సంగారెడ్డి క్రైం : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు జిల్లా కోర్టుతో సహా సిద్దిపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు సమైక్య సంకెళ్లు ఇంకెన్నాళ్లు అంటూ నినదించారు. తెలంగాణ ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యర్శి వీరన్న పాటిల్, ఆర్ మాణిక్‌రెడ్డి, ఎం జైపాల్‌రెడ్డి, ఆర్ శ్రీనివాస్, బాల్‌రెడ్డి, రవీందర్, సంజీవరెడ్డ, వెంకట్‌రాములు, శివకుమార్, భగవాన్‌రావు, అంబరీష్, వర్మ, నాగరాజు, ప్రసాద్, బాలరాజు, అరుణ్ నాగిశెట్టి, అమర్‌నాథ్‌రావు, కసిరెడ్డి శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నారాయణ, సదానందం, చంద్రయ్యస్వామి, ప్రసాద్, ప్రభుదాన్యం, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జోన్ : స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జుడీషియల్‌కు సంబంధించిన పోస్టుల ను తెలంగాణ ప్రాంత వ్యక్తులచే భర్తీ చే యాలన్నారు. సమస్యలు విస్మరిస్తే భవిష్యత్తులో నిరవధికంగా విధులకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రమేష్‌బాబు, పవన్‌కుమార్, సంజయ్‌కృష్ణ, నరసింహారెడ్డి, సాయిబాబ, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
నర్సాపూర్ : తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో విధులు బహిష్కరించినట్లు చెప్పారు.
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
Published Fri, Jun 13 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement
Advertisement