కూతురుకు మత్తుమందు ఇచ్చి.. | mother tries to drag her daughter into prostitution | Sakshi
Sakshi News home page

కూతురుకు మత్తుమందు ఇచ్చి..

Published Fri, Mar 25 2016 7:11 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

కూతురుకు మత్తుమందు ఇచ్చి..

కూతురుకు మత్తుమందు ఇచ్చి..

హైదరాబాద్: కూతురి పట్ల ఓ సవతి తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కూతురును బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దించి ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఓ యువతి తన సవతి తల్లి నుంచి రక్షణ కల్పించమని సైఫాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది.

సైఫాబాద్లో ఓ మహిళ తన కూతురుకు మత్తుమందు ఇచ్చి వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించింది. అయితే కూతురు భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకుంది.  ఈ విషయం తెలిసిన సవతి తల్లి, రౌడీలతో వెళ్లి అక్కడ గొడవ చేసింది. అంతేకాకుండా తన కూతురు కనిపించడం లేదంటూ, బంగారం దొంగలించిందంటూ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన యువతి... జరిగిన విషయం పోలీసులకు తెలిపింది. తన తల్లి వ్యభిచారం చేయమని బలవంతం చేస్తోందని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికులు కూడా అండగా నిలిచి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement