హైదరాబాద్: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, అలయన్స్ ఫర్ కమర్షియలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ (ఎసిఐఆర్) భాగస్వామ్యంతో ఇంటెన్సివ్ అకాడమీని విజయవంతంగా పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలను యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్‌లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపారాల అభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళిక, మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. ఆరు నెలల పాటుసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన 60మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
మహిళా నాయకత్వం, మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం అమెరికా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని జెన్నిఫర్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల అకాడమీ, వనరులు, కనెక్షన్‌లతో మహిళలను శక్తివంతం చేయడంతోపాటు, ఇండియాతో తమ భాగస్వామ్య లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ తమ క్యాంపస్‌లలో ఏడబ్ల్యూఈ కోహార్ట్‌లను నిర్వహిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో శుక్రవారం కాన్సులేట్ నిర్వహించిన అకాడమీ ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (ఏడబ్ల్యూఈ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం (నవంబర్ 22) జరిగింది. ఈ నెల(నవంబర్) 26న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మరో ఈవెంట్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment