరుకుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. పిల్ల కాల్వలను మేమే సొంతంగా తవ్వుకుంటాము. అనుమతి ఇవ్వాలని ఎంపీపీ రామచంద్రనాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు భర్త ఉబ్బీరప్ప, ఎంపీటీసీ సభ్యుడు నరసారావు, వీరేష్, వైసీపీ నాయకుడు కిట్టు తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
నీటి సమస్య పరిష్కరించండి :
ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఉంది. ఎస్‌ఎస్ ట్యాంకులో పూర్తిగా నీళ్లు అడుగంటి పోయాయి. గ్రామంలో కేవలం ఒక బోరు మాత్రమే పని చేస్తుంది. కరెంటు లేకపోతే చుక్కనీరు రాదు. వెంటనే తగిన చర్యలు తీసుకుని నీటి సమస్య పరిష్కరించాలని సర్పంచ్ పాపన్న, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బన్న, రైతు సంఘం నేతలు కోరారు.
రూ.20 వేలు లంచం ఇచ్చినా సర్వే చేయడం లేదు:
మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలోని 7 సర్వే నెంబర్లలో 19.60 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో నావాట 4.50 ఎకరాలు ఉంది. ఈ భూమికి హద్దులు గుర్తించడానికి 3సార్లు చలానా కట్టినాను. రూ.20 వేలు లంచం ఇచ్చాను. అయినా, ఇంతవరకు సర్వే చేయలేదు. మీరైనా స్పందించి పొలం సర్వే చేయించాలని కోరారు.
Advertisement
Advertisement