big lizard
-
లేడీస్ హాస్టల్లో భయానక బల్లి!
ఢిల్లీ: కాలేజీకి రెడీ అవుదామని బాత్రూమ్లోకి వెళ్లిన ఆ విద్యార్థిని ఒక్కసారే గావుకేక పెట్టింది.. ఏం జరిగిందోనన్న కంగారుతో లేడీస్ హాస్టల్లోని విద్యార్థునులంతా పరుగున వచ్చారు.. అంతకుముందెన్నడూ చూడనంత పెద్ద బల్లిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆలస్యం చేయకుండా కాలేజీ యాజమాన్యానికి కబురుపెట్టారు. నిమిషాల వ్యవధిలోనే వణ్యప్రాణి సంరక్షకులు వచ్చారు.. అది ఆఫ్రికా జాతికి చెందిన విషపూరిత బల్లిగా గుర్తించారు.. జాగ్రత్తగా మత్తుమందు ఎక్కించి, వెంటతీసుకెళ్లారు!! ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నేతాజీ సుభాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఎస్ఐటీ)లో మే 16 చోటుచేసుకుందీ ఘటన. దట్టమైన చెట్ల మధ్యలో ఉండే ఆ క్యాపస్‌లో ఇలాంటి జీవిని ఇదివరకెప్పుడూ చూడలేదని విద్యార్థులు పేర్కొన్నారు. అంతకుముందురోజే భారీ వర్షం కురిసిన విషయాన్ని గుర్తుచేశారు. పెద్ద బల్లి ఘటన తర్వాత విద్యార్థినులంతా తమ గదుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆఫ్రికా జాతికి చెందిన ఆ విషపూరిత బల్లి కుడితే.. ప్రాణాపాయం ఉండనప్పటికీ తీవ్రమైన అనారోగ్యం, విపరీతమైన నొప్పి కలుగుతాయని వణ్యప్రాణి సంరక్షకులు వివరించారు. -
భారీ ఉడుమును భలే ఈడ్చిపారేసింది
న్యూసౌత్‌వేల్స్: చిన్న బొద్దింకను చూస్తేనే అమ్మాయిలు బాబోయ్ అంటూ అమ్మాయిలు ఎగిరిగంతేస్తారు.. అలాంటిది అచ్చం ఓ చిన్నసైజు గాడ్జిల్లాలాంటి ఉడుమును చూస్తే పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే ఉలిక్కిపడేట్టు ఉంది కదా! కానీ, ఓ అమ్మాయి ఆ ఉడుమును చూడటమే కాదు దాని తోకపట్టుకొని ఈడ్చి పారేసింది. తన రెస్టారెంటులో అడుగుపెట్టడానికి నీకెన్ని గుండెలు అన్నట్లుగా ఆ ఉడుమును అవలీలగా అదేదో కొబ్బరిమట్టను ఈడ్చుకెళ్లి బయటపడేసినట్లు విసిరేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని రెస్టారెంట్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఫేసబుక్‌లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. సామియా లిలా(25) అనే యువతి న్యూసైత్ వేల్స్‌లోని మిమోసా వైన్స్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తోంది. ఆ రెస్టారెంటులోకి అత్యంత అరుదైన రకానికి చెందిన భారీ ఉడుము వచ్చి అక్కడ ఉన్నవారిని హడలెత్తించింది. చాలామంది కేకలు పెట్టి భయంతో పరుగులు పెట్టేట్లు చేసినా ఆ యువతి మాత్రం దానిని చాలా సింపుల్‌గా తీసుకొని తోకపట్టి ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లింది. అది తిరగబడే ప్రయత్నం చేసినా ఎంతో నైపుణ్యంతో చాకచక్యంగా పట్టుకొని బయటకు పడేసి కస్టమర్లు అవాక్కయ్యేలా చేసింది. ఇలా ఎలా చేయగలిగావని ప్రశ్నించిన వాళ్లకు అలాంటి జంతువులంటే తనకు చాలా ఇష్టం అని, అందుకే దానిని పట్టుకోగలిగానని చెప్పుకొచ్చింది.