కుప్పం: ప్రియురాలు పిలిచిందని లేడీస్‌ హాస్టల్‌లో దూరి.. | Young Man Enters PES Medical College Nursing Hostel In Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పం: ప్రియురాలు పిలిచిందని లేడీస్‌ హాస్టల్‌లో దూరి..

Published Tue, Sep 24 2024 10:09 AM | Last Updated on Tue, Sep 24 2024 10:36 AM

Young Man Enters PES Medical College Nursing Hostel In Kuppam

కుప్పం పిఈఎస్‌ మెడికల్‌ కళాశాల నర్సింగ్‌ హాస్టల్‌లోకి యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది.

సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం పిఈఎస్‌ మెడికల్‌ కళాశాల నర్సింగ్‌ హాస్టల్‌లోకి యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. కేరళ నుంచి ప్రియుడిని యువతి, పిలిపించుకుంది. ఒకే గదిలో ఆరుగురు నర్సింగ్ విద్యార్థినులు ఉండగా, బురఖా వేసుకొని మారు వేషంలో లేడీస్ హాస్టల్‌కు ప్రియుడు వెళ్లాడు.

ఆటో దిగి వ్యక్తి వెళ్తుండగా, గమనించిన ఆటో డ్రైవర్లు వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. గుడిపల్లి పోలీసులకు హాస్టల్‌ వార్డెన్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement