సాక్షి, హైదరాబాద్: సైదాబాద్‌కు చెందిన రాజేశ్వర్ గతనెల 22న గ్యాస్ బుక్ చేయగా.. ఈనెల 2న సిలిండర్ ఇంటికి చేరింది. రూ.1096 చెల్లించి సిలిండర్ తీసుకున్నారు. సబ్సిడీ నగదు మాత్రం ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో జమకాలేదు.
కూకట్‌పల్లికి చెందిన సుజాత పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది. ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీలను గ్యాస్ ఏజెన్సీలో, బ్యాంకులో రెండుచోట్లా ఇచ్చారు. ఇప్పటివరకు ఆధార్ కనెక్ట్ కాలేదు. అదేమంటే రేపు..మాపు అంటూ తిప్పుతున్నారు. ఇవీ ఒక్క రాజేశ్వర్, సుజాతల సమస్యలే కాదు..మహానగరంలో లక్షలాదిమంది గ్యాస్ వినియోగదారుల సమస్య.
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదుబదిలీ పథకం ఆరంభంలోనే నవ్వులపాలవుతోంది. ఎంతో కసరత్తు చేసి దీన్ని ప్రారంభించామని ప్రకటించిన ప్రభుత్వం..గ్యాస్ వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపుతోంది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ ముట్టుకోవాలంటేనే భయమవుతోందని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ నగదు ఖాతాలో జమ కాక పూర్తిస్థాయి రీఫిల్లింగ్ ధరలను భరించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కొందరు వినియోగదారులకు సబ్సిడీ నగదు అసలు బదిలీ కాకపోగా, మరికొందరికి అడ్వాన్‌సగా బ్యాంకు ఖాతాలో జమఅయినా..రెండు,మూడోసారి మాత్రం తీవ్రజాప్యం జరుగుతోంది. చేసేదిలేక వినియోగదారులు సబ్సిడీ నగదు కోసం డీలర్ల, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
సబ్సిడీ కొందరికే..: వంటగ్యాస్‌కు నగదుబదిలీ అమలుతో ‘సబ్సిడీ’పై అయోమయం నెలకొం ది. ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైనా రీఫిల్లింగ్‌పై సబ్సిడీ వస్తుందో రాదో? అర్థంకాని దుస్థితి ఏర్పడింది. సిలిండర్‌కు మా త్రం మార్కెట్ ధర చెల్లించక తప్పడంలేదు. గ్రే టర్‌లో ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లుండగా, అందులో 68 శాతం కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. అం దులో బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైన కనెక్షన్లు 46 శాతానికి మించలేదు. ఆధార్,బ్యాం కు రెండింటితో అనుసంధానమైన వారు మాత్ర మే సబ్సిడీకి అర్హులు కాగా, అందులో సైతం సగంమందికే సబ్సిడీ నగదు జమవుతోంది.
బాధ్యులెవరు..?
ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైనా.. సబ్సిడీ నగదు బదిలీపై జవాబుదారీతనం లేకుండాపోయింది. ఇటు డీలర్లు, అటు బ్యాంకర్లు తమకు సంబంధం లేదంటే తమకులేదని పట్టించుకోవడం లేదు. ఫలితంగా నగదు బదిలీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) పరిధిలోని భారత జాతీయ చెల్లింపు సంస్థ(ఎన్‌పీసీఐ) అనుసంధానంలో సాంకేతిక తప్పిదాలే సమస్యకు కారణమని అధికారులు అంటున్నారు. వాస్తవంగా కేంద్రం సబ్సిడీ మొతాన్ని ఆయిల్ కంపెనీలకు విడుదల చేస్తే..కంపెనీలు ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాయి. ఎన్‌పీసీఐ అనుసంధానం ఆధారంగా సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలో జమవుతుంది. సిలిండర్ ఆన్‌లైన్‌లో బుక్ కాగానే సంబంధిత డీలర్ల ద్వారా ఆయా కంపెనీలు ఓఎంసీలకు అనుసంధానమై అక్కడ్నుంచి ఎన్‌పీసీఐలకు మ్యాపెడ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాపెడ్‌లో ఎలాంటి సాంకేతిక తప్పిదం జరిగినా.. నగదు బదిలీ పెండింగ్ పడిపోతోంది. ఇలా నగరంలో సుమారు 52శాతం మంది వినియోగదారులకు నగదు బదిలీలో ఆటంకం తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇదీ లెక్క..
చెల్లిస్తున్న ధర సబ్సిడీ ధర సబ్సిడీ నగదు జమయ్యేది అదనపు భారం
రూ.1096 412.50 రూ.626.39 రూ. 57.10 (అమ్మకం పన్ను)
నగదు బదిలీ.. నవ్వులపాలు
Published Sun, Oct 13 2013 11:42 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement