Bathinda
-
ఘోర బస్సు ప్రమాదం.. 8 మంది మృతి
పంజాబ్: బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు.. కాల్వలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. జీవన్ సింగ్ వాలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.క్షతగాత్రులు షహీద్ భాయ్ మణి సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు సర్దుల్‌గఢ్ నుండి బఠాండాకు వెళ్తుండగా జీవన్ సింగ్ వాలా దగ్గర కాలువలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.2 people have died, while many others have been injured after a bus carrying nearly 50 passengers fell into a drain in Punjab's Bathinda. Rescue operations are underway.#Punjab #Bathinda pic.twitter.com/MwwfJlbhrd— Vani Mehrotra (@vani_mehrotra) December 27, 2024 -
కాల్పుల ఘటన వెనుక ఉగ్రకోణం ఉన్నట్లు అనుమానం
-
అమ్మాయిల హాస్టల్లో అమానుషం
బతిండా: పంజాబ్ బతిండా జిల్లా తల్వాండీ సాబొలోని అకాల్ యూనివర్సిటీలో అమానుష ఘటన వెలుగు చూసింది. క్యాంపస్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. విద్యార్థినులు ఆందోళన చేయడంతో బాధ్యులైన నలుగురు మహిళా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వాడేసిన శానిటరీ నాప్కిన్లను మరుగుదొడ్డిలో పడేయడంతో ఎవరు రుతుక్రమంలో పరీక్షించేందుకు దుస్తులు విప్పాలని హాస్టల్ వార్డెన్లు తమపై ఒత్తిడి తెచ్చారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ దారుణంపై వైస్ ఛాన్స్లర్ గుర్మైల్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన యూనివర్సిటీ అధికారులు.. హాస్టల్ వార్డెన్, అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్, ఇద్దరు మహిళా సెక్యురిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై తమకు విద్యార్థినిలు, యూనివర్సిటీ యంత్రాంగం నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తల్వాండీ సాబొ పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఉదంతం తమ పరిశీలనకు రాలేదని పంజాబ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీషా గులాటీ చెప్పారు. -
షాకింగ్.. అన్నాచెల్లెల పెళ్లి!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పచుకునేందుకు అన్నాచెల్లెలు ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్యాభర్తలుగా చెలామణి అవుతున్న వీరి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇదంతా చేశారని వీరి బంధువు ఒకామె పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడిందని ఆస్ట్రేలియా వార్తా సంస్థ ఎస్బీఎస్ డాట్‌కామ్ వెల్లడించింది. ఫిర్యాదు ఆధారంగా బథిండా జిల్లాలోని బాలియన్‌వాలా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరితో పాటు వారి ఆరుగురు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ పేర్కొన్నట్టు బాలియన్‌వాలా ఎస్ఐ జైసింగ్ తెలిపారు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఉంటున్న నిందితుడు తన సోదరిని కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు ఈ నాటకం ఆడాడు. ముందుగా తన సమీప బంధువు పేరుతో నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటితో గరుద్వారా నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకుని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారని జైసింగ్ వివరించారు. 2012లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉన్నారని, తాము దర్యాప్తు పూర్తి చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ కేసు తమను షాక్‌కు గురి చేసిందని పోలీసులు తెలిపారు. వీసా కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతుండడం తాము చూశామని, అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్నట్టుగా నటించడం ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యపోయారు. నకిలీ పెళ్లి పత్రాలతో తమ దేశానికి రావాలని చూస్తే కఠిన దండన తప్పదని భారతీయులకు గతేడాది ఆస్త్రేలియా హెచ్చరిక జారీ చేసింది. 32 ఏళ్ల భారతీయుడొకరు నిరుడు నవంబర్‌లో నకిలీ వివాహ పత్రాలతో దొరికిపోవడంతో ఈమేరకు వార్నింగ్ ఇచ్చింది. ఫోర్జరీ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో 164 మందికి భాగస్వామ్య వీసాలు నిరాకరించినట్టు ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తెలిపింది. -
హరిప్రీత్ ఎప్పుడూ రివర్స్ రూటే
-
హరిప్రీత్ ఎప్పుడూ రివర్స్ రూటే
చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలోని భటిండాకు చెందిన హరిప్రీత్ స్టైలే వేరు. అందరు కారును ముందుకు నడిపితే ఆయన వెనక్కి చూస్తూ కారును రివర్స్‌లో నడుపుతారు. అది మెల్లగా కాదు, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. తొలుత ఆయన స్టంట్ కోసమే కారును రివర్స్ నడపగా ఇప్పుడు అలవాటయింది. ముందుకు నడుపుమన్నా నడపలేరు. మెడలు వెనక్కి తిప్పి నడపడం వల్ల మెడలోని నరాలు అందుకు అనువుగా మారిపోయాయి. ఆయన ఇప్పుడు కారును ముందుకు నడపాలంటే ఆయన మెడ నరాలు సహకరించవు. అందుకని పంజాబ్ ప్రభుత్వం ఆయన కారును రివర్స్‌లో నడిపేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. లైసెన్స్‌ను కూడా మంజూరు చేసింది. అందరిలాగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని హరిప్రీత్ మొదటి నుంచి అనుకునే వారట. ఓ రోజున ఆయన కారు చెడిపోయిందట. ఫ్రంట్ గేర్లు పట్టేశాయట. రివర్స్ గేర్ మాత్రమే పనిచేస్తుందట. రిపేర్ చేయించేందుకు డబ్బులు లేవట. అందుకని ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న భటిండాకు రివర్స్‌లోనే కారును తీసుకొచ్చారట. అవును, కారును రివర్స్ నడపడం అనుభవం గడించినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది కదా? అనుకున్నారట. అప్పటి నుంచి కారును రివర్స్‌లో నడపడం ప్రారంభించారట. 2003 సంవత్సరం నుంచి కారును రివర్స్‌లో నడుపుతున్న హరిప్రీత్ అందుకు అనుగుణంగా తన కారులో కొన్ని మార్పులు చేశారట. రివర్స్‌లో కారు మరింత సులువుగా వెళ్లేందుకు, రోడ్డు సరిగ్గా కనిపించేందుకు మార్పులు, చేర్పులు చేశారట. ఆయన తోటి వాహనాదారులను హెచ్చరించేందుకు కారుపై రివర్స్ వెళ్లే కారేనని రాసుకున్నారు. ప్రస్తుతం హరిప్రీత్ కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
గేటుముందే విద్యార్థినిపై కత్తితోదాడి
భటిండా: పదో తరగతి ఫేయిలై జులాయిగా మారిన ఓ యువకుడు తొమ్మిదో తరగతి బాలికను ఏడిపిస్తూ ఏకంగా కత్తితో దాడికి దిగాడు. పాఠశాల ఆవరణలోనే దాడికి పాల్పడగా ఆ బాలిక గాయపడింది. ఈ ఘటన పంజాబ్‌లోని భటిండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం జస్బీర్ సింగ్(18) అనే ఓ యువకుడు భటిండాలోని పాఠశాల వద్దకు చేరుకొని ఓ పద్నాలుగేళ్ల బాలికతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అందుకు బాలిక నిరాకరించడంతో గేటు వద్దే గొడవకు దిగి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. దాడిని గమనించి అప్రమత్తమైన తోటి విద్యార్థులు, టీచర్లు ఆమెను రక్షించేందుకు పరుగులు తీయడంతో జస్బీర్ పరారయ్యాడు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో జస్బీర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరు. -
పంజాబ్‌లో ఆటవికం
డ్రగ్స్ అమ్మాడని కాళ్లు, చేయి నరికేశారు బటిండా: మత్తుపదార్ధాలు విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ 30ఏళ్ల ఓ వ్యక్తిని ఆటవికంగా కాళ్లు, చేయి నరికి చంపిన దారుణ ఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌లోని బటిండా జిల్లాలోని భగీ వందర్ గ్రామంలో గురువారం ఓ అల్లరిమూక ఈ దారుణానికి పాల్పడింది. రక్తమోడుతున్న అతడిని రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు. డ్రగ్స్ అమ్ముతున్నాడన్న ఆరోపణలపై అరెస్టయిన వినోద్ కుమార్ నాలుగు రోజుల క్రితం జైలు నుంచి బయటికొచ్చాడు. గురువారం కొందరు వినోద్‌తో వాదనకు దిగి చితకబాదారు. తర్వాత పదునైన ఆయుధంతో కాళ్లు, చేయి నరికేశారు. రక్తసిక్తమైన అతడిని కాపాడేందుకు ఎవరూ ధైర్యంచేయలేదు. ఈ దారుణాన్ని కొందరు మొబైళ్లలో వీడియోలు తీశారు. తర్వాత వినోద్‌ను తల్వాండి సాబూ ఆస్పత్రికి అక్కడి నుంచి ఫరీద్కోట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వినోద్ అక్కడే కన్నుమూశాడు. మొబైల్ వీడియోలను పరిశీలించి స్థానికుల గుంపుపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి గురైన స్కూటర్ కోసం ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి చంపేశారని వినోద్ తల్లిదండ్రులు ఆరోపించారు. -
జైలు ఆవరణలో కాల్పులు
భటిండా: పంజాబ్ లోని భటిండా జైల్లో కాల్పుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. జైలు ఆవరణలో ఖైదీల మధ్య గ్యాంగ్‌వార్‌గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో కరడుకట్టిన నేరస్తుడు గుర్జిత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం ఆయుధాల కేసులో అండర్ ట్రయిల్ ఖైదీ కుల్బీర్ సింగ్ నౌరానాకు ఈ కాల్పులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గత నెలలో నౌరానా సెల్ఫోన్లో మాట్లాడుతూ ఫోజులిచ్చిన ఫోటోలు ఫేస్బుక్ లో దర్శనమిచ్చాయి. ఆ తరువాత వాటిని పోలీసులు వాటిని తొలగించినట్టు సమాచారం.