జయప్రకాశ్ నారాయణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై చాలా కాలం తరువాత లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నోరు విప్పారు. ప్రభుత్వ నిధులను ఖర్చుపెట్టే తీరును తప్పుపట్టారు. 30 కోట్ల రూపాయలతో ఆర్భాటంగా ప్రమాణం చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అని అడిగారు.
ఆర్థిక, పాలన కేంద్రీకరణ జాతి ప్రగతికి హానికరం అని హెచ్చరించారు. తెలుగుజాతి విడిపోవడానికి ఇదే కారణం అని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు అవసరమంటూ మోసపూరితమైన కోరికలు కోరడం సరికాదని జయప్రకాశ్ నారాయణ అన్నారు.
**