మళ్లీ కూకట్‌పల్లి నుంచే జేపీ
25 మందితో లోక్‌సత్తా తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజలు మరోసారి లోక్‌సత్తానే గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను లోక్‌సత్తా శుక్రవారం ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తొమ్మిది, తెలంగాణలో ఐదు, కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని మరో 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రజలు కోరుకుంటే నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రి అవుతానని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. విభజనపై సీమాంధ్రలో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జనవరి 30లోగానే కేంద్రం మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే ఏర్పాట్లను ప్రకటించాలని కోరారు.
లోక్‌సత్తా తొలి జాబితా అభ్యర్థులు వీరే...
కూకట్‌పల్లి- జయప్రకాష్ నారాయణ, శేరిలింగంపల్లి- కటారి శ్రీనివాసరావు, ఎల్బీనగర్- దోసపాటి రాము, సనత్‌నగర్- హైమా ప్రవీణ్, జూబ్లీహిల్స్- బొంతు సాంబిరెడ్డి, ముషీరాబాద్- కొంగర గంగాధరరావు, నాంపల్లి- కంతిమతి కన్నన్, మల్కాజ్‌గిరి- దిలీప్ శంకరరెడ్డి, రాజేంద్రనగర్- కొత్త సోల్కర్‌రెడ్డి, ఎల్లారెడ్డి- డాక్టర్ మర్రి రాంరెడ్డి, సిద్దిపేట- టి.శ్రీనివాస్, హుస్నాబాద్- గొల్లం రవి, భూపాలపల్లి- గట్టయ్య, ఖమ్మం- పి.రవిమారుత్, విశాఖపట్నం ఉత్తరం- భీశెట్టి బాబ్జీ, విశాఖ పశ్చిమ- నాయుడు వేణుగోపాలరావు, కాకినాడ టౌన్- వైడీ రామారావు, పెడన- సీహెచ్ వజీర్, గుంటూరు పశ్చిమ- జే ఐరామూర్తి, ఒంగోలు- అల్లు శివరమేష్‌రెడ్డి, నెల్లూరు- నర్రా శ్రీధర్, గూడూరు- కృష్ణయ్య, సూళ్లూరు పేట- వెంకటేశ్వర్లు, తిరుపతి- సిద్ధయ్య నాయుడు, నంద్యాల- డాక్టర్ శౌరిరెడ్డి.