డయల్ 100కు 175 సార్లు ఫోన్: వ్యక్తిపై కేసు | man held for 175 calls to dial 100 | Sakshi
Sakshi News home page

డయల్ 100కు 175 సార్లు ఫోన్: వ్యక్తిపై కేసు

Published Mon, Dec 23 2013 1:43 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

man held for 175 calls to dial 100

హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యవసర సమయాల్లో సమాచారం అందించేందుకు పోలీసు శాఖ ఏర్పాటు చేసిన డయల్ 100 ఫోన్ నెంబర్‌కు వరుసగా 175 సార్లు ఫోన్ చేసిన ఆలూరి చిన్నా అనే వ్యక్తిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న చిన్నా తన సెల్‌ఫోన్ నుంచి వరుసగా 175 సార్లు డయల్ చేశాడు. ఫోన్ చేసిన ప్రతీసారి ఏం మాట్లాడకుండా పెట్టేశాడు. అత్యవసర సేవల కోసం కేటాయించిన ఫోన్‌నెంబర్‌కు అనవసరంగా ఫోన్‌చేసి విధులకు ఆటంకం కలిగించినందుకుగాను చిన్నాపై కేసు నమోదుచేసినట్లు డీఐ కె. శంకర్ తెలిపారు. అత్యవసర సేవల కోసం కేటాయించిన ఫోన్ నెంబర్లకు ఎవరైనా అనవసరంగా ఫోన్‌చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement