'అందుకే ఎమ్మెల్యేలు శశికళతో ఉన్నారు'
'అందుకే ఎమ్మెల్యేలు శశికళతో ఉన్నారు'
Published Wed, Feb 15 2017 4:08 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
విజయవాడ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమంగా వేల ఆస్తులు కూడబెట్టారు కాబట్టే ఎమ్మెల్యేలు ఆమె వైపు చూస్తున్నారని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు మాత్రం పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. శశికళకు సీఎంగా అయ్యేందుకు ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. దేశంలో డబ్బు రాజకీయం పోవాలంటే రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలన్నారు. దీనివలన మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల వ్యవస్థను లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్యే ద్వారా కాకుండా ప్రజలే సీఎంను ఎన్నుకోనే విధానం ద్వారా రాష్ట్రాల్లో అవినీతి తగ్గుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలనే కాకుండా సమాజంలో ఉండే నిజాయితీ పరులను మంత్రులుగా చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు సమస్యలు మీద కాకుండా సంపాదన మీద దృష్టి సాధిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ప్రతి విషయాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభుత్యం దృష్టి సాధించటం లేదని ఆరోపించారు. ప్రతి విషయాన్ని మ్యాజిక్ చేయాలనీ సీఎం చూస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చివరికి ప్రగల్బాల, ఆర్భాటాల రాష్ట్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు.
Advertisement