మల్కాజ్గిరి నుంచే పోటీ : జెపి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈరోజు ప్రకటించారు. ప్రజా సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంపై వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల కన్నుపడిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నాయకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సామాజికవేత్త, నటి చందనా చక్రవర్తిని పోటీకి దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి తరపున పోటీ చేయడానికి రేవంత్ రెడ్డితోపాటు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావులు పోటీ పడుతున్నారు.