
లక్కవరపుకోట(శృంగవరపుకోట): దేశంలో గడిచిన మూడేళ్లలో కనీస అభివృద్ధి కూడా జరగలేదని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతం కన్నా ఇప్పడు మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రధాని మోదీ అనడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్యం అందక జనం విలవిల లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు.