బీజేపీ, టీడీపీతో పొత్తులుంటాయి: జేపీ
జనసేనతోనూ కలిసి పనిచేస్తామని వెల్లడి
లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, లోక్‌సత్తా, జనసేన పార్టీలు కలసి పనిచేస్తాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ(జేపీ) వెల్లడించారు. కొన్ని టీవీ చానళ్లతో శనివారం మాట్లాడుతూ జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఇప్పుడున్న పరిస్థితిలో మా పార్టీకి పొత్తులు అవసరమనే నిర్ణయానికి వచ్చాం. బీజేపీతో కలసి పనిచేయడానికి లోక్‌సత్తా సిద్ధంగా ఉంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి మూడు పార్టీలు కలసి పనిచేస్తాయి. పవన్ మద్దతు ఇస్తానని ముందుకొస్తున్నారు కాబట్టి అందరం కలిసి ఈ రోజు ప్రజల కోసం ఒక స్పష్టమైన విధానాన్ని ఇస్తాం’ అని తెలిపారు.