
చండీగఢ్: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికి పోయాయి. మహమ్మారి కట్టడి కోసమని ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక లాక్‌డౌన్ కారణంగా చాలా రంగాలు కుదేలవడమే గాక వాటిపై ఆధారపడుతున్న బతుకులను తలకిందులు చేసిందనే చెప్పాలి. కొందరి పరిస్థితి దయనీయంగా మారి పూటకు కూడా తిండి దొరకని తిప్పలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కనీస అవసరాలను తీర్చుకోవాడానికి ఓ తల్లి కూతుర్లు వేశ్య వృత్తిని ఎంచుకునేలా చేసింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.
వేరేదారి లేక వేశ్యలుగా మారాం
వివరాలు ప్రకారం.. పంజాబ్‌లోని ముక్త్సార్‌లో ఇటీవల విధించిన లాక్‌డౌన్ కారణంగా ఓ తల్లి తన కూతురు వారి ఉద్యోగాన్ని కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో రోజులు గడిచే కొద్ది వాళ్ల పరిస్థితి దయనీయ స్థితికి చేరుకుంది. ఎంత ప్రయత్నించినా వేరెక్కడా పని దొరకలేదు. ఒక్కోరోజు తిండి తినడానికి కూడా కష్టమవడంతో, చివరికి వేరేదారిలేక పొట్టకూటి కోసం ఆ తల్లి వేశ్యగా మారింది.
అంతేకాదు తన కూతురిని కూడా వేశ్యగా మార్చేసింది. వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి ఓ ప్రాంతంలో రైడ్ చేయగా అందులో ఈ తల్లి కూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ మహిళ ఆకలి బాధ తట్టుకోలేక, వేరే పని దొరకకపోవడంతో ఇలా వేశ్య వృత్తిని ఎంచుకున్నట్లు వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment