
జయప్రకాశ్ నారాయణ
హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ స్థానిక ఎన్నికల మేనిఫెస్టోని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈరోజు ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా ఎన్నికలు జరపాలని తాము తొలి నుంచీ పోరాడుతున్నామన్నారు. రాష్ర్ట బడ్జెట్ రూ.1 లక్ష 82వేల కోట్ల బడ్జెట్‌ను నేతలు కేవలం మూజువాని ఓటుతో ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు. ఏడాదికి తలసరి ఖర్చు రూ.22, 500 పెట్టాల్సి ఉన్నా అది జరగడం లేదని చెప్పారు. కనీసం వార్డు స్థాయిలోనైనా వ్యక్తికి రూ.1000 ఖర్చుచేసి అభివద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఏటా వస్తున్న రూ.4లక్షల50వేల కోట్లలో గ్రామాల్లో కనీసం 1/3వ వంతు కూడా ఖర్చుచేయకపోవడం ఆందోళనకరమన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులేమయ్యోయన్నారు.
ఓటర్ల జాబితా తప్పులతడకగా మారిందని, రాజకీయనేతలు వారికి కావాల్సిన ఓట్లు తప్పితే ఇతరుల ఓట్లను మాత్రం తొలగించే పనిలో పడ్డారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ర్టంలో తమ పార్టీ 110మున్సిపాలిటీ, 8కార్పోరేషన్లలోనూ పోటీచేస్తోందని, స్థానిక ఎన్నికల్లో చిన్నచిన్న సర్దుబాట్లు తప్పవని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో జన మేనిఫెస్టో అని తాము చెబుతున్నవన్నీ పరిష్కరించదగినవేనని, చిన్నచిన్నవేనని తెలిపారు.