ఆందోళన చేస్తున్న విద్యార్థినిలు
బతిండా: పంజాబ్ బతిండా జిల్లా తల్వాండీ సాబొలోని అకాల్ యూనివర్సిటీలో అమానుష ఘటన వెలుగు చూసింది. క్యాంపస్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. విద్యార్థినులు ఆందోళన చేయడంతో బాధ్యులైన నలుగురు మహిళా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వాడేసిన శానిటరీ నాప్కిన్లను మరుగుదొడ్డిలో పడేయడంతో ఎవరు రుతుక్రమంలో పరీక్షించేందుకు దుస్తులు విప్పాలని హాస్టల్ వార్డెన్లు తమపై ఒత్తిడి తెచ్చారని విద్యార్థినులు ఆరోపించారు.
ఈ దారుణంపై వైస్ ఛాన్స్‌లర్ గుర్మైల్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన యూనివర్సిటీ అధికారులు.. హాస్టల్ వార్డెన్, అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్, ఇద్దరు మహిళా సెక్యురిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై తమకు విద్యార్థినిలు, యూనివర్సిటీ యంత్రాంగం నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తల్వాండీ సాబొ పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ) సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఉదంతం తమ పరిశీలనకు రాలేదని పంజాబ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment