
యూఎస్ కాన్సులేట్ వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన
బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ వద్ద తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఆందోళనకు దిగారు. భారత జాతిపిత మహాత్మ గాంధీ ని అవమానించినందుకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. అమెరికా కాన్సులేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు న్యాయవాదులు ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
మహాత్మ గాంధీ పేరు, చిత్రాలతో కూడిన బీరు టిన్ లను తయారు చేసి అమెరికా కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది.అమెరికా కనెక్టికట్‌లోని న్యూ ఇంగ్లాండ్ బ్రెవింగ్ కంపెనీ ఈ బీర్ టిన్స్ తయారు చేసింది. దీనిపై భారత్‌తో పాటు అమెరికాలోని భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది.