'హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం' | we participate in GHMC elctons loksattha leader srinivasa rao | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం'

Published Sun, Aug 9 2015 8:39 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

we participate in GHMC elctons loksattha leader srinivasa rao

విజయవాడ: హైదరాబాద్‌లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేస్తామని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో శనివారం జరిగిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. త్వరలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కార్యవర్గాల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో, తెలంగాణలోని హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ రాజ్యాంగం మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ద్వారా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement