టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రజలు రాజకీయంగా యావజ్జీవ శిక్ష విధించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రెండుసార్లు ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు మళ్లీ అధికారం కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నిజస్వరూపం దేశం మొత్తానికీ తెలిసిపోయిందని, అందుకే ఆయన దీక్షను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. లోక్సత్తా నేత జయప్రకాశ్ నారాయణ చంద్రబాబుకు తబలా కొట్టడం సరికాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను జేపీ ఎందుకు ప్రశ్నించడంలేదు? అని అడిగారు. రాష్ట్ర విభజనపై నిజాయతీ ఉంటే చంద్రబాబు, జేపీలు అసెంబ్లీని సమావేశపరచమని ఎందుకు అడగరు? సమైక్యాంధ్ర గురించి మాట్లాడటానికి చంద్రబాబూ నీకు దమ్ముందా? ఇంత మంది ప్రజలు వ్యతిరేకిస్తున్న విభజన నిర్ణయాన్ని నీవు ఎందుకు వ్యతిరేకించవు? అని జూపూడి ప్రశ్నించారు. ''చంద్రబాబుకు పిచ్చి ముదిరింది. అందుకే జగన్పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూసి ప్రజలంతా బాబుకు పిచ్చి పట్టిందని నమ్ముతున్నారు. రోజూ కాంగ్రెస్ కొంగు చాటున రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ప్రజాదరణ చూసి ఉలిక్కి పడుతున్నారు. నిజాయతీ రాజకీయాలు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. నిజాయతీ రాజకీయాల కోసం జగన్ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటున్నారు. అందుకే జైల్లో ఉండి కూడా ప్రజల కోసం దీక్ష చేశారు. సమైక్యాంధ్ర కోసం నిజాయతీగా పోరాటం చేస్తున్నారు'' అని చెప్పారు.
Published Sat, Nov 9 2013 4:03 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement