న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును... లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటు, ప్రజల భాగస్వామ్యం లేకుండా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దశాబ్దకాలంగా జాతీయ న్యాయ నియామక వ్యవస్థను సమర్ధించిన వారిలో తానూ ఒకడినని జేపీ శుక్రవారమిక్కడ అన్నారు.