హైదరాబాద్: టిడిపి అభ్యర్థి అనుచరులు డబ్బు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. మల్కాజ్‌గిరి లోక్సభ స్థానం టిడిపి అభ్యర్థి మల్లారెడ్డి అనుచరుల సూరారం ఎంబి గ్రామర్ హైస్కూల్లో ఓటర్లకు డబ్బు పంచుతుండగా అధికారులు పట్టుకున్నారు. ఎంబి గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపల్ సహా మల్లారెడ్డి అనుచరులను అధికారులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రచార సామాగ్రిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఎన్నికల సోదాల్లో 124 కోట్ల 14 లక్షల 80 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. 4 లక్షల 40 వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తనిఖీలు చేసే సమయంలో 14 వేల 616 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 8278 బెల్ట్‌షాపులను మూయించామన్నారు. అక్రమ మద్యంపై 33 వేల కేసులు నమోదైనట్లు తెలిపారు. అలాగే 70.6 కిలోల బంగారం, 707 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్ లాల్ చెప్పారు.
అడ్డంగా దొరికిపోయారు
Published Sat, Apr 26 2014 6:11 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
Advertisement
Advertisement