
లండన్: కరోనా భయంతో బ్రిటన్‌లో నివసిస్తున్న సుధా శివనాధం తన ఐదేళ్ల కూతురిని చంపుకుంది. తనకు కోవిడ్ కారణంగా మరణం తప్పదని, తాను లేకపోతే తన చిన్నారిని ఎవరూ చూడరనే భయంతో కూతురుని చంపేసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. గతేడాది జూన్ 30న కూతురు సయాగిని 15 సార్లు పొడిచి సుధా హత్య చేసిందని, అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిసింది.
వైరస్ సోకుతుందనే భయం, లాక్‌డౌన్ నిబంధనలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆమె భర్త సుఖనాథన్ చెప్పారు. విచారణ అనంతరం ఆమె మానసిక పరిస్థితి బాలేదని భావించిన న్యాయస్థానం జీవితాంతం ఆస్పత్రిలోనే ఉంచాలని ఆదేశించింది. 2006 నుంచి వీరు యూకేలోనే ఉంటున్నారు.
చదవండి: దారుణం: సమాధులతో నిండిన పాఠశాల..మాతృ భాష శాపమైందా?
Comments
Please login to add a commentAdd a comment