సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలసి వెళ్లాలని భావించిన లోక్‌సత్తాకు భంగపాటు కలిగింది. పొత్తుల కోసం ఎన్ని మార్లు ప్రయత్నించినా ఆ రెండు పార్టీల నుంచి స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ సోమవారం అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
పార్లమెంట్: సికింద్రాబాద్- పి.రోహిత్‌కుమార్, చేవెళ్ల- ఏనుగు రామారావు, మహబూబాబాద్- రవీంద్రనాయక్. అసెంబ్లీ: ఉప్పల్- బండారు రాంమోహన్, కంటోన్మెంట్- దాసరి రత్నం, అంబర్‌పేట- మెట్ల జగన్‌మోహన్, మహేశ్వరం- దేవి ప్రసాద్, ఇబ్రహీంపట్నం- మల్లారెడ్డి, కార్వాన్- సాయిబాబ, మలక్‌పేట- ఎ.హనుమంతరావు, కామారెడ్డి- పద్మా చంద్రశేఖర్, జుక్కల్- ఏకే లత, బాల్కొండ- బండారి అనంత్, నిజామాబాద్ అర్బన్- దొడ్ల శేఖర్, పటాన్‌చెరు- సుధీర్‌రెడ్డి, సంగారెడ్డి- మాధవరెడ్డి, మహబూబ్‌నగర్- గౌస్‌మొహినుద్దీన్, షాద్‌నగర్- డా.నరేంద్ర, మిర్యాలగూడ- శ్రీనివాసరెడ్డి, కోదాడ- గోవిందరావు, తుంగతుర్తి- శ్రీనివాసరావు, హుజూర్‌నగర్- కృష్ణనాయక్ బుక్యా, వరంగల్‌వెస్ట్-చంద్రశేఖర్, వరంగల్‌ఈస్ట్- జగదీశ్వర్‌రావు, వర్దన్నపేట- జట్టురవి, మహబూబాబాద్- మూల్‌చంద్, సిరిసిల్ల- సంవర్ధిని, రామగుండం- డా.జి.మహేశ్వర్, కోరుట్ల- వి.భూమానందం, కరీంనగర్- వంశీకృష్ణ, బెల్లంపల్లి- రాంమోహన్‌రావు, చెన్నూరు- మేకల సరోజ.
మల్కాజ్‌గిరి నుంచి జేపీ నామినేషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సినీ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, భార్య శ్రీవల్లి, పార్టీ నేతలు బండారు రాంమోహన్, కార్తీక్ చంద్రలతో కలిసి వెళ్లి జేపీ నామినేషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మధ్యాహ్నం నామినేషన్ జేపీ దాఖలు చేశారు.