
మార్చి 8న జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షలు
హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)ల పరీక్షలకు ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దాంతో మార్చి 8న జూనియర్ సివిల్ జడ్జిల పరీక్ష యథాతధంగా జరగనుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటివరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టి. న్యాయవాదులంతా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేసే వరకు జూనియర్ సివిల్ జడ్జిల పరీక్షలు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. తెలంగాణ న్యాయవాదుల పిటిషన్ను తిరస్కరించింది. జేసీజే పరీక్షలను ఆదివారం నాడు నిర్వహించాలని, పరీక్షల అనంతరం తుది ఫలితాలను సీల్డ్ కవర్లో ఉంచాలని హైకోర్టు సూచించింది.