పిల్లలకు ఏకాగ్రత ఉండటం లేదు, ఎదుగుదల సరిగా లేదు.. అని పెద్దల నుంచి కంప్లైంట్స్ తరచూ వింటూ ఉంటాం. పిల్లల్లో ఆందోళన, చికాకు తగ్గడానికి యోగాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దలు చేసే విధంగా పిల్లలకు యోగా సాధన కుదరదు. చిన్న చిన్న మార్పులు చేసి, పిల్లలచే సాధన చేయిస్తే వారి ఉన్నతికి యోగా ఒక బలమైన పునాదిగా ఉంటుంది. ముందు ఓ పది నిమిషాలు పిల్లలతో చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించాలి. దీనివల్ల వారి శరీరం యోగాభ్యాసానికి సిద్ధం అవుతుంది. ఆ తర్వాత 12 సూర్యనమస్కారాలు చేయించాలి. పిల్లలకు ఏకాగ్రత, ఎదుగుదలకు సహకరించేవి..
ఆక్సీజన్ గా..
ముందు నిటారుగా నిల్చోవాలి. రెండు కాళ్లలో ఒక కాలిని మోకాళ్ల వద్ద వంచుతూ, ΄ాదాన్ని నిలుచుని ఉన్న కాలు తొడ భాగంలో ఉంచాలి. హృదయం దగ్గర నమస్కార భంగిమ లో చేతులను ఉంచి, రెండు శ్వాసలు తీసుకుని వదిలాక, చేతులు రెండూ పైకి ఎత్తి నిల్చోవాలి. ఈ ఆసనం ద్వారా శరీరాన్ని బ్యాలెన్డ్స్‌గా ఎలా ఉంచాలో తెలుస్తుంది. ఒక చెట్టు ఆక్సిజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో అలాంటి భంగిమ కాబట్టి పిల్లల శ్వాసక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుంది.
– జి. అనూ షారాకేష్
యోగ గురు
Comments
Please login to add a commentAdd a comment