ఢిల్లీ: కాలేజీకి రెడీ అవుదామని బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఆ విద్యార్థిని ఒక్కసారే గావుకేక పెట్టింది.. ఏం జరిగిందోనన్న కంగారుతో లేడీస్ హాస్టల్‌లోని విద్యార్థునులంతా పరుగున వచ్చారు.. అంతకుముందెన్నడూ చూడనంత పెద్ద బల్లిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆలస్యం చేయకుండా కాలేజీ యాజమాన్యానికి కబురుపెట్టారు. నిమిషాల వ్యవధిలోనే వణ్యప్రాణి సంరక్షకులు వచ్చారు.. అది ఆఫ్రికా జాతికి చెందిన విషపూరిత బల్లిగా గుర్తించారు.. జాగ్రత్తగా మత్తుమందు ఎక్కించి, వెంటతీసుకెళ్లారు!!
ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నేతాజీ సుభాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఎస్‌ఐటీ)లో మే 16 చోటుచేసుకుందీ ఘటన. దట్టమైన చెట్ల మధ్యలో ఉండే ఆ క్యాపస్‌లో ఇలాంటి జీవిని ఇదివరకెప్పుడూ చూడలేదని విద్యార్థులు పేర్కొన్నారు. అంతకుముందురోజే భారీ వర్షం కురిసిన విషయాన్ని గుర్తుచేశారు. పెద్ద బల్లి ఘటన తర్వాత విద్యార్థినులంతా తమ గదుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆఫ్రికా జాతికి చెందిన ఆ విషపూరిత బల్లి కుడితే.. ప్రాణాపాయం ఉండనప్పటికీ తీవ్రమైన అనారోగ్యం, విపరీతమైన నొప్పి కలుగుతాయని వణ్యప్రాణి సంరక్షకులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment